Apple iPhone 15 Pro Sale : ఆపిల్ ఐఫోన్ 15ప్రో సేల్.. ఈ కొత్త ఐఫోన్ టచ్ చేస్తే చాలు.. టైటానియం ఫ్రేమ్ రంగులు మార్చేస్తుంది.. ధర ఎంతంటే?

Apple iPhone 15 Pro Sale : ఆపిల్ ఐఫోన్ 15ప్రో సేల్.. ఈ కొత్త ఐఫోన్ టచ్ చేస్తే చాలు.. టైటానియం ఫ్రేమ్ రంగులు మార్చేస్తుంది.. ధర ఎంతంటే?

Apple says iPhone 15 Pro's titanium frame might change colour due to fingerprints

Apple iPhone 15 Pro Sale : ఆపిల్ కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 15 ప్రో మోడల్ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది. 2023 ఏడాది సెప్టెంబర్ 12న జరిగిన (Apple Wonderlust) ఈవెంట్‌లో (iPhone 15 Pro)ని ప్రవేశపెట్టింది. అయితే, ఈరోజు (సెప్టెంబర్ 22) నుంచి ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ సేల్ మొదలైంది. ఐఫోన్ 15 ప్రో టైటానియం బాడీని కలిగి ఉన్నందున, కొనుగోలుదారులు ఐఫోన్ టైటానియం బాడీని టచ్ చేయగానే.. ఫ్రేమ్ కలర్ వెంటనే మారిపోతుందని సపోర్టు పేజీలో ఆపిల్ తెలిపింది.

ఈ మార్పు రివర్సిబుల్ అని చెబుతోంది. ఒకసారి టచ్ చేయగానే కలర్ మారిపోవడం, ఆ తర్వాత ఫోన్ టైటానియం ఫ్రేమ్ కలర్ ఎప్పటిలానే ఉంటుందని, ఈ విషయంలో వినియోగదారులు చింతించాల్సిన పని లేదని పేర్కొంది. (Apple iPhone 15) అసలు కలర్ మళ్లీ రావాలంటే ఒక మార్గాన్ని కూడా రివీల్ చేసింది.

Apple says iPhone 15 Pro's titanium frame might change colour due to fingerprints

Apple says iPhone 15 Pro’s titanium frame might change colour due to fingerprints

ఐఫోన్ 15 ప్రో లాంచ్ సమయంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (CEO Tim Cook) మాట్లాడుతూ.. కంపెనీ క్రియేట్ చేసిన అత్యంత ఆకర్షణీయమైన ప్రో ఐఫోన్ (iPhone 15 Pro) అని అన్నారు. ఈ మోడల్ పవర్‌ఫుల్ ప్రాసెసర్, ఆకట్టుకునే కెమెరా అప్‌గ్రేడ్‌లు, ఆసక్తికరమైన స్పెసిఫికేషన్‌లు ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రో కోసం చూస్తున్న కొనుగోలుదారులకు ఇదే సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ ఐఫోన్‌ను ప్రవేశపెట్టిన సమయంలో ఆపిల్ ప్రధానంగా వివరించిన అంశాలలో ఒకటి ఫోన్ టైటానియం బాడీ.. ఇది ఫోన్‌ను తేలికగా, మరింత మన్నికైనదిగా చేస్తుంది. అయితే, ఈ టైటానియం ఫ్రేమ్ రంగుల మారుస్తూ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

Read Also : iPhone 15 Sale Today : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై అదిరే సేల్.. ఏ ఐఫోన్ ధర ఎంతో తెలుసా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా ఇప్పుడే కొనేసుకోండి..!

రంగులు మార్చే టైటానియం బాడీ :
సపోర్టు పేజీలో.. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మోడల్‌ గురించి టెక్ దిగ్గజం అనేక ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించింది. ఒకసారి టైటానియం బాడీ రంగు మారితే.. కంగారు పడొద్దని సూచిస్తోంది. అసలు రంగుకు మారాలంటే.. ఐఫోన్‌ను మృదువైన, కొద్దిగా తడిగా ఉన్న గుడ్డతో తుడవడమేనని తెలిపింది. ఐఫోన్ 15 ప్రో, (iPhone 15 Pro Max) మోడల్ టచ్ చేయగానే చర్మంపై వేలిముద్రలతో ఫోన్ బాహ్య బ్యాండ్ రంగు తాత్కాలికంగా మారిపోతుంది. అప్పుడు, ఐఫోన్‌ను మెత్తని కొద్దిగా తడిగా ఉన్న వస్త్రంతో తుడవడం వల్ల అసలు రూపానికి మారిపోతుందని సపోర్టు పేజీ పేర్కొంది. ఆపిల్ గ్లాస్ ఫినిషింగ్, ‘మెటీరియల్ ట్రాన్స్‌ఫర్’తో వచ్చే ఇతర ఐఫోన్‌లు కొన్నిసార్లు స్క్రాచ్ మాదిరిగా అనిపించవచ్చునని కంపెనీ తెలిపింది.

ఐఫోన్ 15 ప్రో సేల్.. ధర, టాప్ ఫీచర్లు ఇవే :
ఐఫోన్ 15 సిరీస్ సేల్ సందర్భంగా.. ఆసక్తిగల కొనుగోలుదారులు ఆపిల్ స్టోర్ల వద్ద భారీగా క్యూ కట్టారు. భారత మార్కెట్లో గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రోతో పోలిస్తే.. ఐఫోన్ 15 ప్రో ధరలు అమాంతం పెరిగాయి. ఐఫోన్ 15 ప్రో మొత్తం 4 స్టోరేజ్ వేరియంట్‌లలో వచ్చింది. 128GB వేరియంట్ ధర రూ.1,34,900 కాగా, 256GB వేరియంట్ ధర రూ.1,44,900గా నిర్ణయించింది. 512GB వేరియంట్ రూ. 1,64,900, 1TB వేరియంట్ ధర రూ. 1,84,900కు సొంతం చేసుకోవచ్చు. ఈ కొత్త ఐఫోన్ 15 సిరీస్ బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం అనే 4 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

Apple says iPhone 15 Pro's titanium frame might change colour due to fingerprints

Apple says iPhone 15 Pro’s titanium frame might change colour due to fingerprints

ఐఫోన్ 15 ప్రో గ్రేడ్ 5 టైటానియం బాడీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ను మరింత మన్నికైనదిగా, తేలికైన బరువు ఉంటుంది. ఈ ఐఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో ఐఫోన్‌లో సన్నని బార్డర్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ అదనంగా ప్రొటెక్షన్ లేయర్ సిరామిక్ షీల్డ్ ఉంది. ఈ ఐఫోన్ అంచులు గుండ్రంగా, మృదువుగా ఉంటాయి. చేతులతో పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. గత ఏడాదిలో ప్రో మోడల్‌ల మాదిరిగానే.. ఈ ఐఫోన్ డైనమిక్ ఐలాండ్ నాచ్‌ను కలిగి ఉంది. ఆపిల్ సాధారణ మ్యూట్ బటన్‌కు బదులుగా యాక్షన్ బటన్‌ను కూడా తీసుకొచ్చింది.

ఐఫోన్ 15 ప్రో A17 ప్రో ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. iPhone 15 Pro హై రిజల్యూషన్ ఫొటోలకు సపోర్టు చేస్తుంది. 48MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. కెమెరా యూజర్లలో 3 ఫోకల్ లెంగ్త్‌ మధ్య మారడానికి అనుమతిస్తుంది. 24mm, 28mm, 35mm కొత్త డిఫాల్ట్‌గా కూడా ఎంచుకోవచ్చు. ప్రైమరీ కెమెరా నుంచి దూరంగా, ఐఫోన్ 15 ప్రో విస్తారమైన 3x టెలిఫోటో కెమెరాతో కూడా వస్తుంది. బ్యాటరీ పరంగా చూస్తే.. ఐఫోన్ 15 ప్రో రోజంతా ఉంటుందని ఆపిల్ పేర్కొంది. ఐఫోన్ లైనప్‌లోని ఇతర ఫోన్‌ల మాదిరిగానే టైప్-C USB పోర్ట్ ద్వారా బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు.

Read Also : Apple Watch Series Sale : కొంటే ఆపిల్ వాచ్ కొనాల్సిందే భయ్యా.. ఆపిల్ వాచ్ సిరీస్‌పై దిమ్మతిరిగే సేల్.. భారత్‌లో ధర ఎంత? ఆఫర్లు మీకోసం..!