Honda City 2023 Big Discounts : కొత్త కారు కొంటున్నారా? హోండా సిటీ 2023 కార్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?

Honda City 2023 Big Discounts : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా మోటార్స్ ఇండియా హోండా సిటీ 2023ని భారత మార్కెట్లోకి మార్చి 2న లాంచ్ చేసింది. అయితే, హోండా కొన్ని సరికొత్త ఫీచర్లతో సిటీని అప్‌డేట్ చేసింది.

Honda City 2023 Big Discounts : కొత్త కారు కొంటున్నారా? హోండా సిటీ 2023 కార్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?

Honda City 2023 Big Discounts _ Honda City 2023 already has big discounts, offers

Honda City 2023 Big Discounts : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా మోటార్స్ ఇండియా (Honda Motors India) హోండా సిటీ 2023ని భారత మార్కెట్లోకి మార్చి 2న లాంచ్ చేసింది. అయితే, హోండా కొన్ని సరికొత్త ఫీచర్లతో సిటీని అప్‌డేట్ చేసింది. మిడ్-సైజ్ సెడాన్‌కు సంబంధించిన డిస్కౌంట్లు, ఆఫర్‌లను అందిస్తోంది. ఇందులో మీకు నచ్చిన హోండా సిటీ మోడల్ కార్లను సొంతం చేసుకోవచ్చు.

హోండా సిటీ 2023 డిస్కౌంట్లు & ఆఫర్‌లు :
హోండా సిటీ మార్చిలో రూ. 17వేల వరకు మొత్తం బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ కారును కేవలం ఒక వారం ముందు మాత్రమే మార్కెట్లోకి లాంచ్ చేసింది. అయితే, సిటీ సేల్స్ మాత్రం అమాంతం పెరిగిపోయాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు హోండా మోటార్స్ ఇండియా అనేక బెనిఫిట్స్ అఫర్ చేస్తోంది.

రూ. 5వేలు కస్టమర్ లాయల్టీ బోనస్, రూ. 5వేలు కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 7,000 హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ చేస్తోంది. ఇకపోతే హోండా అందించే సరికొత్త డిస్కౌంట్‌లు, ఆఫర్‌లు సిటీ పెట్రోల్‌పై మాత్రమే వర్తిస్తాయని గమనించాలి. సిటీ హైబ్రిడ్‌పై ఎలాంటి డిస్కౌంట్లు అందుబాటులో లేవు.

Read Also : Zen Mobility Cargo EV : జెన్ మొబిలిటీ నుంచి ఫస్ట్ కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ వచ్చేస్తోంది.. తక్కువ వ్యవధిలో ఎక్కువ దూరం వెళ్లొచ్చు!

హోండా సిటీ 2023 వేరియంట్లు ఇవే :
సిటీ 2023 పెట్రోల్ SV, V, VX, ZX నాలుగు వేరియంట్లలో వస్తుంది.

Honda City 2023 Big Discounts _ Honda City 2023 already has big discounts, offers

Honda City 2023 Big Discounts _ Honda City 2023

హోండా సిటీ 2023 ధరలివే :
వేరియంట్ వారీగా హోండా సిటీ 2023 ధరలు ఈ కింద విధంగా ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ).

* సిటీ పెట్రోల్ MT SV – రూ. 11.49 లక్షలు
* సిటీ పెట్రోల్ MT V – రూ. 12.37 లక్షలు
* సిటీ పెట్రోల్ CVT V – రూ. 13.62 లక్షలు
* సిటీ పెట్రోల్ MT VX – రూ. 13.49 లక్షలు
* సిటీ పెట్రోల్ CVT VX – రూ. 14.74 లక్షలు
* సిటీ పెట్రోల్ MT ZX – రూ. 14.72 లక్షలు
* సిటీ పెట్రోల్ CVT ZX – రూ. 15.97 లక్షలు

హోండా సిటీ 2023 పవర్‌ట్రెయిన్‌లు :
సిటీ 2023 1.5-లీటర్ VTEC DOHC పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. 121PS గరిష్ట శక్తిని, 145Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ MT, 7-స్పీడ్ CVT ఉన్నాయి. ఆఫర్‌లో డీజిల్ ఇంజన్ లేదు.

హోండా సిటీ మైలేజ్ పెట్రోల్ ఎంతంటే? :
మాన్యువల్‌గా 17.8kmpl మైలేజ్ అయితే, పెట్రోల్ CVT మోడల్ 18.4kmpl వరకు మైలేజ్ అందిస్తుంది.

Read Also : HDFC Customers Data Leak : డార్క్ వెబ్‌లో 6లక్షల మంది బ్యాంకు కస్టమర్ల డేటా లీక్.. ఇందులో నిజమెంత? బ్యాంకు ఏం చెబుతుందంటే?