Apple iPhone 13 mini : ఆపిల్ ఐఫోన్ 13 మినీ ఇక కనిపించదా? ఐఫోన్ 15 లాంచ్ తర్వాత పూర్తిగా నిలిచిపోనుందా? ఇదే చివరి అవకాశం..!

Apple iPhone 13 mini : ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత ఐఫోన్ 13 మినీని నిలిపివేయవచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి. సెప్టెంబర్ 12న ఆపిల్ Wonderlust ఈవెంట్‌లో కొత్త ఐఫోన్‌లను ఆవిష్కరించనున్నారు.

Apple iPhone 13 mini : ఆపిల్ ఐఫోన్ 13 మినీ ఇక కనిపించదా? ఐఫోన్ 15 లాంచ్ తర్వాత పూర్తిగా నిలిచిపోనుందా? ఇదే చివరి అవకాశం..!

Apple might discontinue iPhone 13 mini after iPhone 15 series announcement on September 12

Apple iPhone 13 mini : ఆపిల్ ఐఫోన్ 13 మినీని నిలిపివేయాలని ఆపిల్ యోచిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్, ఐఫోన్ 12, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్, ఐఫోన్ 12, ఐఫోన్ 13 మినీలను ఆపిల్ నిలిపివేయవచ్చని ఈ ఏడాది ఏప్రిల్‌లో నివేదిక పేర్కొంది.

ఇప్పుడు ఐఫోన్ 15 సిరీస్ అధికారిక లాంచ్‌కు కొన్ని గంటల దూరంలో ఉంది. ఆపిల్ ఐఫోన్ 13 మినీని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆపిల్ వండర్‌లస్ట్ ఈవెంట్‌లో సెప్టెంబర్ 12న ఇతర ప్రొడక్టులతో పాటు ఐఫోన్ 15 లైనప్‌ను ఆవిష్కరించనుంది. భారత్‌లో ఆపిల్ ఈవెంట్ రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది.

Read Also : Nokia G42 5G Smartphone : అద్భుతమైన ఫీచర్లతో నోకియా G42 5G ఫోన్.. వాటర్ రెసిస్టెంట్ డిజైన్, ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

నిలిచిపోనున్న ఐఫోన్ 13 మినీ :
బ్లూమ్‌బెర్గ్ మార్క్ ప్రకారం.. ఐఫోన్ 13 మినీ స్టాక్ తక్కువగా ఉందని గుర్తించారు. అమెరికాలోని ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఐఫోన్ 13 మినీ కొన్ని మోడళ్లకు 2 నుంచి 3 వారాల డెలివరీ సమయాన్ని కొన్ని ఇతర మోడళ్లకు 6-8 వారాల వరకు ఉండొచ్చునని అంచనా. ఐఫోన్ 15 లైనప్ ప్రకటన తర్వాత ఐఫోన్ 13 మినీని నిలిపివేయాలనుకోవడం కొరత కారణం కావచ్చునని నివేదిక సూచిస్తుంది.

Apple might discontinue iPhone 13 mini after iPhone 15 series announcement on September 12

Apple might discontinue iPhone 13 mini after iPhone 15 series announcement on September 12

ఆపిల్ నుంచి అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు. గత ఏడాదిలో ఐఫోన్ 14 లాంచ్ చేసిన తర్వాత టెక్ దిగ్గజం ఐఫోన్ 11, ఐఫోన్ 12 మినీని నిలిపివేసింది. అంతేకాకుండా, గతేడాది లాంచ్ అయిన ఆపిల్ 14 మినీ ఇప్పుడు అందుబాటులో లేదు. అందువల్ల, మీరు ఐఫోన్ 13 మినీని పొందాలనుకుంటే.. ఇప్పుడు కొనుగోలు చేసేందుకు చివరి అవకాశం కావచ్చు.

ఐఫోన్ 13 సిరీస్ :
ఐఫోన్ 13 లైనప్‌లో iPhone 13, 13 Mini, 13 Pro, 13 Pro Max అనే మొత్తం 4 ఫోన్‌లు ఉన్నాయి. 2021లో ఆపిల్ వార్షిక ఈవెంట్‌లో ప్రకటించింది. ఐఫోన్ 13 బేస్ 128GB వేరియంట్ ధర రూ. 79,900, ఐఫోన్ 13 ప్రో రూ. 1,19,900 ధరతో వస్తుంది. ఐఫోన్ 13 ప్రో మాక్స్ లాంచ్ సమయంలో రూ. 1,29,900 ఉండగా, ఐఫోన్ 13 మినీ రూ.69,900 ధరతో లాంచ్ అయింది.

ఐఫోన్ 13 సిరీస్ ఆపిల్ A15 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐఫోన్ 13 గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే.. ఐఫోన్ 6.1-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. రెడ్, స్టార్‌లైట్, మిడ్‌నైట్, బ్లూ, పింక్ వంటి 5 కలర్ ఆప్షన్లలో ఫోన్ లాంచ్ అయింది. ఐఫోన్ లాంచ్ సమయంలో 256GB, 512GB ఎక్కువ స్టోరేజీ ఉన్న ఫోన్ వెర్షన్‌ల ధరలు వరుసగా రూ. 89,900, రూ.1,09,900 నుంచి అందుబాటులో ఉన్నాయి.

Read Also : Apple iPhone 14 Discount : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16,901 తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!