Google Pixel 7a : మే 10న గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

Google Pixel 7a : గూగుల్ నుంచి పిక్సెల్ 7a ఫోన్ వస్తోంది. మే 10న అధికారికంగా లాంచ్ కానుంది. కానీ, లాంచ్‌కు ముందే ఫీచర్లు లీకయ్యాయి.

Google Pixel 7a : మే 10న గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

Google Pixel 7a key specifications again leaked ahead of expected May 10 launch

Google Pixel 7a : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ (Pixel) నుంచి సరికొత్త ఫోన్ వస్తోంది. వచ్చే మే 10న గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. అయితే, లాంచ్ కావడానికి ముందే కీలక ఫీచర్లు లీకయ్యాయి. గూగుల్ (Pixel 7a) ఫోన్‌కు సంబంధించి కొత్త లీక్ వివరాలను ధృవీకరిస్తుంది. 91Mobiles ప్రకారం.. గూగుల్ Pixel 7a ఫోన్ 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. గత ఏడాదిలోPixel 6a మాదిరిగా ఉంటుంది. డిస్‌ప్లే Full-HD+ రిజల్యూషన్‌ను అందిస్తుంది. గేమింగ్, స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.

గూగుల్ 12.2MP కెమెరాకు బదులుగా కొత్త 64MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో రానుంది. బ్యాక్ కెమెరా 12-MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10.8MP సెల్ఫీ కెమెరా అందించనుంది. ఇవన్నీ (Google) కొత్త టెన్సర్ G2 SoC, 20W ఛార్జింగ్‌తో 4,400mAh బ్యాటరీని అందించనుంది. Apple, Google, Samsung వంటి కంపెనీల్లో ఛార్జింగ్ టెక్నాలజీకి చైనీస్ పోటీదారులతో పోలిస్తే పిక్సెల్ ఫోన్ చాలా నెమ్మదిగా ఉంది.

Read Also : Google Sundar Pichai : 12వేల మంది ఉద్యోగులను పీకేసి.. సీఈఓ పిచాయ్ జీతం భారీగా పెంచేసింది.. గూగుల్‌పై విమర్శల వెల్లువ..!

రూ.30వేల కన్నా ఎక్కువ చైనీస్ ఫోన్‌లు కనీసం 33W ఛార్జింగ్‌ను అందిస్తాయి. సుమారు గంటలో 5,000mAh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలవు. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. Pixel 7a ఆండ్రాయిడ్ 13ని బాక్స్ వెలుపల రన్ చేస్తుంది. డిజైన్ విషయానికి వస్తే.. Pixel 7a ఫోన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. Pixel 6a ఫోన్ సాలిడ్ బ్లాక్ బార్‌లా కాకుండా.. బ్యాక్ బార్ గ్రేడియంట్‌తో సిల్వర్ ఎండ్ కలిగి ఉండవచ్చు.

Google Pixel 7a key specifications again leaked ahead of expected May 10 launch

Google Pixel 7a key specifications again leaked ahead of expected May 10 launch

మే 10న జరిగే Google IO ఈవెంట్‌లో Pixel 7a ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ సేల్ కొన్ని వారాల తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్‌ భారతీయ మార్కెట్‌లోకి కూడా వస్తుందని భావిస్తున్నారు. ధరల వారీగా పరిశీలిస్తే.. గూగుల్ Pixel 7a ధర 499 డాలర్లు.. అంటే.. దాదాపు రూ. 41వేలు ఉండొచ్చు. గత ఏడాదిలో Pixel 6a భారత మార్కెట్లో ఇదే రేంజ్‌లో లాంచ్ అయింది. రాబోయే Pixel 7a ధర రూ. 40వేల నుంచి రూ. 45వేల వరకు ఉండవచ్చు.

Read Also : Airtel 5G Plus : దేశవ్యాప్తంగా 3వేల నగరాల్లోకి ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు.. 5G ప్లాన్ల ఫుల్ లిస్టు ఇదిగో.. ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసా?