Maruti Suzuki Car: మారుతీ XL6 కొత్త వెర్షన్ రిలీజ్.. ఎర్టిగా మాదిరి రీఫ్రెష్డ్ ఫీచర్లు

మారుతీ సుజుకీ ఇప్పుడు తన మరో మోడల్ కారును రీఫ్రెష్డ్ ఫీచర్లతో అప్డేట్ చేసి విడుదల చేసింది. ఈమధ్యనే కొత్త అప్‌డెటెడ్ 2022 మోడల్ ఎర్టిగా ఎమ్‌పివిని (Ertiga MPV) మార్కెట్లో విడుదల..

Maruti Suzuki Car: మారుతీ XL6 కొత్త వెర్షన్ రిలీజ్.. ఎర్టిగా మాదిరి రీఫ్రెష్డ్ ఫీచర్లు

Maruti Suzuki Car

Updated On : April 22, 2022 / 7:16 AM IST

Maruti Suzuki Car: మారుతీ సుజుకీ ఇప్పుడు తన మరో మోడల్ కారును రీఫ్రెష్డ్ ఫీచర్లతో అప్డేట్ చేసి విడుదల చేసింది. ఈమధ్యనే కొత్త అప్‌డెటెడ్ 2022 మోడల్ ఎర్టిగా ఎమ్‌పివిని (Ertiga MPV) మార్కెట్లో విడుదల చేసిన మారుతి సుజుకి.. ఇప్పుడు తమ ఎక్స్ఎల్6 (XL6) ప్రీమియం ఎమ్‌పివిని అప్‌డేట్ చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ ఇందుకు సంబంధించి ఓ టీజర్ వీడియోని కూడా విడుదల చేసి కస్టమర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది.

Maruti Suzuki Cars : ఈ రోజు నుంచే మారుతి సుజుకీ కార్లు మరింత ప్రియం.. ఎందుకో తెలుసా?

మారుతి సుజుకి విడుదల చేసిన తాజా 15-సెకన్ల టీజర్ వీడియోలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ కొత్త ఎక్స్ఎల్6 బ్రాండ్ ప్రమోటర్ గా కనిపించాడు. ఈ టీజర్‌ను బట్టి చూస్తుంటే, కొత్త ఎర్టిగా మాదిరిగానే ఈ కొత్త ఎక్స్ఎల్6 లో కూడా చిన్నపాటి డిజైన్ మార్పులే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్ వీడియోలో కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (2022 Maruti Suzuki XL6) సరికొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Maruti Suzuki : న్యూ ఏజ్ బాలెనో కారు.. లుక్ అదిరిందిగా.. టెక్ ఫీచర్లు కిరాక్..!

చిన్నపాటి కాస్మెటిక్ ట్వీక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ప్యాడిల్ షిఫ్టర్‌ వంటి అప్‌డేటెడ్ ఫీచర్లతో రిఫ్రెష్‌ మోడల్స్ వచ్చేసింది. XL6 వేరియంట్ 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కొత్త ఎంఐడీ కలిగి ఉంది. ఎర్టిగాను కూడా ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడిన కొత్త 6-స్పీడ్ AT, 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అప్‌డేటెడ్ చేయగా.. ఇప్పుడు XL6ను కూడా అలాగే అప్డేట్ చేసింది. ఈ నెలాఖరు నాటికి కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లో రాబోతుంది.