Realme Pad X India : రియల్‌మి నుంచి Pad X ఇండియా టాబ్లెట్ వస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌లోనే సేల్!

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వస్తోంది. ఇప్పటికే రియల్‌మి ఇండియాలో కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది.

Realme Pad X India : రియల్‌మి నుంచి Pad X ఇండియా టాబ్లెట్ వస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌లోనే సేల్!

Realme Pad X India Launch Confirmed, To Be Available Via Flipkart

Realme Pad X India : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి కొత్త టాబ్లెట్ భారత మార్కెట్లోకి వస్తోంది. ఇప్పటికే రియల్‌మి ఇండియాలో కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది. అతి త్వరలోనే Realme Pad X అనే టాబ్లెట్ లాంచ్ చేయనుంది. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు యూజర్లకు అందుబాటులోకి రానుంది. Realme Pad X ఆండ్రాయిడ్ టాబ్లెట్ ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో లాంచ్ అయింది. Realme ట్యాబ్ 5G నెట్‌వర్క్‌కు సపోర్టుతో వస్తోంది. టాబ్లెట్ ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఆఫర్, దీని ధర రూ. 25వేల కన్నా తక్కువగా ఉండవచ్చని అంచనా.

Realme Realme Pad X ఇండియా లాంచ్ తేదీని ధృవీకరించలేదు. ఆండ్రాయిడ్ టాబ్లెట్ ఈ నెలాఖరులో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Realme Pad X 2000 x 1200 పిక్సెల్ 2K రిజల్యూషన్‌తో 11-అంగుళాల IPS LCDని కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ DC డిమ్మింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 450 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది.

Realme Pad X India Launch Confirmed, To Be Available Via Flipkart (1)

Realme Pad X India Launch Confirmed, To Be Available Via Flipkart

60Hz డిస్‌ప్లే చుట్టూ సన్నని బెజెల్స్‌తో వస్తుంది. హుడ్ కింద.. Realme Pad X స్నాప్‌డ్రాగన్ 695 SoCని కలిగి ఉంది. భారత మార్కెట్లో రూ. 20వేల లోపు పలు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకే చిప్‌సెట్‌ని అందిస్తున్నారు స్మార్ట్ ఫోన్ మేకర్లు. ఈ టాబ్లెట్ చైనాలో 4GB, 6GB RAMతో లాంచ్ అయింది. రియల్‌మే భారత మార్కెట్లో అదే ఆప్షన్లను అందించే అవకాశం ఉంది.

64GB, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని పెంచుకునే అవకాశం ఉంది. Realme Pad ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ బాక్స్‌ని రన్ అవుతుంది. Android పైన Realme UI 3.0 లేయర్ కలిగి ఉంది. వెనుకవైపు, టాబ్లెట్‌లో 13MP ప్రధాన కెమెరా ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం, 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

టాబ్లెట్‌లో హై-రెస్ ఆడియో సర్టిఫైడ్, డాల్బీ అట్మోస్‌తో క్వాడ్-స్పీకర్ సెటప్ ఉంది. USB టైప్-C పోర్ట్ ద్వారా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 8,340 mAh బ్యాటరీని అందిస్తుంది. Realme Pad X బరువు 499 గ్రాములు, 7.1mm మందంగా ఉంటుంది. Realme స్మార్ట్ స్టైలస్‌కు సపోర్టుతో వస్తుంది.

Read Also : Realme GT Neo 3 Thor : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో.. రియల్‌మి GT నియో 3 థోర్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!