Today Gold Rate : స్వల్పంగా పెరిగిన పసిడి ధర

మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి

Today Gold Rate : స్వల్పంగా పెరిగిన పసిడి ధర

Gold Price

Today Gold Rate : భారతీయులు బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉత్పత్తి తక్కువ ఉన్నప్పటికీ డిమాండ్‌కు తగినట్లుగా దిగుమతి జరుగుతుంది. బంగారం ధరలు నిత్యం ఒకేలా ఉండవు.. సంవత్సరం మొత్తం మీద 20 నుంచి 30 రోజులు స్థిరంగా ఉంటే.. మిగతా రోజుల్లో మాత్రం ఎచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. ఇక ఈ రోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ నగరం ధరలను పరిగణలోకి తీసుకుంటే.. నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.90 పెరిగి 45,550 చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి 49,590కి చేరింది. అయితే గత కొద్దీ రోజులుగా బంగారం ధరల్లో పెద్ద మార్పులేమీ చోటుచేసుకోలేదు. గడిచిన నాలుగు రోజుల్లో రెండు రోజులు స్థిరంగా ఉండగా.. మరో రెండు రోజులు స్వల్పంగా పెరిగింది.

చదవండి : Gold Rate Today : పసిడిప్రియులకు శుభవార్త

ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,240గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690 ఉంది.
కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,590 ఉంది.

చదవండి : Today Gold Price : మార్కెట్ వివరాలు.. పెరిగిన బంగారం ధర

తెలుగు రాష్ట్రాల్లోని బంగారం ధరలు

హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,590గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,590గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,590గా ఉంది.