Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15 కావాలా? ఈ బ్లింకిట్ స్టోర్‌లో ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. 10 నిమిషాల్లోనే హోం డెలివరీ.. ఇప్పుడే కొనేసుకోండి..!

Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను కొన్ని నిమిషాల్లో కొనుగోలు చేయవచ్చు. ఆసక్తి గల కస్టమర్లు కొత్త (iPhone 15 Series)ను ఆర్డర్ చేసేందుకు బ్లింకిట్ అద్భుతమైన ఆప్షన్ అందిస్తోంది.

Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15 కావాలా? ఈ బ్లింకిట్ స్టోర్‌లో ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. 10 నిమిషాల్లోనే హోం డెలివరీ.. ఇప్పుడే కొనేసుకోండి..!

Apple iPhone 15 Sale available on Blinkit with 10-minute delivery option, Check Here details

Apple iPhone 15 Sale : ఆపిల్ కొత్త ఐఫోన్ 15 సిరీస్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. కొత్త ఐఫోన్ 15 సిరీస్‌ (Apple iPhone 15 Series)ను కేవలం కొన్ని నిమిషాల్లోనే కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ జొమాటో (Zomato) సొంత ఆన్‌లైన్ స్టోర్ బ్లింకిట్ (Blinkit Online Store) నుంచి ఢిల్లీ NCR, ముంబై, పూణేలోని వినియోగదారులకు కొత్త ఐఫోన్ 15 సిరీస్‌ను ఆర్డర్ చేసేందుకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది.

ఈ కొత్త 2023 ఐఫోన్‌ను కనీసం 10 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధిలో మీ ఇంటి వద్దకే డెలివరీ చేస్తుంది. ఈ సర్వీసు కోసం (Apple) అధీకృత స్టోర్ యునికార్న్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఆపిల్ అధికారిక స్టోర్ల (Apple Stores in India) వద్ద భారీ క్యూలను నివారించడానికి ఈ సర్వీసును ప్రారంభించింది. ఈ బ్లింకిట్ స్టోర్ వద్ద కూడా ఆపిల్ అభిమానులు లేటెస్ట్ ఐఫోన్‌లను సొంతం చేసుకునేందుకు గంటల తరబడి బారులు తీరుతున్నారు.

Read Also : iPhone 15 Sale Today : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై అదిరే సేల్.. ఏ ఐఫోన్ ధర ఎంతో తెలుసా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా ఇప్పుడే కొనేసుకోండి..!

ఆర్డర్ చేయడమే ఆలస్యం.. నిమిషాల్లో డెలివరీ :
ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ సేల్ సందర్భంగా దేశమంతటా చాలా మంది ఆపిల్ అభిమానులు (Apple Customers) టెక్ కంపెనీ అధికారిక ముంబై, ఢిల్లీ స్టోర్‌ల వద్ద భారీగా గుమిగూడారు. ఐఫోన్ 15 ప్రో మాక్స్ (iPhone 15 Pro Max) సొంతం చేసుకునేందుకు ముంబైలోని (Apple BKC) స్టోర్‌లో 17 గంటలపాటు వేచి ఉన్నానని ఆపిల్ అభిమాని వెల్లడించాడు. ఈ క్రమంలోనే (Blinkit) కొన్ని నిమిషాల్లో ఐఫోన్‌ను డెలివరీ చేస్తామని హామీ ఇస్తోంది. ఆపిల్ ప్రీమియం రీసెల్లర్ (Unicorn)తో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఈ సర్వీసును అందిస్తోంది.

ఇప్పటికే వినియోగదారులకు 4 డివైజ్‌లను కేవలం 10 నిమిషాల వ్యవధిలో విజయవంతంగా డెలివరీ చేసిందని బ్లింకిట్ ట్విట్టర్‌లో పేర్కొంది. బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా (Albinder Dhindsa) మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో యునికార్న్ APRతో భాగస్వామిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నిమిషాల్లో ఐఫోన్ 15 కస్టమర్లకు డెలివరీ చేస్తున్నాం. ఈ ప్రత్యేకమైన అనుబంధం ప్రపంచవ్యాప్తంగా మొదటిది. మా కస్టమర్‌లు ఎక్కువగా ఎదురుచూస్తున్న ప్రొడక్టులను తక్షణమే వారి ఇంటి వద్దకే డెలివరీ చేసే సౌలభ్యాన్ని అభినందిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

Apple iPhone 15 Sale available on Blinkit with 10-minute delivery option, Check Here details

Apple iPhone 15 Sale available on Blinkit with 10-minute delivery option

బ్లింకిట్ స్టోర్‌లో ఐఫోన్లపై అదిరే ఆఫర్లు, డిస్కౌంట్లు :
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌ (iPhone 15 Plus)లు బ్లింకిట్ ప్లాట్‌ఫారమ్‌లో వివిధ కలర్లు, స్టోరేజీ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. అదనంగా, కొనుగోలుదారులు లాంచ్ ఆఫర్ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఇందులో నో-కాస్ట్ EMI, తక్కువ ధరకే EMI ఆప్షన్, అర్హత కలిగిన HDFC కార్డ్‌లపై రూ. 5వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉన్నాయి. ఐఫోన్ 15 లేదా ఐఫోన్ 15 ప్లస్‌ని బ్లింకిట్ ద్వారా ఆర్డర్ చేయాలనుకునే కస్టమర్లు.. ఈ యాప్‌ని ఓపెన్ చేసి తమకు నచ్చిన మోడల్‌ను, కావలసిన వేరియంట్‌ని ఎంచుకోవచ్చు.

తద్వారా తమ కార్ట్‌లో యాడ్ చేసి చెక్‌అవుట్‌కి వెళ్లవచ్చు. అయితే, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ అమ్మకాలు ఆలస్యం అయ్యాయి. ఈ సర్వీసు ప్రస్తుతం ఈ 2 మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. బేస్ వేరియంట్ 128GB ఐఫోన్ 15 ధర రూ. 79,900, అయితే ఐఫోన్ 15 ప్లస్ 128GB ధర రూ. 89,900గా నిర్ణయించింది. ఐఫోన్ 15 ప్రో రూ. 1,34,900కి విక్రయిస్తోంది. ఆపిల్ నుంచి అత్యంత ప్రీమియం ఐఫోన్ అయిన ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధర రూ. 1,59,900కు విక్రయిస్తోంది.

Read Also : Apple Store Employees : ఆపిల్ స్టోర్ ఉద్యోగులు గంటకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? చేస్తే.. ఇలాంటి జాబ్ చేయాలి భయ్యా..!