Amazon Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్… ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు

ఎల్లుండి (బుధవారం) నుంచి అమెజాన్ సమ్మర్ సేల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో వివిధ కేటగిరీలకు చెందిన ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందించనుంది.

Amazon Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్… ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు

Laptop

Amazon Summer Sale: ఎల్లుండి (బుధవారం) నుంచి అమెజాన్ సమ్మర్ సేల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో వివిధ కేటగిరీలకు చెందిన ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందించనుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, కిచెన్ అప్లయెన్సెస్, హోమ్ అప్లయెన్సెస్‌పై ఎక్కువ డిస్కౌంట్లు అందిస్తుంది అమెజాన్. ఈ ఆఫర్స్‌కు సంబంధించిన వివరాలను ఇప్పటికే అమెజాన్ ప్రకటించింది. ఏసస్, లెనోవో, డెల్, హెచ్‌పీ, ఎమ్ఐ, ఎమ్ఎస్ఐ, ఏసర్ వంటి బ్రాండ్స్ ల్యాప్‌టాప్‌లపై దాదాపు 40 శాతం వరకు డిస్కౌంట్ అందించనుంది.

Amazon: అమెజాన్ సమ్మర్ సేల్ 4 నుంచి.. ఈ కార్డులపై పదిశాతం డిస్కౌంట్

అలాగే సెలెక్టెడ్ క్రెడిట్/డెబిట్ కార్డులపై అదనంగా మరో పదిశాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చు. వీటితోపాటు నో కాస్ట్ ఈఎమ్ఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లకు సంబంధించి ఇప్పటికే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో కొన్ని క్రేజీ డీల్స్ వివరాలివి. రూ.76,999 ఖరీదు కలిగిన ఎమ్ఐ నోట్ బుక్ అల్ట్రా 3.2కే ఇప్పుడు రూ.59,990 లకే లభిస్తోంది. రూ.49,990 ధర కలిగిన ఏసస్ వివో బుక్ 15 ఇప్పుడు రూ.32,990లకు, రూ.101390 ధర కలిగిన లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 ల్యాప్‌టాప్ రూ.62,990లకు, రూ.49,990 ధర కలిగిన డెల్ న్యూ వోస్ట్రో 3405 ల్యాప్‌టాప్ రూ.37,990లకు, రూ.67,990 ధర కలిగిన ఎమ్ఎస్ఐ మోడర్న్ 14 ల్యాప్‌టాప్ ఇప్పుడు రూ.43,990లకే లభిస్తోంది.