Amazfit GTS 4 Mini : 15 రోజుల బ్యాటరీ లైఫ్‌తో అమాజ్‌ఫిట్ కొత్త స్మార్ట్‌వాచ్.. ఫీచర్లు అదుర్స్!

ప్రముఖ స్మార్ట్ వాచ్ కంపెనీ అమాజ్‌ఫిట్ (Amazfit) మరో స్మార్ట్‌వాచ్‌ను ప్రకటించింది దీనిని అమాజ్‌ఫిట్ జిటిఎస్ 4 మినీ (Amazfit GTS 4 Mini) అని పిలుస్తారు.

Amazfit GTS 4 Mini : 15 రోజుల బ్యాటరీ లైఫ్‌తో అమాజ్‌ఫిట్ కొత్త స్మార్ట్‌వాచ్.. ఫీచర్లు అదుర్స్!

Amazfit Gts 4 Mini Unveiled In India With Up To 15 Days Of Battery Life

Amazfit GTS 4 Mini : ప్రముఖ స్మార్ట్ వాచ్ కంపెనీ అమాజ్‌ఫిట్ (Amazfit) మరో స్మార్ట్‌వాచ్‌ను ప్రకటించింది దీనిని అమాజ్‌ఫిట్ జిటిఎస్ 4 మినీ (Amazfit GTS 4 Mini) అని పిలుస్తారు. రూ. 10వేల ధరల విభాగంలో ఫిట్‌నెస్ స్మార్ట్ వాచ్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. అమెజాన్ ద్వారా ఈ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంటుంది. కొత్త Amazfit వాచ్‌లో 120 స్పోర్ట్స్ మోడ్‌లు, నిరంతర హృదయ స్పందన పర్యవేక్షణ, 5 ATM రేటింగ్ వంటి ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఇవే :
అమాజ్‌ఫిట్ GTS 4 Mini 70.2 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. 1.65-అంగుళాల HD AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే (AoD) ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఒక చదరపు డయల్, సిలికాన్ పట్టీలను కలిగి ఉంది. వాచ్ కుడి వైపున ఒకే బటన్ ఉంది. బెజెల్స్ కూడా చాలా సన్నగా ఉంటాయి. కొత్త Amazfit వాచ్ హుడ్ కింద 270mAh బ్యాటరీని అందిస్తుంది. 15 రోజుల బ్యాటరీ లైఫ్, బ్యాటరీ సేవర్ మోడ్‌లో 45 రోజుల వరకు అందించగలదని కంపెనీ పేర్కొంది. అమాజ్‌ఫిట్ GTS 4 మినీ 120 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉందని తెలిపింది.

Amazfit Gts 4 Mini Unveiled In India With Up To 15 Days Of Battery Life (1)

Amazfit Gts 4 Mini Unveiled In India With Up To 15 Days Of Battery Life

7 స్పోర్ట్స్ మూమెంట్స్‌ను ఆటోమాటిక్‌గా గుర్తించగలదని పేర్కొంది. 5 ATM రేటింగ్ ఇచ్చారు. అంతేకాదు.. ఈ డివైజ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంటుంది. బ్లడ్-ఆక్సిజన్, హృదయ స్పందన రేటు, ఒత్తిడి స్థాయిలను నిరంతరం మానిటరింగ్ చేయగలదు. Amazfit వాచ్ ఈ 3 విషయాలను ఏకకాలంలో ఒక ట్యాప్‌లో దాదాపు 45 సెకన్లలో ఫలితాలను చూపించగలదు. ప్రతి ఇతర అమాజ్‌ఫిట్ వాచ్ మాదిరిగానే.. ఒకరి ఆరోగ్య స్థితిపై పూర్తి అంచనా వేయడంలో PAI హెల్త్ అసెస్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అలాగే పీరియడ్స్ డేటాను కూడా అందించగలదు. యూజర్లు తమ నిద్ర విధానాలను కూడా ట్రాక్ చేసుకోవచ్చు. బ్రాండ్ అమెజాన్ అలెక్సాకు సపోర్టును కూడా అందిస్తుంది.

భారతదేశంలో ధర, సేల్ డేట్ :
అమాజ్‌ఫిట్ GTS 4 Mini ధర రూ. 7,999గా ఉండనుంది. యూజర్లు లిమిటెడ్ ఆఫర్ ద్వారా రూ. 6,999 తగ్గింపు ధరతో పొందవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ ద్వారా జూలై 16న అమ్మకానికి రానుంది. ఈ స్మార్ట్ వాచ్‌లో మిడ్‌నైట్ బ్లాక్, ఫ్లెమింగో పింక్, మింట్ బ్లూ, మూన్‌లైట్ వైట్‌తో సహా 4 రంగులలో వస్తుంది.

Read Also : Realme Pad X India : రియల్‌మి నుంచి Pad X ఇండియా టాబ్లెట్ వస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌లోనే సేల్!