Netflix Airtel Plans : ఎయిర్‌టెల్ OTT యూజర్లకు అదిరే ఆఫర్.. ఆ రెండు ప్లాన్లపై నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ..!
Netflix Airtel Broadband Plans : ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ నుంచి రెండు కొత్త బ్రాడ్ బ్యాండ్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు బ్రాడ్ బ్యాండ్లపై ఉచితంగా ప్రపంచ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కంటెంట్ యాక్సస్ చేసుకునేందుకు అనుమతినిస్తుంది.

Netflix Now Comes Free With Two Airtel Broadband Plans, Here Are The Details
Netflix Airtel Broadband Plans : ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ నుంచి రెండు కొత్త బ్రాడ్ బ్యాండ్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు బ్రాడ్ బ్యాండ్లపై ఉచితంగా ప్రపంచ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కంటెంట్ యాక్సస్ చేసుకునేందుకు అనుమతినిస్తుంది. ఇప్పటికే Netflix కంటెంట్ అనేక ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఉచితంగా వస్తుంది. ఇప్పుడు, టెలికాం ఆపరేటర్ ఎంపిక చేసిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను అందిస్తోంది ఎయిర్ టెల్. అందులో ఒకటి ఎయిర్‌టెల్ ప్రొఫెషనల్ ప్లాన్‌లు (Airtel Professional), ఇన్ఫినిటీ ప్లాన్ (Infinity plans). ఈ రెండు ప్లాన్లతో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ అందిస్తోంది. ఎయిర్‌టెల్ ప్రొఫెషనల్ ప్లాన్ నెలకు రూ. 1498 చెల్లించాల్సి ఉంటుంది.
అదే ఇన్ఫినిటీ ప్లాన్ నెలకు రూ. 3999 చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ ప్రొఫెషనల్ ప్లాన్‌ను కొనుగోలు చేసే యూజర్లు నెలకు రూ. 199 నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఇన్ఫినిటీ ప్లాన్‌ని ఎంచుకునే యూజర్లు నెలవారీ నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం ప్లాన్ యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే నెలకు రూ. 649 చెల్లించాల్సి ఉంటుంది. భారత ఓటీటీ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్, బేసిక్ ప్లాన్, స్టాండర్డ్ ప్రీమియం ప్లాన్‌తో సహా మొత్తం 4 ప్లాన్‌లను ఎయిర్ టెల్ అందిస్తోంది. మొబైల్ ప్లాన్ ఒక స్క్రీన్ సపోర్ట్‌తో నెలకు రూ. 149 చెల్లించాలి. అదే ప్రైమరీ ప్లాన్ రూ. 199 ప్లాన్ కూడా ఒక స్ర్కీన్ వరకు యాక్సస్ చేసుకోవచ్చు. రూ. 499 స్టాండర్డ్ ప్లాన్, రూ. 649 ప్రీమియం ప్లాన్ వరుసగా 2, 4 స్క్రీన్‌లకు సపోర్ట్ చేస్తాయి. మొబైల్ ప్లాన్‌తో పాటు, ఇతర ప్లాన్‌లు యూజర్లను పెద్ద స్క్రీన్‌పై కంటెంట్‌ను యాక్సస్ చేసుకోవడానికి అనుమతిస్తాయి. Airtel బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో Netflixని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Netflix Now Comes Free With Two Airtel Broadband Plans, Here Are The Details
1. ఎయిర్‌టెల్ థాంక్స్ (Airtel Thanks) యాప్‌లోని ‘Discover Thanks Benefit’ పేజీకి వెళ్లండి.
2. క్రిందికి స్క్రోల్ చేసి.. ‘Enjoy your rewards’ సెక్షన్లో ‘Netflix’ని ఎంచుకోండి.
3. ‘Claim’ ఎంచుకోండి.
4. Proceed’పై క్లిక్ చేయండి. Netflix ప్రొడక్ట్ వివరణ పేజీలో ఆప్షన్ ఎంచుకోండి.
5. యాక్టివేషన్‌ను కంప్లీట్ చేసేందుకు కస్టమర్ నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతారు.
టెలికాం ఆపరేటర్ ఇటీవలే రూ. 1199, రూ. 1599 విలువైన 2 ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌లతో అందిస్తోంది. ఉచిత నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్లాన్‌ను ప్రకటించింది. దీనికి అదనంగా రూ. 1599 ప్లాన్ ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. 500GB వరకు డేటా, అన్‌లిమిటెడ్ పొందవచ్చు. Disney+ Hotstar, Airtel Xtremeకి సబ్‌స్క్రిప్షన్, అన్ లిమిటెడ్ కాల్స్, హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్, ఫ్రీ యాడ్-ఆన్ కనెక్షన్ వంటి మరెన్నో ఆఫర్లను ఉచితంగా పొందవచ్చు.