Noise Air Buds Pro SE Launch : 45 గంటల ఫుల్ బ్యాటరీ లైఫ్‌‌తో నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో SE TWS ఇయర్‌ఫోన్‌లు..!

Noise Air Buds Pro SE Launch : కొత్త ఇయర్‌బడ్స్ కొనేందుకు చూస్తున్నారా? 45 గంటల బ్యాటరీ లైఫ్‌తో నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో SE TWS ఇయర్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.

Noise Air Buds Pro SE Launch : 45 గంటల ఫుల్ బ్యాటరీ లైఫ్‌‌తో నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో SE TWS ఇయర్‌ఫోన్‌లు..!

Noise Air Buds Pro SE TWS Earphones With Up to 45-Hour Total Battery Life Launched in India

Noise Air Buds Pro SE Launch : నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో (SE TWS) ఇయర్‌ఫోన్‌లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఎంట్రీ-లెవల్ వేరబుల్ 30dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)ని అందిస్తుంది. కేస్‌తో ఒక్క ఛార్జ్‌పై గరిష్టంగా 45-గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. నాయిస్ నుంచి లేటెస్ట్ ఇయర్‌ఫోన్‌లు వాటర్, డెస్ట్ నిరోధకతకు IPX5 రేటింగ్‌ను కలిగి ఉంటాయి. ఇయర్‌ఫోన్‌లు ENC సపోర్ట్‌తో క్వాడ్ మైక్‌లను కలిగి ఉంటాయి. కాల్ క్వాలిటీని మెరుగుపరుస్తాయి. నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో SE TWS ఇయర్‌ఫోన్‌లు ఇప్పటికే భారత్‌లో 2 కలర్ వేరియంట్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో SE ఇయర్‌ఫోన్‌లు.. ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో SE TWS ఇయర్‌ఫోన్‌లు సెప్టెంబర్ 30 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఇయర్‌ఫోన్‌ల కొనుగోలుపై కంపెనీ అద్భుతమైన డీల్ అందిస్తోంది. రూ. 1,699కు తగ్గింపు పొందవచ్చు. లస్టర్ బ్లాక్, షాంపైన్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇయర్‌ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ లేదా అధికారిక నాయిస్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Read Also : NoiseFit Halo Smartwatch : 150కిపైగా క్లౌడ్ వాచ్ ఫేస్‌లతో నాయిస్‌ఫిట్ హాలో స్మార్ట్‌వాచ్, కేవలం రూ. 3,999 మాత్రమే..!

నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో SE ఇయర్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
నాయిస్ నుంచి లేటెస్ట్ ఆఫర్ మెటాలిక్ ఫినిషింగ్ కేస్‌లో వస్తుంది. కేస్‌తో పాటు ప్రతి బడ్‌పై నాయిస్ బ్రాండింగ్ ఉంటుంది. ఇయర్‌ఫోన్‌లు ఇన్-ఇయర్ డిజైన్‌ను పొందుతాయి. నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో SE TWS ఇయర్‌ఫోన్‌లు ENC (ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్)ని పొందుతాయి. 30dB వరకు ANCతో కాల్‌ క్వాలిటీని మెరుగుపరుస్తుంది. క్వాడ్ మైక్రోఫోన్ సెటప్‌ను కూడా కలిగి ఉంటాయి. ఇయర్‌ఫోన్‌లలో 13mm డ్రైవర్‌ను అమర్చారు.

Noise Air Buds Pro SE TWS Earphones With Up to 45-Hour Total Battery Life Launched in India

Noise Air Buds Pro SE Launch

స్మార్ట్ టచ్ కంట్రోల్‌తో, నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో SE ఇయర్‌ఫోన్‌లు వినియోగదారులు హ్యాండ్స్-ఫ్రీ కాల్‌లను స్వీకరించడానికి అనుమతిస్తాయి. సిరి (Siri) లేదా గూగుల్ అసిస్టెంట్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఇయర్‌బడ్స్‌లో టచ్-సెన్సిటివ్ ఏరియాపై ట్యాప్ చేయడం ద్వారా వాల్యూమ్‌ను కంట్రోల్ చేయొచ్చు. అలాగే మ్యూజిక్ ప్లే చేయవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే.. నాయిస్ కేస్‌తో గరిష్టంగా 45 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందజేస్తుంది. ఒక్క ఛార్జ్‌పై ఒక్కో బడ్‌పై గరిష్టంగా 7.5 గంటల బ్యాటరీ లైఫ్ అందజేస్తుందని పేర్కొంది.

బడ్స్ పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు 30 నిమిషాల వరకు పడుతుంది. అయితే, కేస్‌ను నాయిస్ ప్రకారం.. 90 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. కేసు ఛార్జింగ్ ఇండెక్స్ కూడా పొందవచ్చు. ఇయర్‌బడ్స్ బరువు విషయానికి వస్తే.. బడ్స్ ఒక్కొక్కటి 3.3 గ్రాములు, కేసు బరువు 33.3 గ్రాములు. నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో SE ఇయర్‌ఫోన్‌లు డెస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IPX5 రేటింగ్‌ను పొందుతాయి. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్టు అందిస్తుంది. Android, iOS డివైజ్‌లకు సపోర్టుగా ఉంటాయి.

Read Also : Noise Earbuds X Price : కేవలం రూ. 2వేల లోపు ధరకే నాయిస్ బడ్స్ X ఇయర్‌బడ్స్.. 35గంటల బ్యాటరీ లైఫ్‌ కూడా.. ఇప్పుడే కొనేసుకోండి!