ChromeBooks Laptops : గూగుల్, HP భాగస్వామ్యం.. భారతీయ విద్యార్థుల కోసం రూ. 20వేల లోపు ధరకే కొత్త క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్స్..

ChromeBooks Laptops India : భారత మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ గూగుల్ క్రోమ్‌బుక్ (Google Chromebook) ల్యాప్‌టాప్‌లను తయారు చేసేందుకు Google, HP కంపెనీ భాగస్వామ్యంలో పనిచేస్తున్నాయి.

ChromeBooks Laptops : గూగుల్, HP భాగస్వామ్యం.. భారతీయ విద్యార్థుల కోసం రూ. 20వేల లోపు ధరకే కొత్త క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్స్..

Google And HP join hands to make Chromebooks under Rs 20,000 for students

ChromeBooks Laptops for Students in India : భారత మార్కెట్లో విద్యార్థుల కోసం ప్రత్యేకించి సరికొత్త గూగుల్ క్రోమ్‌బుక్స్ ల్యాప్‌టాప్స్ అందుబాటులోకి రానున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవతో టెక్ దిగ్గజాలు HP, Google భారత్‌లో బడ్జెట్-ఫ్రెండ్లీ (Chromebook) ల్యాప్‌టాప్‌లను తయారు చేయనున్నాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో సరసమైన నోట్‌బుక్ మార్కెట్‌ను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో, ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సేకరణ అవసరాలను తీర్చనున్నాయి.

Read Also : Noise Air Buds Pro SE Launch : 45 గంటల ఫుల్ బ్యాటరీ లైఫ్‌‌తో నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో SE TWS ఇయర్‌ఫోన్‌లు..!

నివేదిక ప్రకారం.. క్రోమ్‌బుక్ డివైజ్‌ల ధర సుమారుగా రూ. 20వేలు ఉంటుందని అంచనా. బల్క్ కొనుగోళ్లలో కూడా తక్కువ ధరలకు పొందవచ్చు. ఆగస్ట్ 2020 నుంచి HP ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లను తయారు చేస్తున్న చెన్నై సమీపంలోని ఫ్లెక్స్ ఫెసిలిటీలో ఈ ఉత్పత్తి జరుగుతుంది. ప్రాథమికంగా విద్యారంగంలో సరసమైన PC డిమాండ్‌ను తీర్చడంపై ప్రాథమిక దృష్టితో అక్టోబర్ 2న తయారీ ప్రారంభించనుంది. గూగుల్ భారత్‌లో క్రోమ్‌బుక్స్ ఉత్పత్తి చేయబడటం ఇదే మొదటిసారి.

తక్కువ ఖర్చుతో పర్సనల్ కంప్యూటర్లు :
హెచ్‌పీ (HP) ఇండియాలో సీనియర్ డైరెక్టర్ (పర్సనల్ సిస్టమ్స్) విక్రమ్ బేడీ, డిజిటల్ ఈక్విటీని అభివృద్ధి చేయడం, భారత్‌లో డిజిటల్ విద్యా కార్యక్రమాలకు సపోర్టు ఇవ్వడంతో HP నిబద్ధతను వ్యక్తం చేశారు. (Chromebook) ల్యాప్‌టాప్‌లను స్థానికంగా ఉత్పత్తి చేయడం ద్వారా భారతీయ విద్యార్థులు తక్కువ ఖర్చుతో కూడిన పర్సనల్ కంప్యూటర్‌లకు యాక్సెస్‌ను పెంచుకుంటారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ పట్ల HP అంకితభావాన్ని విక్రమ్ బేడీ ప్రస్తావించారు.

Google And HP join hands to make Chromebooks under Rs 20,000 for students

ChromeBooks Laptops India under Rs 20K for students

గూగుల్ మిషన్‌లో ఇదో మైలురాయి :
గూగుల్ (Google) ఈ సహకారాన్ని బడ్జెట్‌కు అనుకూలమైన నోట్‌బుక్‌లతో భారతీయ విద్యా వ్యవస్థలో మరింతగా విలీనం చేసుకునే అవకాశం ఉంది. గూగుల్‌లోని ఎడ్యుకేషన్ హెడ్ (దక్షిణాసియా) బని ధావన్, వివిధ ప్రొడక్టులు, ఉపాధ్యాయ కార్యక్రమాల ద్వారా డిజిటల్-ఫస్ట్ లెర్నింగ్ అనుభవాలకు మారడంలో స్థానిక విద్యా పర్యావరణ వ్యవస్థకు సాయం చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను ప్రస్తావించారు. HP భాగస్వామ్యంతో (Chromebooks) స్థానిక ఉత్పత్తి అనేది భారత్‌లో విద్య డిజిటల్ పరివర్తనకు సపోర్టు ఇచ్చే గూగుల్ మిషన్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోనుంది.

ఈ సహకారంతో మరిన్ని పాఠశాలల్లో టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రతి విద్యార్థి, అధ్యాపకుడు వారి పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేసేందుకు అవసరమైన టూల్స్, నైపుణ్యాలను పొందగలరని ధావన్ ఆశాభావం వ్యక్తం చేశారు. HP, Google మధ్య ఈ జాయింట్ వెంచర్ భారత్ మేక్ ఇన్ ఇండియా చొరవకు సపోర్టు ఇవ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా విద్యార్థులు, సంస్థలకు మరింత సరసమైన ధరకే క్రోమ్‌బుక్స్ అందుబాటులో ఉండేలా డిజిటల్ విద్యా పరిష్కారాలకు మార్గం సుగమం చేస్తుంది.

Read Also : Maruti Fronx Baleno Bookings : మారుతి సుజుకి ఫ్రాంక్స్, బాలెనో కలిపి కుమ్మేశాయి.. రోజువారీ బుకింగ్స్ ఎంతో తెలుసా?