Amazon: అమెజాన్ సమ్మర్ సేల్ 4 నుంచి.. ఈ కార్డులపై పదిశాతం డిస్కౌంట్
ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాం అమెజాన్ సమ్మర్ సేల్ అనౌన్స్ చేసింది. ఈ నెల 4 నుంచి సమ్మర్ సేల్ ప్రారంభం కానుంది. మూడు బ్యాంకులకు చెందిన కార్డులపై పదిశాతం డిస్కౌంట్ కూడా ప్రకటించింది.
Amazon: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాం అమెజాన్ సమ్మర్ సేల్ అనౌన్స్ చేసింది. ఈ నెల 4 నుంచి సమ్మర్ సేల్ ప్రారంభం కానుంది. మూడు బ్యాంకులకు చెందిన కార్డులపై పదిశాతం డిస్కౌంట్ కూడా ప్రకటించింది. ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్, ఆర్బిఎల్ క్రెడిట్, డెబిట్ కార్డులపై పదిశాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ప్రైమ్ మెంబర్స్‌కు ఫ్రీ, ఫాస్ట్ డెలివరీ అందించనున్నట్లు వెల్లడించింది. అమెజాన్ ప్లాట్‌ఫాంపై మొదటిసారి కొనుగోల చేసేవాళ్లకు అదనంగా పదిశాతం డిస్కౌంట్ కూడా అందించనుంది. ఈ సేల్ సందర్భంగా 60కిపైగా కొత్త ఉత్పత్తుల్నిలాంఛ్ చేయనుంది.
ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌తోపాటు హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, బుక్స్, టాయ్స్ వంటి అనేక ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్లు అందించనుంది. మొబైల్స్‌కు సంబంధించి ప్రధానంగా రెడ్మి 10ఏ ఫోన్ రూ.8,499లకే రానుంది. అలాగే రియల్‌మి నర్జో 50ఏ ప్రైమ్ మొబైల్ రూ.11,499లకు, కిండిల్ రూ.6,799లకు, అమెజాన్ ఎకో షో రూ.4,499లకు, వీయూ 32 అంగుళాల ప్రీమియమ్ టీవీ రూ.11,999లకే సేల్కు అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు పలు ఉత్పత్తులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది.
Netflix Airtel Plans : ఎయిర్టెల్ OTT యూజర్లకు అదిరే ఆఫర్.. ఆ రెండు ప్లాన్లపై నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ..!
3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో
మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా స్పెషల్ సేల్ తీసుకొస్తోంది. అమెజాన్ కంటే ఒకరోజు ముందుగా.. అంటే ఈ నెల 3 నుంచే ‘బిగ్ సేవింగ్ డేస్’ పేరుతో ఈ సేల్ ప్రారంభమవుతుంది. ఈ నెల 3 అర్ధరాత్రి 12 గంటలకు మొదలయ్యే సేల్ ఎనిమిదో తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో ఎస్బీఐ కార్డుపై పదిశాతం డిస్కౌంట్ అందిస్తుంది.