Apple Store Employees : ఆపిల్ స్టోర్ ఉద్యోగులు గంటకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? చేస్తే.. ఇలాంటి జాబ్ చేయాలి భయ్యా..!

Apple Store Employees : ఆపిల్ ఉద్యోగుల సంపాదన ఎంతో తెలుసా? ఆఫ్‌లైన్ స్టోర్ (Apple Employees Salary) ఉద్యోగులకు గంట ప్రాతిపదికన ఆపిల్ ఎంత వేతనంగా చెల్లిస్తుందో తెలుసా? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Apple Store Employees : ఆపిల్ స్టోర్ ఉద్యోగులు గంటకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? చేస్తే.. ఇలాంటి జాబ్ చేయాలి భయ్యా..!

Apple Store Employees earning Rs 2,490 per hour, lower than previous year

Apple Store Employees : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ల (Apple iPhones)కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. అదే ఆపిల్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు కూడా అంతే క్రేజ్ ఉందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. ఆపిల్ ఉద్యోగుల వేతనాలు (Apple Employees Salaries) అంతగా ఉంటాయి మరి. ముఖ్యంగా ఆపిల్ ఆఫ్‌లైన్ స్టోర్లలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఎక్కువగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

వాస్తవానికి.. ఆపిల్ తన ఆఫ్‌లైన్ స్టోర్ ఉద్యోగులకు గంట ప్రాతిపదికన రూ.1,825 నుండి రూ.2,490 వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. కానీ, కంపెనీ తన రిటైల్ ఉద్యోగులకు వార్షిక పెంపుదలని తగ్గించినట్లు నివేదించింది. గత ఏడాదిలో ఆపిల్ అందించిన వేతనాల కన్నా ఈ ఏడాదిలో మాత్రం తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు.

గత ఏడాదిలో కన్నా తక్కువే :
బ్లూమ్‌బెర్గ్ నివేదిక (Bloomberg Report) ప్రకారం.. ఆపిల్ (Apple) ప్రస్తుత సంవత్సరానికి సుమారుగా 4 శాతం ‘సగటు వార్షిక పెంపు’ని అందించింది. 2022 ఏడాదికి ముందు ఉన్న స్థాయికి సమానంగా ఉంటుంది. 2023లో వేతనాల పెంపుదల పరిధి 2 శాతం నుంచి గరిష్టంగా 5 శాతానికి విస్తరించింది. గత ఏడాదిలో 8 శాతం నుంచి 10 శాతం వరకు పెరగగా.. అంతకంటే తక్కువగానే ఉందని నివేదిక వెల్లడించింది.

Read Also : iPhone 15 Sale Today : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై అదిరే సేల్.. ఏ ఐఫోన్ ధర ఎంతో తెలుసా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా ఇప్పుడే కొనేసుకోండి..!

2022లో వేతనాల పెంపుదల పెరగడానికి ఉద్యోగుల కొరత, అభివృద్ధి చెందుతున్న యూనియన్‌ల ఉద్యమం కారణమని చెప్పవచ్చు. ఇప్పటివరకు కేవలం రెండు ఆపిల్ (Apple Stores) స్టోర్‌లు మాత్రమే విజయవంతంగా యూనియన్‌గా మారాయి. ఈ నిర్ణయంతో అమెరికాలో విస్తృత ఆర్థిక ధోరణులకు అనుగుణంగా మారింది. ఈ ఏడాదిలో వేతన వృద్ధి మందగించింది. దాంతో పాటు ద్రవ్యోల్బణం రేట్లు కూడా భారీగా తగ్గాయి.

ఆపిల్ ఇండియా స్టోర్ ఉద్యోగుల మాటేంటి? :
ప్రస్తుతం భారతీయ ఆపిల్ స్టోర్ ఉద్యోగులకు (Apple Stores in India) సంబంధించిన ఎలాంటి గణాంకాలు లేవు. అయినప్పటికీ, అమెరికాలో చాలా మంది ఆపిల్ సేల్స్ టీమ్ (Apple Sales Team) గంటకు 22 డాలర్లు (సుమారు రూ. 1,825) నుంచి 30 డాలర్లు (సుమారు రూ. 2,490) వరకు సంపాదిస్తున్నారని పేర్కొంది. (AppleCare) రోల్స్‌లోని ఉద్యోగులు కొంచెం ఎక్కువగా వేతనాలను పొందవచ్చనని నివేదిక వెల్లడించింది.

Apple Store Employees earning Rs 2,490 per hour, lower than previous year

Apple Store Employees earning Rs 2,490 per hour, lower than previous year

అదనంగా, ఆపిల్ ఏడాదికి రెండు వర్గాల ఉద్యోగులకు పరిమితం చేసిన స్టాక్ యూనిట్లను జారీ చేస్తుంది. చాలా ప్యాకేజీలు ఈ ఏడాదిలో సుమారు 2వేల డాలర్ల వద్ద అగ్రస్థానంలో ఉన్నాయి. ఇంకా, టెక్ దిగ్గజం ఎంపిక చేసిన కార్మికులకు అరుదైన బోనస్‌లను కూడా అందించింది. ఆపిల్ ఉద్యోగుల పెరుగుదలలో ఈ రీకాలిబ్రేషన్ ఆపిల్ కేర్ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్‌కి కూడా విస్తరిస్తుంది. గత ఏడాదిలో వేతనాల పెంపుదల కన్నా తక్కువగా ఉండవచ్చు.

ఐఫోన్ 15 సిరీస్ సేల్స్.. ధర ఎంతంటే? :
అంతేకాకుండా, కొత్త ఐఫోన్ 15 సిరీస్ (iPhone 15 Series) మొదటిసారిగా ముందుగానే అమ్మకానికి వచ్చింది. భారత అంతటా చాలా మంది ఆపిల్ అభిమానులు (Apple Customers) టెక్ కంపెనీ అధికారిక ముంబై (Apple Mumbai BKC Store), ఢిల్లీ స్టోర్ (Apple Delhi Saket Store) వద్ద భారీగా గుమిగూడారు.

ఆపిల్ ఐఫోన్లలో ఐఫోన్ 15 బేస్ 128GB వేరియంట్ ధర రూ. 79,900, అయితే (iPhone 15 Plus) 128GB వేరియంట్ ధర రూ. 89,900గా ఉంది. ఐఫోన్ 15 ప్రో (Apple iPhone 15 Pro) రూ. 1,34,900కి విక్రయిస్తోంది. ఆపిల్ నుంచి అత్యంత ప్రీమియం ఐఫోన్ మోడల్ అయిన ఐఫోన్ 15 ప్రో మాక్స్ (iPhone 15 Pro Max) ధర రూ. 1,59,900కి కంపెనీ విక్రయిస్తోంది.

Read Also : Apple iPhone 15 Sale : ఐఫోన్ 15 సేల్ మొదలైందోచ్.. ఆపిల్ స్టోర్ల వద్ద అభిమానుల సందడి.. కొత్త ఐఫోన్లు ఎగబడి కొనేస్తున్నారు..!