Apple Grand Sale : ఆపిల్ గ్రాండ్ సేల్.. ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్లు.. కేవలం రూ. 9,999కే ఐఫోన్ మీ సొంతం.. డోంట్ మిస్!
Apple Grand Sale : ఆపిల్ గ్రాండ్ సేల్ మొదలైంది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఆకర్షణీయమైన ధరలు, బ్యాంక్ ఆఫర్లను పొందవచ్చు.

Apple Grand Sale _ Big discounts on iPhone 11, iPhone 12 on Flipkart
Apple Grand Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఆపిల్ ఐఫోన్లపై అనేక డిస్కౌంట్లను అందిస్తోంది. ఆపిల్ ఔత్సాహికులు iPhone 11, iPhone 12 ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ పాత స్మార్ట్‌ఫోన్‌లపై అదిరే డీల్స్, అదనపు బ్యాంక్ ఆఫర్లు, ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ రేట్లను అందిస్తోంది. రాబోయే ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూజర్ల కోసం సరికొత్త అప్‌డేట్‌లను పొందవచ్చు.
ఐఫోన్ 11లో స్టెల్లార్ సేవింగ్స్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 11పై రూ. 3,901 డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 44,999కి అందుబాటులో ఉంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీ ఆఫర్‌ను పొందాలంటే.. ఐఫోన్ 11 సిరీస్ ఎంట్రీ-లెవల్ మోడల్ ధర రూ.43,749కి తగ్గింది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకోవాలంటే.. మీరు గరిష్టంగా రూ. 35వేల వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మొత్తం తగ్గింపు రూ. 36,250 తర్వాత ఐఫోన్ 11 కేవలం రూ. 9,999తో సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 12పై గ్రాండ్ డిస్కౌంట్లు :
ఆపిల్ ఐఫోన్ 12 కూడా ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గింది. ఆపిల్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో రూ. 59,900 వద్ద లిస్టు అయింది. ఈ డివైజ్ రూ. 5,901 ధర తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 53,999 తగ్గింపు ధరకు అందిస్తుంది. అదనంగా, HDFC బ్యాంక్ నాన్-EMI క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 2వేలు డిస్కౌంట్ వర్తిస్తుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్జేంజ్‌పై రూ. 35వేల వరకు అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. మొత్తంగా రూ. 42,901 తగ్గింపు తర్వాత ఐఫోన్ 12 కేవలం రూ. 16,999కి సొంతం చేసుకోవచ్చు.

Apple Grand Sale _ Big discounts on iPhone 11, iPhone 12 on Flipkart
ఐఫోన్ 11, ఐఫోన్ 12 స్పెసిఫికేషన్‌లు :
ఐఫోన్ 11 ఫోన్ 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్‌ప్లేతో A13 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది.ఈ ఐఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ 12MP సెన్సార్, ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. మరోవైపు ఐఫోన్ 12 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. A14 బయోనిక్ చిప్‌తో ఆధారితమైనది. 12MP వైడ్-యాంగిల్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్‌తో కూడిన యాంగిల్ లెన్స్, డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ఐఫోన్ 15 స్పెసిఫికేషన్ (అంచనా) :
ఆపిల్ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 మోడల్‌లలో రెండు 6.1-అంగుళాల ఐఫోన్‌లు, రెండు 6.7-అంగుళాల ఐఫోన్‌లు ఉంటాయి. 6.1-అంగుళాల వెర్షన్లలో ఒకటిగా చెప్పవచ్చు. ఐఫోన్ 15 మోడల్ 6.7-అంగుళాల మోడల్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ 6.1, 6.7-అంగుళాల ఐఫోన్లలో ప్రీమియం ఖరీదైన Pro కేటగిరీలోకి వస్తాయి.