Elon Musk iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15పై మనసు పడ్డ మస్క్.. ఎలాగైనా ఐఫోన్ కొనేస్తాడట.. అసలు కారణం ఇదే..!

Elon Musk iPhone 15 : ఆపిల్ కొత్త ఐఫోన్ 15పై ఎలన్ మస్క్ (Elon Musk) కన్నేశాడు. ఐఫోన్ కొనేందుకు తెగ ముచ్చట పడుతున్నాడు. ఎందుకో తెలుసా?

Elon Musk iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15పై మనసు పడ్డ మస్క్.. ఎలాగైనా ఐఫోన్ కొనేస్తాడట.. అసలు కారణం ఇదే..!

Elon Musk Wants To Buy iPhone 15 For This Reason

Elon Musk iPhone 15 : ఆపిల్ కొత్త (iPhone 15), సెప్టెంబర్ 12న వాండర్‌లస్ట్ ఈవెంట్‌లో గ్రాండ్ లాంచ్ అయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎందరో టెక్ ఔత్సాహికుల హృదయాలను దోచుకుంది. ఆసక్తికరంగా, కొత్త ఐఫోన్ 15 ట్విట్టర్‌లో అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. ఆపిల్ ఐఫోన్ 15పై ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk) మనస్సు పారేసుకున్నాడు.

ఎలాగైనా ఐఫోన్ 15 సొంతం చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. రూ. 79,900 విలువైన ఐఫోన్ 15 సిరీస్ (iPhone 15 Series) కొనేందుకు ఆరాటపడుతున్నాడట.. ఇంతకీ, మస్క్ ఎందుకు ఐఫోన్ 15 సిరీస్ ఇష్టపడ్డాటంటే.. ఐఫోన్ వివిధ మోడల్స్, కలర్ ఆప్షన్లు తనను బాగా ఆకట్టుకున్నాయట.. అద్భుతమైన నాణ్యమైన ఫొటోల కారణంగా ఐఫోన్ 15ను కొనుగోలు చేయాలని మస్క్ నిర్ణయం తీసుకున్నాడు.

Read Also : Elon Musk : మస్క్ మళ్లీ ఫిట్టింగ్ పెట్టాడుగా.. ఇకపై ట్విట్టర్ (X) యూజర్లందరూ డబ్బులు చెల్లించాల్సిందేనా..!

ఆపిల్ సీఈఓ (Apple CEO), టిమ్ కుక్ (Tim Cook), ఐఫోన్ 15 పట్ల తన ఇష్టాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ (X) వేదికగా బయటపెట్టారు. కుక్ ప్రశంసలు పొందిన ఫొటోగ్రాఫర్‌లు స్టీఫెన్ విల్కేస్, రూబెన్ వులతో కనిపించారు. ఐఫోన్ 15 ప్రో మాక్స్ (iPhone 15 Pro Max) క్రియేటివిటీని ఎలా శక్తివంతం చేస్తుందో చూపిస్తూ తమ కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించారు. రోడ్ ఐలాండ్ ఉటాలోని ఎడారుల వరకు క్లియర్ ఫొటోలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. కుక్ వారిని ప్రశంసిస్తూ.. ప్రపంచ ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్లు స్టీఫెన్ విల్కేస్, రూబెన్ వు ఐఫోన్ 15 ప్రో మాక్స్‌తో క్రియేటివిటీ అద్భుతంగా ఉందన్నారు.

Elon Musk iPhone 15

Elon Musk iPhone 15

ఐఫోన్ 15 సిరీస్‌ అందుకే కొంటున్నాడట.. :
కుక్ ప్రశంసలకు ప్రతిస్పందనగా.. ఎలన్ మస్క్ ఐఫోన్ ఫొటోలు, వీడియోల అద్భుతమైన క్వాలిటీని ప్రశంసిస్తూ, లెక్కలేనన్ని మంది వినియోగదారులు అభినందిస్తున్నారని ధృవీకరించారు. ఐఫోన్ 15 సిరీస్‌తో సహా ఆపిల్ ప్రొడక్టుల కొత్త లైనప్, ఆపిల్ వాచ్ మొట్టమొదటి కార్బన్-న్యూట్రల్ మోడల్‌లు, లేటెస్ట్ (AirPods) కొత్త లాంచ్ గురించి మస్క్ మాట్లాడుతూ.. ఐఫోన్ 15 సిరీస్ ఒకదాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నానని తెలిపారు. మస్క్ ప్రకటనతో అభిమానులు, ఫాలోవర్లు ఐఫోన్ మోడల్, కలర్ ఆప్షన్ గురించి ఆరా తీశారు.

మరొకరు మస్క్ నిజంగా ఐఫోన్ కొనుగోలు చేస్తున్నాడా లేదా అని సరదాగా ప్రశ్నించాడు. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ అనే 4 మోడళ్లను కలిగి ఉంది. ఈ లైనప్‌లో వివిధ రకాల స్టోరేజీ సామర్థ్యాలు, అనేక కలర్ ఆప్షన్లను అందిస్తుంది. ఇందులో బేస్ ఐఫోన్ 15 మోడల్ ధర రూ. 79,900 నుంచి అందుబాటులో ఉంది.

Read Also : Elon Musk Video Game : ఎలన్ మస్క్ గేమర్ కూడా.. 13ఏళ్లకే వీడియో గేమ్స్ క్రియేట్ చేశాడు.. మ్యాగజైన్‌కు గేమ్ ఎంతకు అమ్మేశాడంటే..?