TMC MP Nusrat Jahan: నా బిడ్డకి తండ్రెవరో ఆ తండ్రికి బాగానే తెలుసు!

బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ బిడ్డకి తండ్రి ఎవరు అన్నది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వ్యక్తిగత అంశంలో ఈ తరహా చర్చ ఎబ్బెట్టుగానే ఉన్నా

TMC MP Nusrat Jahan: నా బిడ్డకి తండ్రెవరో ఆ తండ్రికి బాగానే తెలుసు!

Tmc Mp Nusrat Jahan

TMC MP Nusrat Jahan: బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ బిడ్డకి తండ్రి ఎవరు అన్నది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వ్యక్తిగత అంశంలో ఈ తరహా చర్చ ఎబ్బెట్టుగానే ఉన్నా.. నుస్రత్ ఎంపీ కాగా.. ఆమె మాజీ భర్త ఆ బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం.. నుస్రత్ మరో వ్యక్తితో కలిసి ఉండడంతో ఈ అంశం సహజంగానే బహిరంగ చర్చగా మారింది. అందుకు తగ్గట్లే ఎంపీ నుస్రత్ ఇప్పటికీ తన బిడ్డకి తండ్రి ఎవరంటే దాటవేసే సమాధానాలు కూడా ఈ అంశంపై చర్చలు అంతకంతకూ సాగిపోతూనే ఉన్నాయి.

Anchor Anushree: యాంకరమ్మకి మత్తు మరక.. చార్జిషీట్లో అను పేరు

2019లో వ్యాపార‌వేత్త నిఖిల్ జైన్‌ను ట‌ర్కీలో పెళ్లి చేసుకున్న ఎంపీ నుస్రత్ భార‌తీయ చ‌ట్టాల ప్ర‌కారం ఆ పెళ్లి చెల్ల‌దంటూ అత‌నితో విడిపోయారు. అప్ప‌టికే ఆమె గ‌ర్భం దాల్చ‌గా గ‌త నెల 26న కోల్‌క‌తాలోని ఓ హాస్పిట‌ల్‌లో ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. అయితే, ఆ గర్భానికి తనకు ఎలాంటి సంబంధం లేదని నుస్రత్ మాజీ భర్త నిఖిల్ జైన్ ప్రకటించినట్లుగా ప్రకటించినట్లుగా గతంలో వార్తలు రాగా.. అసలు ఆరునెలలుగా తాము కలిసిలేకపోతే ఆ గర్భంతో తనకు ఏంటి సమాధానం అని నిఖిల్ జాతీయ మీడియాతో ప్రశ్నించారు.

Deepthi Sunaina: చిట్టి నడుముతో చిత్రహింసలు పెడుతున్న దీప్తి!

కాగా, తాజాగా కోల్​కతాలోని ఓ సెలూన్​ ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెకు ఓ జాతీయ మీడియా ప్రతినిధి నుండి మరోసారి తన బిడ్డకు తండ్రెవరనే ప్రశ్నలు సంధించారు. దీనికి ఆమె కాస్త అసహనం వ్యక్తం చేస్తూనే ‘నా బిడ్డకు తండ్రెవరో.. ఆ తండ్రికి తెలుసు’ అని బదులిచ్చారు. ‘నాకు తెలిసి ఇదో అస్పష్టమైన, అర్థం లేని ప్రశ్న. ఆ తండ్రికి తెలుసు.. తండ్రెవరో. మేం.. ప్రస్తుతం తల్లిదండ్రులుగా మంచి అనుభూతికి లోనవుతున్నాం. నేను, యష్​.. మంచి సమయం గడుపుతున్నాం’ అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఆమె న‌టుడు య‌ష్‌దాస్ గుప్తాతో క‌లిసి ఉంటుండగా ఆమె డెలివ‌రీ స‌మ‌యంలో కూడా యష్ ద‌గ్గ‌రుండి ఆమె బాగోగులు చూసుకున్నాడు. ప్ర‌స్తుతం కొడుకు ఇహాన్‌తో క‌లిసి ఇద్ద‌రం సంతోషంగా ఉన్న‌ట్లు నుస్ర‌త్ చెప్పడం విశేషం.