OnePlus: వన్ ప్లస్ నుంచి రూ.20వేల కంటే తక్కువ ధర ఫోన్లు

స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ నుంచి రూ.20 వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. ఇండియన్ మార్కెట్ ను టార్గెట్ చేసి ఈ ఫోన్ మోడల్స్ రెడీ చేస్తున్నారట.

OnePlus: వన్ ప్లస్ నుంచి రూ.20వేల కంటే తక్కువ ధర ఫోన్లు

One Plus

OnePlus: స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ నుంచి రూ.20 వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. ఇండియన్ మార్కెట్ ను టార్గెట్ చేసి ఈ ఫోన్ మోడల్స్ రెడీ చేస్తున్నారట. వన్ ప్లస్ నార్డ్ మినహాయించి.. రూ.30వేలకు తగ్గని ఆండ్రాయిడ్ ఫోన్ల అమ్మకాలు దూకుడుగానే సాగాయి. ఇది దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఫోన్లను తీసుకురావడానికి ప్లాన్‌ చేస్తోంది. రూ. 20 వేల కంటే తక్కువ ధరల్లో లాంచ్‌ చేయాలని వన్‌ప్లస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2022 రెండో త్రైమాసికంలో వీటిని భారత మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒప్పోతో విలీనం చెందిన తరువాత వన్‌ప్లస్‌ తన ఆక్సిజన్‌ ఓఎస్‌ను ఓప్పో కలర్‌ఓఎస్‌తో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రముఖ డేటా ఇంజనీర్, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ అయిన యోగేష్ బ్రార్ వన్‌ప్లస్‌ నుంచి బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఫోన్లను తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు. నార్డ్‌ సిరీస్‌లో భాగంగా మార్కెట్‌లోకి సరసమైన ధరలకు (రూ. 20 వేల కంటే తక్కువ) స్మార్ట్‌ఫోన్లను తీసుకురావడంతో భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లను శాసించాలని వన్‌ప్లస్‌ చూస్తోందని యోగేష్‌ బ్రార్‌ అభిప్రాయపడ్డారు.

ఇటీవల యూఎస్, కెనడా మార్కెట్లలో రిలీజ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 200-5 జీ వంటి ఫోన్‌లు ఇంకా ఇండియన్ మార్కెట్లోకి రాలేదు.