Honda City 2023 Offers : కొత్త కారు కొంటున్నారా? ఈ రెండు హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!

Honda City 2023 Offers : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారీ ఆఫర్లను అందిస్తోంది. ఏప్రిల్‌లో ఈ రెండు హోండా కార్ల (Honda Cars Discounts) పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Honda City 2023 Offers : కొత్త కారు కొంటున్నారా? ఈ రెండు హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!

Honda City 2023 Offers Photo Credit (Honda Cars India)

Honda City 2023 Offers : కొత్త కారు కొంటున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) తమ కార్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో కేవలం రెండు కారు మోడళ్లను మాత్రమే హోండా విక్రయిస్తోంది.

అందులో కాంపాక్ట్ సెడాన్, అమేజ్ (Amaze), మిడ్-సైజ్ సెడాన్, సిటీ ఉన్నాయి. మీరు ఇందులో ఒకదాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఏప్రిల్‌లో అమేజ్ (Amaze), సిటీ (Honda City) కార్లపై భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన మోడల్ కారును అత్యంత సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు.

Read Also : Honda City 2023 Big Discounts : కొత్త కారు కొంటున్నారా? హోండా సిటీ 2023 కార్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?

హోండా సిటీ 2023పై రూ. 15వేలు తగ్గింపు :
ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన హోండా సిటీ 2023 (Honda City 2023) ఏప్రిల్‌లో రూ. 15వేల వరకు తగ్గింపును అందిస్తోంది. హోండా కొనుగోలుదారులు రూ. 4వేలు, కస్టమర్ లాయల్టీ బోనస్, రూ. 6వేలు, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5వేలు కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. హోండా సిటీ 2023 ధర రూ. 11.49 లక్షల నుంచి రూ. 20.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) అందిస్తోంది. మిడ్-సైజ్ సెడాన్‌లో పెట్రోల్ ఇంజన్ అలాగే హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఉంది.

Honda City 2023 Offers _ Honda City 2023, Amaze have hefty discounts in April, details are here

Honda City 2023 Offers Photo Credit (Honda Cars India)

1.5-లీటర్ VTEC DOHC పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 121PS శక్తిని, 145Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ MT లేదా 7-స్పీడ్ CVTతో అందిస్తోంది. హైబ్రిడ్ సిస్టమ్ 1.5-లీటర్ అట్కిన్సన్-సైకిల్ DOHC i-VTEC పెట్రోల్ ఇంజన్‌తో లిథియం-అయాన్ బ్యాటరీతో ఇంటిగ్రేట్ చేసిన రెండు-మోటార్ e-CVT యూనిట్‌ను కలిగి ఉంది. 126PS గరిష్ట శక్తిని, 253Nm గరిష్ట మోటార్ టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది.

హోండా అమేజ్‌పై రూ. 15వేలు తగ్గింపు :
భారత మార్కెట్లో ఇటీవలే హోండా అమేజ్ కారు మోడల్ దశాబ్దం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ కారుపై రూ. 17వేల వరకు తగ్గింపు అందిస్తోంది. ఇందులో రూ. 10వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ. 12,296 విలువైన FOC అప్లియన్సెస్ కూడా పొందవచ్చు. రూ. 4వేల వరకు కస్టమర్ లాయల్టీ బోనస్, రూ. 3వేలు కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు.

హోండా అమేజ్ ధర రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.60 లక్షల (ఎక్స్-షోరూమ్)లో ఉంది. 1.2-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. గరిష్టంగా 90PS పవర్, 110Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులోని ఇంజిన్‌ను 5-స్పీడ్ MT లేదా CVTతో యాడ్ చేయొచ్చు.

Read Also : WhatsApp Redesign : వాట్సాప్ కొత్త డిజైన్ వచ్చేస్తోంది.. UI పూర్తిగా మార్చేస్తోంది.. మరెన్నో ఫీచర్లు..!