Zen Mobility Cargo EV : జెన్ మొబిలిటీ నుంచి ఫస్ట్ కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ వచ్చేస్తోంది.. తక్కువ వ్యవధిలో ఎక్కువ దూరం వెళ్లొచ్చు!

Zen Mobility Cargo EV : ఎలక్ట్రిక్ వెహికల్ (EV) స్టార్టప్ జెన్ మొబిలిటీ (en Mobility) తొలి కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, జెన్ మైక్రో పాడ్‌ను (FY24) మొదటి త్రైమాసికంలో లాంచ్ చేయనుంది. ఈ మేరకు కంపెనీ CEO నమిత్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.

Zen Mobility Cargo EV : జెన్ మొబిలిటీ నుంచి ఫస్ట్ కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ వచ్చేస్తోంది.. తక్కువ వ్యవధిలో ఎక్కువ దూరం వెళ్లొచ్చు!

Zen Mobility to launch maiden cargo electric three-wheeler in Q1 FY24

Zen Mobility Cargo EV : ఎలక్ట్రిక్ వెహికల్ (EV) స్టార్టప్ జెన్ మొబిలిటీ (en Mobility) తొలి కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, జెన్ మైక్రో పాడ్‌ను (FY24) మొదటి త్రైమాసికంలో లాంచ్ చేయనుంది. ఈ మేరకు కంపెనీ వ్యవస్థాపకుడు, CEO నమిత్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. జర్మనీలో రూపొందించిన మైక్రో పాడ్‌ను భారత్‌లో స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించి రూపొందించారు. కార్బన్ ఫైబర్, గ్లాస్ ఫైబర్ కలయికతో తయారు చేసిన కాంపోజిట్ వీల్ ప్రత్యేకమైన తేలికైన నిర్మాణంతో ఎలక్ట్రిక్ మోడల్ అంశమని కంపెనీ పేర్కొంది. మైక్రో పాడ్ లాస్ట్-మైల్ డెలివరీ సర్వీసుల కోసం ప్రత్యేకంగా డెవలప్ చేసింది. ప్రత్యేక స్టోరేజీ బాక్సులో వివిధ షేప్‌లు, సైజులతో కంపార్ట్‌మెంట్‌లుగా రూపొందించింది.

అంతేకాదు.. ఈవీలో ఏదైనా వస్తువులను వేలాదీసేందుకు అడ్జెస్ట్ చేసుకోవచ్చు. టెంపరేచర్-సెన్సిటివ్ ఆహార ప్రొడక్టుల డెలివరీ కోసం కూడా ఇన్సులేట్ అవుతుంది. ఈవీ జెన్ పేటెంట్ పొందిన EV డ్రైవ్‌ట్రెయిన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇందులో 2kW పవర్, 24Nm టార్క్ ఉన్న మోటార్ ఉంటుంది. మాడ్యులర్ బ్యాటరీ ప్యాక్‌తో, మైక్రో పాడ్ రియల్ పరిధి 120కిమీ కన్నా ఎక్కువగా ఉంటుంది. FY24 మొదటి త్రైమాసికంలో భారత్ ఫస్ట్ కార్గో లైట్ ఎలక్ట్రిక్ వెహికల్, జెన్ మైక్రో పాడ్, ARAI సర్టిఫికేట్ ఆఫ్ కన్ఫార్మిటీని అందుకున్నామని జైన్ చెప్పారు. అన్ని ప్రధాన ఇ-కామర్స్ కంపెనీలు, లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్లు, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు మైక్రో పాడ్‌కు లైవ్ కస్టమర్‌లుగా ఉంటాయని ఆయన చెప్పారు.

Zen Mobility to launch maiden cargo electric three-wheeler in Q1 FY24

Zen Mobility Cargo EV : Zen Mobility to launch maiden cargo electric three-wheeler

Read Also :  Maruti Discount Offers : ఈ మార్చిలో మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు.. మీకు నచ్చిన కారును ఇప్పుడే బుక్ చేసుకోండి!

జెన్ మానేసర్ సదుపాయంలో మైక్రో పాడ్ పైలట్ ప్రొడక్టును ప్రారంభించింది. కస్టమర్లతో ట్రయల్స్ కోసం ప్రారంభ యూనిట్లు ప్రారంభించనుంది. కంపెనీ 10వేల యూనిట్లకు పైగా వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో పెద్ద తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. వచ్చే 6 నెలల్లో కొత్త వెహికల్ తయారీ పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. లాస్ట్-మైల్ డెలివరీ మార్కెట్‌లో దాదాపు 70శాతం ఈ-కామర్స్, FMCG కలిగి ఉన్నాయని జైన్ చెప్పారు. ఇందులో 8 గంటల కన్నా తక్కువ రౌండ్ ట్రిప్‌తో 50-60 కి.మీ లోపల వస్తువులను తరలించవచ్చు.

జెన్ మైక్రో పాడ్ ధరకు సంబంధించి పరిధి, లోడ్ సామర్థ్యం, స్టోరేజీ కంపార్ట్‌మెంట్ వంటి మల్టీ అంశాలపై ఆధారపడి ఉంటుందని జైన్ చెప్పారు. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ధరలను ప్రకటిస్తామని జైన్ తెలిపారు. వస్తువుల రవాణా, ప్రయాణీకుల రాకపోకలను అందించడానికి కంపెనీ మల్టీ-బెనిఫిట్ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్, జెన్ మ్యాక్సీ పాడ్‌ను కూడా డెవలప్ చేస్తోంది. FY24 నాల్గవ త్రైమాసికం నాటికి తుది ఉత్పత్తి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. Maxi Pod అనేది గ్రౌండ్-అప్ డిజైన్ చేసిన స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. ప్రస్తుతం, Maxi Pod ఫుల్ ఫంక్షనల్ ప్రోటోటైప్‌పై పని చేస్తున్నామని, రాబోయే కొద్ది నెలల్లో క్లయింట్‌లతో ప్రొటోటైప్ ట్రయల్స్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జైన్ పేర్కొన్నారు.

Read Also : Maruti Suzuki Car Discounts : మార్చిలో మారుతి సుజుకి మోడళ్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ మోడల్ కారు ధర ఎంతంటే?