Maruti Discount Offers : ఈ మార్చిలో మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు.. మీకు నచ్చిన కారును ఇప్పుడే బుక్ చేసుకోండి!
Maruti Discount Offers : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. 2023 మార్చిలో దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ, మారుతి సుజుకి ఇండియా కార్ల మోడళ్లపై అనేక డిస్కౌంట్, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Baleno, Ignis, Ciaz, XL6, Grand Vitara_ Maruti discounts, offers in March 2023
Maruti Discount Offers : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. 2023 మార్చిలో దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ, మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) కార్ల మోడళ్లపై అనేక డిస్కౌంట్, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మార్చి 2023లో ఇగ్నిస్, బాలెనో, సియాజ్, XL6, గ్రాండ్ విటారాపై రూ. 52వేల వరకు డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది. ఈ మోడళ్లన్నీ కంపెనీ Nexa రిటైల్ ద్వారా విక్రయించనుంది. కార్‌మేకర్ అత్యంత సరసమైన నెక్సా మోడల్ మారుతి సుజుకి ఇగ్నిస్ అనేక అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తోంది. అలాగే, మాన్యువల్ వేరియంట్‌లపై రూ. 23వేల తగ్గింపు అందిస్తోంది.
రూ. 10వేల వరకు హోలీ బుకింగ్ బొనాంజా, రూ. 15వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4వేల కార్పొరేట్ ఆఫర్, మొత్తం రూ. 52వేల వరకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఆటోమేటిక్ (AGS) వేరియంట్‌లపై రూ. 13వేల తగ్గింపు, రూ. 10వేల హోలీ బుకింగ్ బొనాంజా, రూ. 15వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4వేల కార్పొరేట్ ఆఫర్, మొత్తం రూ. 42వేలు వరకు అందిస్తోంది. మారుతి సుజుకి బాలెనో, ఫిబ్రవరిలో 18,592 యూనిట్లతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ప్రస్తుతం మాన్యువల్, ఆటోమేటిక్ లేదా CNG వేరియంట్‌లకు ఎలాంటి డిస్కౌంట్లు, ఆఫర్‌లు అందుబాటులో లేవు.

Baleno, Ignis, Ciaz, XL6, Grand Vitara_ Maruti discounts, offers in March 2023
మారుతి సుజుకి సియాజ్‌పై కొనుగోలుదారులు రూ. 28వేల వరకు మొత్తం ఆఫర్‌లను పొందవచ్చు. ఈ కారు మోడళ్లపై ఎలాంటి అడ్వాన్స్ డిస్కౌంట్ అందుబాటులో లేదు. రూ. 25వేల ఎక్స్చేంజ్ బోనస్, రూ. 3వేల కార్పొరేట్ ఆఫర్ ఉంది. మారుతి సుజుకి XL6, కార్‌మేకర్ ప్రీమియం MPV ఆఫర్‌కి ప్రస్తుతం డిస్కౌంట్‌లు లేదా ఆఫర్‌లు అందుబాటులో లేవు.
రీసెంట్‌గా లాంచ్ అయిన గ్రాండ్ విటారా విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. SUV కారు మోడళ్లకు కూడా ఎలాంటి డిస్కౌంట్లు, ఆఫర్‌లు లేవు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Grand Vitara) ఫిబ్రవరిలో కియా సెల్టోస్ (Kia Seltos)ను 9,183 యూనిట్ల అమ్మకాలను పొందింది. ఆ తర్వాతి కాలంలో 8,012 యూనిట్ల అమ్మకాలను సాధించింది.