Apple iPhone 15 Sale : వీడు మగాడ్రా బుజ్జీ.. ఐఫోన్ 15 కోసం అహ్మదాబాద్ నుంచి ముంబైకి.. 17 గంటలు క్యూలో నిలబడి కొన్నాడు..!

Apple iPhone 15 Sale : ఐఫోన్ 15 సిరీస్‌ను కస్టమర్లు ఎగబడి కొనేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆపిల్ అభిమానులు (Apple Customers) ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్‌లకు తరలి వచ్చారు. అహ్మదాబాద్ నుంచి ముంబై వచ్చిన అభిమాని ఐఫోన్ 15 సొంతం చేసుకున్నాడు.

Apple iPhone 15 Sale : వీడు మగాడ్రా బుజ్జీ.. ఐఫోన్ 15 కోసం అహ్మదాబాద్ నుంచి ముంబైకి.. 17 గంటలు క్యూలో నిలబడి కొన్నాడు..!

iPhone 15 sale _ Man travelled from Ahmedabad to Mumbai to buy iPhone, waited for 17 hours

Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ క్రేజ్ అంతాఇంతా కాదు.. ఐఫోన్ 15 సొంతం చేసుకునేందుకు ఎంతదూరమైన వచ్చేస్తున్నారు అభిమానులు. భారత మార్కెట్లో ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ (iPhone 15 Series Launch) సందర్భంగా ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. దేశవ్యాప్తంగా ఆపిల్ అభిమానులు (Apple Customers) ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్‌లకు తరలి వచ్చారు. దాంతో ఆపిల్ స్టోర్ల వద్ద అభిమానులతో సందడిగా మారింది.

ఐఫోన్ 15 సిరీస్ కొనుగోలు చేసేందుకు వివేక్ అనే ఆపిల్ కస్టమర్ ఒకరు అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు హుటాహుటినా వచ్చేశాడు. ప్రతిష్టాత్మకమైన iPhone 15 సొంతం చేసుకుని స్టోర్ వద్ద అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ టెక్ ఔత్సాహికుడు ఐఫోన్ 15 కోసం చాలా ఓపికగా వేచి ఉన్నాడు. ముంబైలోని Apple BKC స్టోర్ వెలుపల 17 గంటల పాటు క్యూలో నిలబడి మరి ఐఫోన్ 15 కొనుగోలు చేశాడు.

ఆపిల్ అభిమానుల కష్టాలు వారి మాటల్లోనే.. 
అనంతరం ఆపిల్ కస్టమర్ (ANI)తో మాట్లాడుతూ.. ‘ఐఫోన్ సేల్ ముందు రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ ఉన్నాను. 17 గంటల పాటు లైన్‌లో నిలబడి ఉన్నాను. భారత మొట్టమొదటి ఆపిల్ స్టోర్ నుంచి ఫస్ట్ ఐఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఇక్కడకు వచ్చాను’ అని ఆ వ్యక్తి ఎంతో ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు. అతను (iPhone 15 Pro Max), వైట్ టైటానియంలోని 256GB వేరియంట్‌తో పాటు లేటెస్ట్ (Apple Watch Ultra 2), AirPods ముందస్తుగా ఆర్డర్ చేసినట్లు వెల్లడించాడు. ఆపిల్ బ్రాండ్ అంటే అతడికి ఎంత ఇష్టమో స్పష్టమైంది. ఆపిల్ పట్ల తన భావాల గురించి అడిగినప్పుడు.. అతను కేవలం నవ్వుతూ, ’Best Hai’ అని పేర్కొన్నాడు.

Read Also : Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15 కావాలా? ఈ బ్లింకిట్ స్టోర్‌లో ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. 10 నిమిషాల్లోనే హోం డెలివరీ.. ఇప్పుడే కొనేసుకోండి..! 

ముఖ్యంగా, ఈ ఉత్సాహం ఒక వ్యక్తికి మాత్రమే కాదు.. అనేక మంది ఇతర కస్టమర్‌లు ఆపిల్ పట్ల తమ ఆసక్తిని ప్రదర్శించారు. ఆపిల్ BKC స్టోర్‌కి తెల్లవారుజామున 4 గంటలకు వచ్చిన వివేక్.. ఐఫోన్ 15 ప్రోని కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి కానప్పటికీ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కొత్త ఐఫోన్ 15 ప్రో కొనుగోలు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, దీని కోసం ఏడాది పొడవునా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో మాత్రం ఐఫోన్ 15 కొనుగోలుపై అభిమానుల్లో ఎంతో ఉత్సాహం తగ్గలేదు.

iPhone 15 sale _ Man travelled from Ahmedabad to Mumbai to buy iPhone, waited for 17 hours

Apple iPhone 15 Sale : Man travelled from Ahmedabad to Mumbai to buy iPhone  

సంస్థ సాకేత్ స్టోర్‌లో మొదటి కస్టమర్ అయిన రాహుల్.. ఐఫోన్ 15 కొనుగోలు చేసినందుకు ఆనందంగా ఉందని తెలిపాడు. ‘ఇది ఒక గొప్ప అనుభవం.. నేను ఉదయం 4 గంటల నుండి క్యూలో ఉండి, ఆపై ఫోన్‌ని కొనుగోలు చేసాను. ఇప్పటికే నా దగ్గర ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 15 సిరీస్ ప్రకటించిన తర్వాత.. నేను ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నాను.. అది కూడా అందరి కంటే ముందే’ అని రాహుల్ తెలిపాడు.

ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 15 నుంచి భారత మార్కెట్లో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంది. వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ముందుగానే విక్రయానికి అందుబాటులోకి వచ్చింది. ఇటీవల భారత మార్కెట్లోఆపిల్ ప్రకటించిన కొత్త ఐఫోన్‌ల ధరలను ఓసారి లుక్కేయండి..

ఐఫోన్ 15 అన్ని మోడళ్లకు భారత్ ధర ఎంతంటే? :
iPhone 15 బేస్ 128GB ధర రూ. 79,900, 256GB మోడల్ రూ. 89,900కి విక్రయిస్తోంది. 512GB వెర్షన్ రూ.1,09,900 ధర ట్యాగ్‌తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

iPhone 15 Plus : భారత్ ధర ఎంత? :
128GB స్టోరేజీ కలిగిన iPhone 15 Plus ధర రూ. 89,900, 256GB వేరియంట్ ధర రూ. 99,900. అదే ఐఫోన్ ధర 512GB మోడల్ కూడా రూ. 1,19,900 ధరకు విక్రయిస్తోంది.

iPhone 15 Pro : భారత్ ధర ఎంతంటే? :
128GB మోడల్‌తో కూడిన ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,34,900, 256GB వేరియంట్ ధర రూ. 1,44,900. 512GB మోడల్‌ను ధర రూ. 1,64,900 లేదా 1TB వేరియంట్‌ను రూ. 1,84,900కి కొనుగోలు చేయవచ్చు.

iPhone 15 Pro Max భారత్ ధర ఎంతంటే? :
ఆపిల్ నుంచి అత్యంత ప్రీమియం ఐఫోన్ iPhone 15 Pro Max, 256GB మోడల్ ధర రూ.1,59,900 ఉండగా, 512GB వేరియంట్ ధర రూ. 1,79,900, అయితే 1TB మోడల్ ధర రూ. 1,99,900కి అందుబాటులో ఉంటుంది.

Read Also : Top 5 Smart TV Deals : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? అమెజాన్‌లో టాప్ 5 టీవీలపై అదిరే డీల్స్.. ఏ టీవీ ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఆగలేరు!