NoiseFit Halo Smartwatch : 150కిపైగా క్లౌడ్ వాచ్ ఫేస్‌లతో నాయిస్‌ఫిట్ హాలో స్మార్ట్‌వాచ్, కేవలం రూ. 3,999 మాత్రమే..!
NoiseFit Halo Smartwatch : ప్రముఖ వేరబుల్ స్మార్ట్‌వాచ్ మేకర్ నాయిస్ నుంచి నాయిస్‌ఫిట్ హాలో స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్లో లాంచ్ అయింది.

NoiseFit Halo Smartwatch With Over 150 Watch Faces, Bluetooth Calling Launched in India
NoiseFit Halo Smartwatch : ప్రముఖ వేరబుల్ స్మార్ట్‌వాచ్ మేకర్ నాయిస్ నుంచి నాయిస్‌ఫిట్ హాలో (NoiseFit Halo Smartwatch) స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. స్వదేశీ బ్రాండ్ నాయిస్ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ 466×466 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 1.43-అంగుళాల రౌండ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
బ్లూటూత్ కాలింగ్, 150కి పైగా వాచ్ ఫేస్‌లతో పాటు అనేక హెల్త్ సూట్‌లు, స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. ఈ వాచ్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68-రేట్ కలిగి ఉంది. NoiseFit Halo స్మార్ట్‌వాచ్ 6 కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ వేరబుల్ స్మార్ట్‌వాచ్ 7 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. భారీ కాలింగ్‌తో ఒక రోజు వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
నాయిస్‌ఫిట్ హాలో స్మార్ట్‌వాచ్ ధర ఎంతంటే?:
కొత్తగా లాంచ్ అయిన NoiseFit Halo స్మార్ట్‌వాచ్ ధర రూ. 3,999గా ఉంది. భారత మార్కెట్లో ఫిబ్రవరి 27 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు IST సేల్ అందుబాటులో ఉంది. NoiseFit వెబ్‌సైట్, Amazon India ద్వారా సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ స్టేట్‌మెంట్ బ్లాక్, జెట్ బ్లాక్, క్లాసిక్ బ్లాక్, వింటేజ్ బ్రౌన్, ఫారెస్ట్ గ్రీన్, ఫైరీ ఆరెంజ్ వంటి 6 విభిన్న కలర్ వేరియంట్‌లలో వస్తుంది.

NoiseFit Halo Smartwatch With Over 150 Watch Faces, Bluetooth Calling Launched in India
NoiseFit హాలో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఇవే :
నాయిస్‌ఫిట్ Halo స్మార్ట్‌వాచ్ 466×466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.43-అంగుళాల ఆల్వేస్-ఆన్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ ప్రీమియం మెటాలిక్ బిల్డ్‌ను కలిగి ఉంది. ఇందులో లెదర్, టెక్స్‌చర్డ్ సిలికాన్, స్టాండర్డ్ సిలికాన్ అనే 3 స్ట్రాప్ ఆప్షన్లు ఉన్నాయి. Tru Sync ద్వారా ఆధారితమైన బ్లూటూత్-కాలింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అంతేకాదు. తక్కువ పవర్ వినియోగాన్ని అందిస్తుంది.
అదనంగా, Noise నుంచి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్‌వాచ్‌లో 150కి పైగా క్లౌడ్ వాచ్ ఫేస్‌లు, మల్టీ స్పోర్ట్స్ మోడ్‌లు, SpO2 మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, స్టెప్ ట్రాకర్ వంటి హెల్త్ మానిటరింగ్ సెన్సార్‌లు ఉన్నాయి. NoiseFit Halo స్మార్ట్‌వాచ్ ఒకే ఛార్జ్‌పై ఒక వారం వరకు, భారీ బ్లూటూత్ కాలింగ్‌తో ఒక రోజు వరకు ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వాచ్‌కు సంబంధించిన లిస్టింగ్‌లో IP68-రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్, స్మార్ట్ టచ్ టెక్, నోటిఫికేషన్‌లు, వెదర్ అప్‌డేట్‌లు మరిన్ని ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.