Nokia G42 5G Smartphone : అద్భుతమైన ఫీచర్లతో నోకియా G42 5G ఫోన్.. వాటర్ రెసిస్టెంట్ డిజైన్, ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Nokia G42 5G Smartphone : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అద్భుతమైన ఫీచర్లతో నోకియా G42 5G ఫోన్ వచ్చేసింది. సెప్టెంబర్ 15 నుంచి (Amazon.in) నుంచి ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Nokia G42 5G Smartphone : అద్భుతమైన ఫీచర్లతో నోకియా G42 5G ఫోన్.. వాటర్ రెసిస్టెంట్ డిజైన్, ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Nokia G42 5G Smartphone with water-resistant design, 5000mAh battery Launched

Nokia G42 5G Smartphone : ప్రముఖ HMD గ్లోబల్ నోకియా ఇండియా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ నుంచి కొత్త (Nokia G42 5G) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 2-పీస్ యూనిబాడీ డిజైన్‌తో వస్తుంది. నోకియా G42 5G ఫోన్ బ్యాక్ ప్యానెల్ 65 శాతం రీసైకిల్ ప్లాస్టిక్‌తో వస్తోంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ బాక్స్‌లో 20W ఫాస్ట్ ఛార్జర్, కేబుల్, జెల్లీ కేస్ ఉన్నాయి.

Read Also : Apple Wonderlust Event : ఆపిల్ ‘వండర్‌లస్ట్’ లాంచ్ ఈవెంట్.. ఐఫోన్లతో సహా ఏయే కొత్త ప్రొడక్టులు ఉండొచ్చు? లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలంటే?

నోకియా ధర ఎంతంటే? :
నోకియా G42 5G ఫోన్ ధర రూ. 12,599 ధరతో వస్తుంది. కస్టమర్లు సో పర్పుల్, సో గ్రే అనే 2 కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. సెప్టెంబర్ 15 నుంచి (Amazon.in) నుంచి ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Nokia G42 5G Smartphone with water-resistant design, 5000mAh battery Launched

Nokia G42 5G Smartphone with water-resistant design, 5000mAh battery Launched

నోకియా G42 5G స్పెసిఫికేషన్‌లు :
నోకియా G42 5G ఫోన్ 720×1612 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 లేయర్‌తో నోకియా G42 5G ఆక్టా-కోర్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 480+ చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 6GB RAM అదనంగా 5GB వర్చువల్ RAM సపోర్టు అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి 1TB వరకు విస్తరించవచ్చు. డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ చేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌కు 2 ఏళ్ల OS అప్‌డేట్, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయని కంపెనీ ధృవీకరించింది. ఇమేజింగ్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ద్వారా పొందవచ్చు. సెల్ఫీలకు 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. నోకియా G42 5G IP52 రేటింగ్‌తో వస్తుంది. వాటర్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ సపోర్టు అందిస్తుంది.

Read Also : iPhone 15 Details Leak : వచ్చే వారమే ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ ఈవెంట్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?