Irumudi : ర‌వితేజ ‘ఇరుముడి’ విడుద‌ల తేదీ ఫిక్స్‌..

ర‌వితేజ న‌టిస్తున్న ఇరుముడి (Irumudi) చిత్ర విడుద‌ల తేదీ ఖ‌రారు అయింది.

Ravi Teja Irumudi release date fix

Irumudi : త‌న ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న మూవీ ఇరుముడి. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్రియ భ‌వాని శంక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

జీవి ప్ర‌కాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండ‌గా మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి కీల‌క అప్‌డేట్ ను చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్టు 21న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది.

ఇరుముడి చిత్రం దైవిక అంశాల‌తో ముడిప‌డిన ఫ్యామిలీ డ్రామా అని, అన్ని వ‌య‌సుల వారికి ఈ చిత్రం క‌నెక్ట్ అవుతుంద‌ని, తండ్రి పాత్ర‌లో ర‌వితేజ న‌ట‌న ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను హ‌త్తుకుంటుంద‌ని ఇటీవ‌ల గ్లింప్స్ విడుద‌ల సంద‌ర్భంగా చిత్ర బృందం తెలియ‌జేసింది.