Elon Musk Video Game : ఎలన్ మస్క్ గేమర్ కూడా.. 13ఏళ్లకే వీడియో గేమ్స్ క్రియేట్ చేశాడు.. మ్యాగజైన్‌కు గేమ్ ఎంతకు అమ్మేశాడంటే..?

Elon Musk Video Game : ఎలన్ మస్క్ అంటే మామూలుగా ఉండదు.. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే.. అప్పట్లో మస్క్ ఎన్నో అద్భుతాలు చేశాడు.. వీడియో గేమ్ (Blaster Video Game) క్రియేట్ చేసి ఒక మ్యాగజైన్‌కు అమ్మేశాడట.. ఎంత ధరకో తెలుసా?

Elon Musk Video Game : ఎలన్ మస్క్ గేమర్ కూడా.. 13ఏళ్లకే వీడియో గేమ్స్ క్రియేట్ చేశాడు.. మ్యాగజైన్‌కు గేమ్ ఎంతకు అమ్మేశాడంటే..?

Elon Musk created a video game when he was 13, sold it to a magazine for USD 500

Elon Musk Video Game : ప్రపంచ బిలియనీర్, ట్విట్టర్ (X) అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. మస్క్ ఏం చేసినా దానికో లెక్క ఉంటంది.. అందరికి ఆయన చేసే తిక్క పనులే గుర్తుకువస్తాయి. కానీ, మస్క్ చిన్నతనంలో చాలా అద్భుతాలు చేశాడు. తన అసాధారణ నాయకత్వం, ఎలక్ట్రిక్ కార్ల పట్ల ప్రేమ, హార్డ్‌కోర్ వర్కింగ్ స్టైల్ అయితో ప్రపంచ దృష్టిని మస్క్ ఆకర్షించాడు. గేమింగ్ పట్ల ఇష్టంతో కూడా ప్రతిసారీ మస్క్ వార్తల్లో నిలిచాడు. అయితే, మస్క్‌కి ఆటల పట్ల వ్యామోహం చిన్నప్పుడే మొదలైందని మీకు తెలుసా? ఇది మాత్రమే కాదు.. బిలియనీర్ 13 ఏళ్ల వయస్సులో వీడియో గేమ్‌ను కూడా క్రియేట్ చేశాడు.

అంతేకాదు.. ఆ వీడియో గేమ్ అమ్మేసి డబ్బును కూడా సంపాదించాడు. వాల్టర్ ఐజాక్సన్ (Walter Isaacson) రాసిన జీవిత చరిత్రలో, గేమింగ్ పట్ల మస్క్ ఇష్టాన్ని ఆయన ప్రస్తావించారు. స్పేస్‌ఎక్స్ (SpaceX) యజమానిగా మస్క్ 13 ఏళ్ల వయస్సులోనే ఒక వీడియో గేమ్‌ను ఎలా క్రియేట్ చేశాడు.. ఒక మ్యాగజైన్‌కి ఎలా విక్రయించాడనే విషయాన్ని బయోగ్రఫీ పుస్తకంలో రచయిత వాల్టర్ వివరించారు.

13ఏళ్ల వయస్సులోనే వీడియో గేమ్‌ :
పాస్కల్, టర్బో C++ ఉపయోగించి మస్క్ తనకు తాను ప్రోగ్రామింగ్ ఎలా నేర్పించాడో పుస్తకంలో ప్రస్తావించారు. 13 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మస్క్ (Blastar Video Game) అనే వీడియో గేమ్‌ని క్రియేట్ చేశాడు. ఇందులో భయానక హైడ్రోజన్ బాంబులు, స్టేటస్ బీమ్ మెషీన్‌లను మోసుకెళ్లే గ్రహాంతర అంతరిక్ష ఫ్రైటర్‌ను నాశనం చేశాడు.

Read Also : Elon Musk : మస్క్ మళ్లీ ఫిట్టింగ్ పెట్టాడుగా.. ఇకపై ట్విట్టర్ (X) యూజర్లందరూ డబ్బులు చెల్లించాల్సిందేనా..!

మస్క్ ఈ వీడియో గేమ్‌ను మ్యాగజైన్‌ (USD 500) డాలర్లకు విక్రయించాడు. అంటే.. (మన భారత కరెన్సీలో రూ. 40వేలు పైనే). ఆ తర్వాత, 13 ఏళ్ల మస్క్ మరో 2 వీడియో గేమ్‌లను మ్యాగజైన్‌కు విక్రయించాడు. ఒక గేమ్ డాంకీ కాంగ్ (Donkey Kong Game) 1990లలో పాపులర్ ఆర్కేడ్ గేమ్) మాదిరిగానే ఉండగా.. మరొకటి రౌలెట్ (roulette Game), బ్లాక్‌జాక్ స్టిమ్యులేటర్ (blackjack stimulator) గేమ్స్ రూపొందించాడు.

Elon Musk created a video game when he was 13, sold it to a magazine for USD 500

Elon Musk created a video game when he was 13, sold it to a magazine for USD 500

మస్క్‌కి గేమింగ్ అంటే ఇష్టం :
2023 మేలో, ప్రముఖ ఓపెన్-వరల్డ్ ఫాంటసీ గేమ్ ఎల్డెన్ రింగ్ (Elden Ring Game) క్రియేట్ చేయడం ద్వారా మస్క్ వెలుగులోకి వచ్చాడు. ఫ్రమ్‌సాఫ్ట్‌వేర్ ఇంక్ (FromSoftware Inc) అభివృద్ధి చేసిన గేమ్, గత ఏడాదిలో భారీగా ప్రజాదరణ పొందింది. 2022లో విడుదలైన అత్యుత్తమ గేమ్‌లలో ఇది ఒకటి. సోల్స్ గేమ్‌ (Soul Games)లు ఆడిన ఎవరికైనా ఎంత సవాలుగా ఉంటాయో తెలుసు. ఎల్డెన్ రింగ్ సోల్స్ గేమ్స్ ఆడేందుకు ఎదురు చూస్తున్న గేమర్ల కోసం రిలీజ్ అయింది. అయినప్పటికీ, చాలా మంది గేమర్లు ఆ గేమ్ లెక్కించడానికి చాలా శక్తిగా ఉన్నట్లు కనుగొన్నారు. మస్క్, 111 లెవల్ ఆడినందుకు చాలా గర్వంగా ఉందని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అయినప్పటికీ, సోల్స్ గేమ్స్ అనుభవజ్ఞులు మస్క్ గేమ్ స్వభావాన్ని విమర్శించారు.

సొంత ఆర్కేడ్ గేమింగ్ కోసం మస్క్ విఫలయత్నం :
వాల్టర్ ఐజాక్సన్ రాసిన అతని జీవితచరిత్రలో అతని బంధువు పీటర్ రైవ్‌ని ఉటంకిస్తూ.. ‘మీరు మస్క్‌తో ఆడుతున్నట్లయితే.. చివరికి తినాల్సి వచ్చే వరకు చాలా నాన్‌స్టాప్‌గా ఆడతారు. వెకేషన్ ట్రిప్‌లో, మస్క్ ఒకసారి మాల్‌లోని అన్ని గేమ్‌లను ఎలా హ్యాక్ చేయాలో కనుగొన్నాడు. అతను, అతని కజిన్‌లు నాణేలు అవసరం లేకుండా ఉచితంగా గేమ్‌లు ఆడుతున్నారని కూడా పుస్తకం వెల్లడించింది. యుక్తవయసులో, మస్క్ తన సొంత ఆర్కేడ్‌ గేమ్ క్రియేట్ చేయాలని కోరుకున్నాడు. లాభదాయకమైన వ్యాపారంగా ఎలా మార్చాలో కనుగొన్నాడు.

అయితే, అతను అతని బంధువులు నగర అనుమతులు కావాలని కోరడంతో సమస్య తలెత్తింది. దరఖాస్తును క్లోజ్ చేసేందుకు పెద్దలు అవసరమని, మస్క్ తన తండ్రి ఎర్రోల్‌ని అలా చేయమని అడగలేదు. దాంతో ఆ ఆలోచన ఫలించలేదు. ఈ పుస్తకంలో అతని మాజీ ప్రేయసి గ్రిమ్స్ గురించి ప్రస్తావించారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ముందు మస్క్ ఉదయం 5 గంటల వరకు ఎల్డెన్ రింగ్ గేమ్ గుర్తుచేసుకున్నాడు.

Read Also : Apple iPhone 15 Sale : వీడు మగాడ్రా బుజ్జీ.. ఐఫోన్ 15 కోసం అహ్మదాబాద్ నుంచి ముంబైకి.. 17 గంటలు క్యూలో నిలబడి కొన్నాడు..!