Maruti Suzuki Ignis Price : మారుతి సుజుకి ఇగ్నిస్ కారు ధర పెరిగింది.. అదనపు సేఫ్టీ ఫీచర్లు కూడా.. కొత్త ధర ఎంతో తెలుసా?

Maruti Suzuki Ignis Price : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా ఇగ్నిస్ మోడల్ ధరలను అమాంతం పెంచేసింది. మారుతి సుజుకి ఇగ్నిస్ కారు మోడల్ ధరను ఒక్కసారిగా రూ. 27వేల వరకు పెంచింది.

Maruti Suzuki Ignis Price : మారుతి సుజుకి ఇగ్నిస్ కారు ధర పెరిగింది.. అదనపు సేఫ్టీ ఫీచర్లు కూడా.. కొత్త ధర ఎంతో తెలుసా?

Maruti Suzuki Ignis prices hiked by up to Rs 27K, gets additional safety features

Maruti Suzuki Ignis Price : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) ఇగ్నిస్ మోడల్ ధరలను అమాంతం పెంచేసింది. మారుతి సుజుకి ఇగ్నిస్ కారు మోడల్ ధరను ఒక్కసారిగా రూ. 27వేల వరకు పెంచింది. దాంతో ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్ ధర ఇప్పుడు రూ. 5.82 లక్షల నుంచి రూ. 8.14 లక్షల (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) మధ్య ఉంది.

మారుతి సుజుకి ఇగ్నిస్‌ను ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్ (HHA)ని అన్ని వేరియంట్‌లలో అమర్చారు. ఇగ్నిస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. 83PS గరిష్ట శక్తిని, 113Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్‌ను 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMTతో పెయిర్ చేయవచ్చు. ఇగ్నిస్ మైలేజ్ లీటరుకు 20.89 కిలోమీటర్లుగా పేర్కొంది.

Maruti Suzuki Ignis prices hiked by up to Rs 27K, gets additional safety features

Maruti Suzuki Ignis prices hiked by up to Rs 27K, gets additional safety features

Read Also : Maruti Suzuki Car: మారుతీ XL6 కొత్త వెర్షన్ రిలీజ్.. ఎర్టిగా మాదిరి రీఫ్రెష్డ్ ఫీచర్లు

రాబోయే రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE), E20 ఇంధన నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్ ఉంటుంది. వేరియంట్‌ల విషయానికొస్తే.. హ్యాచ్‌బ్యాక్‌లో సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా నాలుగు ఉన్నాయి. వేరియంట్‌ల వారీగా మారుతి సుజుకి ఇగ్నిస్ (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

* ఇగ్నిస్ సిగ్మా MT – రూ. 5.82 లక్షలు
* ఇగ్నిస్ డెల్టా MT – రూ. 6.36 లక్షలు
* ఇగ్నిస్ డెల్టా AMT – రూ. 6.91 లక్షలు
* ఇగ్నిస్ జీటా MT – రూ. 6.94 లక్షలు
* ఇగ్నిస్ జెటా AMT – రూ. 7.49 లక్షలు
* ఇగ్నిస్ ఆల్ఫా MT – రూ. 7.59 లక్షలు
* ఇగ్నిస్ ఆల్ఫా AMT – రూ. 8.14 లక్షలు

Read Also : #Twitter Down : ట్విట్టర్‌కు ఏమైంది.. మళ్లీ నిలిచిపోయిన సర్వీసులు.. మస్క్‌పై మండిపడుతున్న యూజర్లు.. ఉద్యోగుల తొలగింపు కారణమా?