Pixel 6a Discount Sale : రూ.27వేల లోపు ధరకే పిక్సెల్ 6a ఫోన్ సొంతం చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Pixel 6a Discount Sale : గూగుల్ పిక్సెల్ 6a సిరీస్‌పై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.30వేల లోపు ధరకే అందుబాటులో ఉంది. ఈ డీల్ అసలే మిస్ చేసుకోవద్దు..

Pixel 6a Discount Sale : రూ.27వేల లోపు ధరకే పిక్సెల్ 6a ఫోన్ సొంతం చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Pixel 6a Discount Sale _ Pixel 6a selling under Rs 27,000 on Flipkart

Pixel 6a Discount Sale : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రూ. 30వేల లోపు బెస్ట్ ఫోన్లలో గూగుల్ (Pixel 6a) సిరీస్ అందుబాటులో ఉంది. అదిరిపోయే ఈ డీల్‌ పొందాలంటే.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఆసక్తికరంగా, గూగుల్ మిడ్-రేంజర్ ఫోన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. రూ. 30వేల కన్నా ఎక్కువ ధర ఉన్న ఈ డివైజ్‌ను ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 27వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఈ కొత్త మోడల్ ఫోన్ ఈ ధరను మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు. ఇంతకీ, ఈ డీల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం..

బ్యాంకు కార్డు ఆఫర్లపై మరిన్ని డిస్కౌంట్లు :
గూగుల్ పిక్సెల్ (Google Pixel 6a) ఫోన్ అసలు ధర రూ. 43,900 ఉండగా.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 27,900కి తగ్గింది. మీరు SBI కార్డ్ హోల్డర్ అయితే.. Pixel 6aపై రూ.1250 తగ్గింపును పొందవచ్చు. తద్వారా ఈ ఫోన్ ధర రూ.26,000కి తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 26,750కు కొత్త పిక్సెల్ 6a సొంతం చేసుకోవచ్చు.

Read Also : Google Pixel 7a : మే 10న గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

ఈ ఫోన్ ధర మరింత తగ్గాలంటే.. మీ పాత ఫోన్, మోడల్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గమనించాలి. మీ హై-ఎండ్ శాంసంగ్ ఫోన్ లేదా పాత ఐఫోన్‌లో ట్రేడింగ్ చేస్తుంటే.. మీరు రూ. 15వేలకి తగ్గవచ్చు. మీ పాత ఫోన్‌కు మీరు పొందే కనీస వాల్యూ రూ. 10వేలు అయినప్పటికీ, డివైజ్ ధర రూ. 16,900 వరకు తగ్గుతుంది. రూ. 20వేల లోపు Pixel 6a ఫోన్ కొనుగోలు చేయొచ్చు.

Pixel 6a Discount Sale _ Pixel 6a selling under Rs 27,000 on Flipkart

Pixel 6a Discount Sale _ Pixel 6a selling under Rs 27,000 on Flipkart

గూగుల్ పిక్సెల్ 6a స్పెసిఫికేషన్‌లు ఇవే :
గూగుల్ (Pixel 6a) ఫోన్ ఫుల్-HD+ రిజల్యూషన్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB LPDDR5 RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో పాటు టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌ అందిస్తుంది. ఆక్టా-కోర్ (Google Tensor SoC) ద్వారా పవర్ అందిస్తుంది.

కెమెరాల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 12.2-MP ప్రైమరీ సెన్సార్, 12-MP సెకండరీ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ (Google Pixel 6a) 8-MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. Pixel 6a 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ v5.2 సపోర్టు కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఛార్జింగ్ USB టైప్-C పోర్ట్ కూడా ఉంది. Pixel 6a ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,410mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Google Pixel Fold Leak : గూగుల్ పిక్సెల్ నుంచి మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?