Thalliki Vandanam : తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. నిధుల విడుదల వాయిదా..! కొత్త తేదీ ఇదే..
Thalliki Vandanam : ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు, ఇంటర్ కళాశాలలకు వెళ్లే విద్యార్ధులకు అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల తేదీ మారింది.
Thalliki Vandanam
Thalliki Vandanam : ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఏపీలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రతీయేటా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతీయేటా పాఠశాలుల, కళాశాలల పున: ప్రారంభమైన రోజున విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది.
తల్లికి వందనం పథకం కింద ప్రతీ విద్యార్థికి ప్రభుత్వం రూ.15వేల నగదు జమ చేస్తోంది. అయితే, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేలు జమకానుండగా.. పాఠశాల అభివృద్ధికి రూ.2వేల చొప్పున ప్రభుత్వం జమచేస్తుంది. ఈ పథకం కింద లబ్ధిపొందాలంటే ఆధార్ అనుసంధానంతో సహా అన్ని వివరాలు పక్కాగా ఉండటం కీలక. లేకుంటే ప్రభుత్వం విడుదల చేసే డబ్బులు జమకావని అధికారులు పేర్కొంటున్నారు.
ఈసారి పాఠశాలల పున:ప్రారంభం రోజున అంటే.. జూన్ 12వ తేదీన తల్లికి వందన పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఆ సమయంకంటే కాస్త ఆలస్యంగా తల్లివందనం డబ్బులు జమ అవుతాయని తెలుస్తోంది. అర్హుల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించే కార్యక్రమం ఇంకా కొనసాగుతుండటంతో డబ్బులు జమ తేదీ మారిందని తెలుస్తోంది. జూన్ 12వ తేదీ కాకుండా.. జూన్ 19 లేదా 20వ తేదీల్లో విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
