Flipkart Big Billion Days Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023.. రూ. 20వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

Flipkart Big Billion Days Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023లో కస్టమర్‌లు రూ. 20వేల లోపు స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను పొందవచ్చు.

Flipkart Big Billion Days Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023.. రూ. 20వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

Flipkart Big Billion Days Sale 2023 _ Best phones under Rs 20,000; check offers on Samsung, OnePlus, Motorola and Realme Smartphones

Flipkart Big Billion Days Sale 2023 : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 తేదీలు రివీల్ అయ్యాయి. అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు వారం రోజుల పండుగ సేల్ కొనసాగనుంది. ఈ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ వివిధ రకాల స్మార్ట్‌ఫోన్‌లపై లాభదాయకమైన ఆఫర్‌లను అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మైక్రోసైట్ స్మార్ట్‌ఫోన్‌ల రేంజ్‌పై ఆఫర్‌లు, తగ్గింపులను కలిగి ఉంది. కస్టమర్లు సరసమైన ధరలకు స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.

క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై అదనపు డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో, నథింగ్ ఫోన్ 1, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5, పిక్సెల్ 7, ఒప్పో రెనో 10 ప్రో 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. దాంతో పాటు, వినియోగదారులు Samsung Galaxy F13, Moto G32, Vivo V29e, Poco M5, Realme 11x 5G, Infinix Hot 30 వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా ఆకర్షణీయమైన డీల్స్ పొందవచ్చు.

Read Also : ChromeBooks Laptops : గూగుల్, HP భాగస్వామ్యం.. భారతీయ విద్యార్థుల కోసం రూ. 20వేల లోపు ధరకే కొత్త క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్స్..

ఫ్లిప్‌కార్ట్ సేల్ 2023 : రూ. 20వేల లోపు బెస్ట్ ఫోన్‌లపై ఆఫర్లు :
మీరు రూ. 20వేల కన్నా తక్కువ బడ్జెట్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 వివిధ బ్రాండ్‌లకు గొప్ప ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. రూ. 20వేల లోపు కేటగిరీలోని కొన్ని బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Flipkart Big Billion Days Sale 2023 _ Best phones under Rs 20,000; check offers on Samsung, OnePlus, Motorola and Realme Smartphones

Flipkart Big Billion Days Sale 2023 _ Best phones under Rs 20,000 

• Samsung Galaxy F13 : ధర రూ.14,999 నుంచి రూ.9,199కి తగ్గింది.
• Samsung Galaxy F04 : ధర రూ. 11,499 నుంచి రూ. 6,499కి తగ్గింది.
• Realme C55 ధర : రూ. 12,999 నుంచి రూ. 9,499కి తగ్గింది.
• Realme 10 Pro 5G : రూ. 15,999 తగ్గింపు ధరలో లభిస్తుంది.
• Realme 11x 5G : ధర రూ. 16,999 నుంచి 14,999కి తగ్గింది.
• Moto G32 : రూ. 9,999 తగ్గింపు ధరలో లభిస్తుంది.
• Moto G14 : ధర రూ. 12,999 నుంచి రూ. 8,999కి తగ్గింది.
• Oppo A17K : ధర రూ.10,999 నుంచి రూ.7,999కి తగ్గింది.
• Oppo A38 : రూ. 16,999 అసలు ధరతో పోలిస్తే.. రూ. 12,999 వద్ద లభిస్తుంది.
• POCO M5 : మార్కెట్ ధర రూ. 15,999కి రూ. 6,999 వద్ద లభిస్తుంది.
• Redmi Note 12 : ధర రూ. 18,999 నుంచి రూ. 10,799కి తగ్గింది.
• Redmi Note 12 5G : ధర రూ. 19,999 నుంచి రూ. 13,999కి తగ్గింది.

Read Also : Amazon Great Indian Festival 2023 : అమెజాన్ ఫెస్టివల్ 2023 డీల్స్.. ఈ ల్యాప్‌టాప్స్, మొబైల్స్, స్మార్ట్ టీవీలపై అదిరే డిస్కౌంట్లు!