Viral Video: డిఫరెంట్ గులాబ్ జామున్.. నోట్లో వేసుకుంటే మత్తులో తూగాల్సిందే!

బుర్రకో బుద్ది.. జిహ్వకో రుచు అని ఊరికే అనలేదు. ఒక్కొక్కరి ఆలోచనలో ఒక్కోలా ఉంటే.. ఒక్కొక్కరి నాలుకకి ఒక్కో రుచి బాగా నచ్చుతుంది. అయితే.. ఈ మధ్య కాలంలో వంటకాల మీద..

Viral Video: డిఫరెంట్ గులాబ్ జామున్.. నోట్లో వేసుకుంటే మత్తులో తూగాల్సిందే!

Viral Video

Viral Video: బుర్రకో బుద్ది.. జిహ్వకో రుచు అని ఊరికే అనలేదు. ఒక్కొక్కరి ఆలోచనలో ఒక్కోలా ఉంటే.. ఒక్కొక్కరి నాలుకకి ఒక్కో రుచి బాగా నచ్చుతుంది. అయితే.. ఈ మధ్య కాలంలో వంటకాల మీద రకరకాల ప్రయోగాలు చేసి వాటిని తెచ్చి సోషల్ మీడియాలో పెడుతున్న వ్యవహారాలు చూస్తూనే ఉన్నాం. ఇక మద్యం ప్రియులైతే అబ్బో చాలా ప్రయోగాలు చేస్తుంటారు. అయితే.. ఈ వీడియోలో అటు గులాబ్ జామున్ ను ఇటు మద్యాన్ని కలిపి కొత్త టేస్ట్ ఒకదాన్ని తీసుకొచ్చారు.

laknavaram Lake: ఇదేదో యూరప్ కంట్రీ కాదు.. మన లక్నవరం సరస్సే!

పిల్లలు, పెద్దలు అని లేకుండా గులాబ్ జామున్ అంటే అందరూ పడిచస్తారు. ఇక ఇళ్లలో వేడుకలలో ఇది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ గులాబ్ జామున్ తింటే కిక్కు ఎక్కాల్సిందే అనమాట. కిరిక్ అడ్డా అనే ఓ ఫేస్ బుక్ పేజ్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా.. పైకి గులాబ్ జామున్ ల తింటూ.. హ్యాపీగా మద్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు. దీంతో వాట్ ఆన్ ఐడియా సర్ జీ.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

TMC MP Nusrat Jahan: నా బిడ్డకి తండ్రెవరో ఆ తండ్రికి బాగానే తెలుసు!

సహజంగా చాలా మందికి మద్యాన్ని సేవించే సమయంలో స్వీట్స్ తినేందుకు ఇష్టపడరు. మద్యం సేవించే సమయంలో స్వీట్స్ తింటే మద్యం మత్తు ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తుంటారు. కానీ, కొందరు మాత్రం మద్యంతో పాటు స్వీట్స్ తింటుంటారు. అలాంటి వారికి మాత్రం ఈ ఐడియా భలే వర్క్ ఔట్ అవుతుంది. ఒకవైపు స్వీట్ టేస్ట్.. మరోవైపు లిక్కర్ ఘాటు అబ్బో ఆ టేస్ట్ సూపర్ అనేస్తున్నారు మద్యం ప్రియులు. ఏ మాట కామాట మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే సంగతి మర్చిపోవద్దు సుమీ!