Amazon Great Summer : మే 4 నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ డీల్స్ అసలు మిస్ కాకండి..!

Amazon Great Summer Sale : అమెజాన్ కొత్త గ్రేట్ సమ్మర్ సేల్ ప్రకటించింది. మే 4 నుంచి ఈ కొత్త సేల్ ప్రారంభం కానుంది. ఆపిల్ ఐఫోన్ సహా అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Amazon Great Summer : మే 4 నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ డీల్స్ అసలు మిస్ కాకండి..!

Amazon Great Summer Sale starts on May 4

Amazon Great Summer Sale : అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో కొత్త గ్రేట్ సమ్మర్ సేల్‌ను ప్రకటించింది. ఈ ఈవెంట్‌కు కొన్ని రోజుల ముందు కొన్ని డీల్స్ వెల్లడించింది. ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఆపిల్ ఐఫోన్ 14, OnePlus 10R, iQOO Z6 Lite వంటి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇటీవలే లాంచ్ అయిన (Samsung Galaxy M14 5G) స్మార్ట్‌ఫోన్‌పై కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఈ కొత్త అమెజాన్ సమ్మర్ సేల్ మే 4న ప్రారంభం కానుంది. సేల్ ఎప్పుడు ముగియనుంది అనేది ఇంకా వెల్లడించలేదు. ఈ నెలాఖరు వరకు సేల్‌ను నిర్వహించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అమెజాన్ సేల్ సమయంలో అందుబాటులో ఉండే కొన్ని బెస్ట్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ కొనేసుకోండి.

Read Also : Pixel 6a Discount Sale : రూ.27వేల లోపు ధరకే పిక్సెల్ 6a ఫోన్ సొంతం చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

ఐఫోన్ 14 సేల్స్ సమయంలో భారీ డిస్కౌంట్లను అందిస్తుందని అమెజాన్ సుల్ పేజీ చెబుతోంది. అయితే, కంపెనీ ప్రస్తుతానికి ఈ ధరను రివీల్ చేయలేదు. ఐఫోన్ 14 డీల్‌కు ట్యాగ్‌లైన్ ఏమిటంటే.. అమెజాన్‌లో అతి తక్కువ ధరగా చెప్పవచ్చు. పొందుతారు. ఈ ఐఫోన్ ధరను ఇంకా వెల్లడించలేదు. అమెజాన్ అనేక ఆండ్రాయిడ్ ఫోన్‌లపై భారీ డీల్స్ వెల్లడించింది.

Amazon Great Summer Sale starts on May 4

Amazon Great Summer Sale starts on May 4: Massive discount on iPhone 14, OnePlus 10R, Galaxy M14

భారత మార్కకెట్లో ఇటీవలే లాంచ్ అయిన Samsung Galaxy M14 5G, బ్యాంక్ ఆఫర్‌తో సహా రూ. 12,490 ధరకు అందుబాటులో ఉంటుంది. రూ. 15వేల లోపు అత్యుత్తమ 5G ఫోన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. లేటెస్ట్ అమెజాన్ సేల్స్ లాభదాయకమైన డీల్ అని చెప్పవచ్చు. శాంసంగ్ గెలాక్సీ M14 భారత మార్కెట్లో రూ. 14,990 ధరతో అందుబాటులో ఉంది.

భారత మార్కెట్లో రూ. 15వేల లోపు బడ్జెట్‌లో iQOO Z6 Lite ఫోన్ కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో రూ. 12,499 ధరకు అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో రూ. 30వేల సెగ్మెంట్‌లో OnePlus 10Rని రూ. 29,999 వద్ద కొనుగోలు చేయొచ్చు. రాబోయే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్‌తో సహా వన్‌ప్లస్ నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ డివైజ్ కొనుగోలు చేయొచ్చు.

OnePlus 11 5G, బ్యాంక్ ఆఫర్‌తో రూ. 55,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంటుంది. షావోమీ (Xiaomi 12 Pro) మరో బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్, బ్యాంక్ ఆఫర్‌తో రూ.42,999కి అందుబాటులో ఉంది. శాంసంగ్ (Samsung Galaxy S22)ని తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. రూ. 51,999 ధరలో పొందవచ్చు. ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్ అంత బాగా లేదనే చెప్పాలి. ఒకవేళ వినియోగం ఎక్కువగా ఉంటే.. ఈ ఫోన్ రోజుకు రెండుసార్లు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది.

Read Also : Best Smartphones in India : రూ.15వేల లోపు ధరలో 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!