Irumudi : రవితేజ ‘ఇరుముడి’ విడుదల తేదీ ఫిక్స్..
రవితేజ నటిస్తున్న ఇరుముడి (Irumudi) చిత్ర విడుదల తేదీ ఖరారు అయింది.
Ravi Teja Irumudi release date fix
Irumudi : తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రియ భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తోంది.
జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి కీలక అప్డేట్ ను చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
This monsoon, it is a spell of heartwarming emotions in theatres ❤️#IRUMUDI / #IRUMUDIKATTU in cinemas from August 21st, 2026 ❤🔥
‘The Heart of #Irumudi‘ Glimpse :
Telugu
▶️ https://t.co/VhUJ4Sr5CLTamil
▶️ https://t.co/SEgGK2YZXeStarring MASS MAHARAJA @RaviTeja_offl
— Mythri Movie Makers (@MythriOfficial) June 7, 2026
ఇరుముడి చిత్రం దైవిక అంశాలతో ముడిపడిన ఫ్యామిలీ డ్రామా అని, అన్ని వయసుల వారికి ఈ చిత్రం కనెక్ట్ అవుతుందని, తండ్రి పాత్రలో రవితేజ నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుందని ఇటీవల గ్లింప్స్ విడుదల సందర్భంగా చిత్ర బృందం తెలియజేసింది.
