WhatsApp New Update : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ఐఫోన్ యూజర్లు స్టిక్కర్లు, అవతార్స్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు..!

WhatsApp New Update : వాట్సాప్ యాప్ స్టోర్‌లో iOS వెర్షన్ 23.13.78ని రిలీజ్ చేస్తోంది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా యూజర్లు స్టిక్కర్లు, అవతార్‌, GIF ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు.

WhatsApp New Update : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ఐఫోన్ యూజర్లు స్టిక్కర్లు, అవతార్స్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు..!

WhatsApp releases new update for iOS, makes it easier for iPhone users

WhatsApp New Update : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్ ఇంటర్‌ఫేస్ ఎక్స్‌పీరియన్స్ కోసం సరికొత్త ఫీచర్ల గ్రూపుపై పనిచేస్తోంది. ఐఫోన్ యూజర్ల కోసం లేటెస్ట్ అప్‌డేట్‌లో వాట్సాప్ స్టిక్కర్, GIF పికర్‌లను రీడిజైన్ చేసింది. వాట్సాప్ అప్‌డేట్ అవతార్ సెక్షన్‌లో కొన్ని అప్‌డేట్స్‌తో పాటు చాట్‌లో GIFలు, స్టిక్కర్‌లను సులభంగా యాక్సెస్ చేస్తుంది. వాట్సాప్ యాప్ స్టోర్‌లో iOS వెర్షన్ 23.13.78ని రిలీజ్ చేస్తోంది. కంపెనీ అధికారిక చేంజ్‌లాగ్ ప్రకారం.. కొత్త వెర్షన్ మెరుగైన నావిగేషన్‌తో అవతార్ స్టిక్కర్‌ల అప్‌డేట్‌తో స్టిక్కర్ ట్రేని తీసుకువస్తుంది.

కొత్త అప్‌డేట్‌లు ఇప్పుడు వాట్సాప్ యూజర్‌లు పికర్‌ను పైకి స్క్రోల్ చేయడానికి అనుమతిస్తాయి. తద్వారా గ్రిడ్‌లోని మరిన్ని ఐటెమ్‌లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. GIF, స్టిక్కర్, అవతార్ సెక్షన్లను యాక్సెస్ చేయడానికి బటన్‌లను కూడా మార్చింది. సులభంగా నావిగేషన్, యాక్సెస్ చేసేందుకు వీలుగా రీడిజైన్ చేసింది. అదనంగా, వాట్సాప్ అవతార్ ప్యాక్‌ల కేటగిరీలను కూడా అప్‌డేట్ చేసింది. ఈ కొత్త వాట్సాప్ అవతార్ స్టిక్కర్‌ల విస్తృత ఆప్షన్ యూజర్లకు అందిస్తుంది.

Read Also : Huawei Nova Y71 Launch : ట్రిపుల్ కెమెరాలు, భారీ బ్యాటరీతో హువావే నోవా Y71 ఫోన్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనొచ్చు..!

సెర్చ్, అవతార్ కాన్ఫిగరేషన్ బటన్లతో అవతార్ విభాగంలో యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. నిర్దిష్ట ప్యాక్‌లో అందుబాటులో ఉన్న అన్ని స్టిక్కర్‌ల ఫుల్ లిస్టును వీక్షించడంలో చాలా మంది సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ కొత్త ఫీచర్ అప్‌డేట్‌లు వినియోగదారులకు సాయంగా ఉంటాయి. రీక్రియేట్ చేసిన GIF, స్టిక్కర్ పికర్ వినియోగదారులు GIF, స్టిక్కర్ల కోసం సెర్చ్ చేసేందుకు సులభతరం చేస్తుంది.

WhatsApp releases new update for iOS, makes it easier for iPhone users

WhatsApp New Update releases new update for iOS, makes it easier for iPhone users

పర్సనల్ లేదా గ్రూపు సంభాషణల సమయంలో యూజర్ల సమయాన్ని ఆదా చేస్తుంది. ముఖ్యంగా, వాట్సాప్ iOS యూజర్లందరికి కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రతి ఒక్కరికీ అప్‌డేట్ అందించడానికి కొన్ని వారాలు పడుతుందని పేర్కొంది. రాబోయే వారాల్లో ఈ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని వాట్సాప్ చేంజ్‌లాగ్ తెలిపింది. అదే సమయంలో, ఐఫోన్ యూజర్లు గ్యాలరీ నుంచి ఫొటోలను ఉపయోగించి తమ కస్టమ్ స్టిక్కర్లను కూడా క్రియేట్ చేయొచ్చు.

ఈ సంవత్సరం ప్రారంభంలో (WhatsApp) iOS 16 యూజర్లకు ఫొటోలను స్టిక్కర్లుగా మార్చడానికి కస్టమ్ స్టిక్కర్ ప్యాక్‌లను క్రియేట్ చేసే సామర్థ్యాన్ని అందించింది. ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ కస్టమ్ స్టిక్కర్‌లను రూపొందించడానికి ఇంటర్నల్ ఫీచర్‌ను కలిగి లేదు. దానికి, బదులుగా, iOS 16 API సామర్థ్యాలను ఉపయోగిస్తుంది. ఐఫోన్ యూజర్లు వాట్సాప్ కస్టమ్ స్టిక్కర్‌లను ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం.. ఐఫోన్ యూజర్లు వాట్సాప్‌లో కస్టమ్ స్టిక్కర్‌లను క్రియేట్ చేసే ఈ దశలను పాటించండి.

* మీ ఐఫోన్‌లో ఫొటో (Photos) యాప్‌ను ఓపెన్ చేయండి.
* అందులోని ఏదైనా ఫొటోను లాంగ్ ప్రెస్ చేయండి.
* దాన్ని వాట్సాప్ కాన్వరజేషన్‌లోకి డ్రాగ్ చేసి వదలండి.
* ప్రాంప్ట్ చేసినప్పుడు దాన్ని స్టిక్కర్‌గా మార్చండి.
* ఫ్యూచర్ రిపరెన్స్ కోసం వాట్సాప్ సేకరణలోని స్టిక్కర్‌ను యాక్సెస్ చేయండి.
* ముఖ్యంగా, ఫొటోల నుంచి వాట్సాప్ స్టిక్కర్‌లను క్రియేట్ చేసే ఫీచర్ iOS 16 లేదా నెక్స్ట్ ఐఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.

Read Also : Honor X50 Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో హానర్ x50 ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!