HDFC Customers Data Leak : డార్క్ వెబ్‌లో 6లక్షల మంది బ్యాంకు కస్టమర్ల డేటా లీక్.. ఇందులో నిజమెంత? బ్యాంకు ఏం చెబుతుందంటే?

HDFC Customers Data Leak : భారత్‌లో సైబర్ చీటింగ్ కేసులు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ లేదా SMS ద్వారా స్కామర్లు డబ్బును దొంగిలిస్తున్నారు. కొత్త నివేదిక ప్రకారం.. డార్క్ వెబ్‌ (Dark Web)లో 6 లక్షల మంది HDFC కస్టమర్ల డేటా లీక్ అయినట్లు వెల్లడించింది

HDFC Customers Data Leak : డార్క్ వెబ్‌లో 6లక్షల మంది బ్యాంకు కస్టమర్ల డేటా లీక్.. ఇందులో నిజమెంత? బ్యాంకు ఏం చెబుతుందంటే?

Data of 6 lakh HDFC Bank customers leaked on dark web_ Here is what the bank say

HDFC Customers Data Leak : భారత్‌లో సైబర్ చీటింగ్ కేసులు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ లేదా SMS ద్వారా స్కామర్లు డబ్బును దొంగిలిస్తున్నారు. కొత్త నివేదిక ప్రకారం.. డార్క్ వెబ్‌ (Dark Web)లో 6 లక్షల మంది HDFC కస్టమర్ల డేటా లీక్ అయినట్లు వెల్లడించింది. ప్రైవసీ వ్యవహారాల నివేదిక ప్రకారం.. 6 లక్షల మంది యూజర్ల పర్సనల్ డేటాను ‘పాపులర్ సైబర్‌క్రిమినల్ ఫోరమ్’లో హ్యాకర్లు పోస్ట్ చేశారని తెలిపింది. లీక్ డేటాలో యూజర్ల పేర్లు, ఈ-మెయిల్ అడ్రస్, ఫిజికల్ అడ్రస్, ఇతర సున్నితమైన ఆర్థిక డేటా కూడా ఉన్నాయని నివేదిక పేర్కొంది. హ్యాకర్లు బ్యాంక్‌ ఫేస్ ట్విటర్ అకౌంట్లను క్రియేట్ చేశారని తెలిపింది. యూజర్ల ఫేక్ అకౌంట్లకు సంబంధించి ఫిర్యాదులపై HDFC బ్యాంక్ నివేదికపై స్పందించింది. డేటా ఉల్లంఘన అయిందనే వార్తలను ఖండించింది.

డేటా లీక్‌పై HDFC బ్యాంక్ స్పందన ఇదే :
HDFC బ్యాంక్ ట్విట్టర్‌లో డేటా లీక్ నివేదికలపై స్పందించింది. అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇలా ట్వీట్ చేసింది. ‘హాయ్, HDFC బ్యాంక్‌లో డేటా లీక్ లేదని, మా సిస్టమ్‌లు ఎలాంటి అనధికార పద్ధతిలో ఉల్లంఘనకు గురికాలేదని, హ్యాకర్లు ఎవరూ డేటాను యాక్సెస్ చేయలేదని తెలియజేస్తున్నాం. మా సిస్టమ్‌లపై మాకు నమ్మకం ఉంది. మా కస్టమర్ల డేటా భద్రతకు సంబంధించిన విషయం చాలా కాన్ఫిడెన్షియల్‌గా ఉంది. డేటా సెక్యూరిటీతో పాటు భద్రత అత్యున్నత ప్రమాణాలను నిర్ధారించడానికి బ్యాంక్ సిస్టమ్‌లను, మా పర్యావరణ వ్యవస్థలను మానిటరింగ్ చేస్తూనే ఉంటాం’ అని ట్వీట్‌లో వివరణ ఇచ్చింది.

Data of 6 lakh HDFC Bank customers leaked on dark web_ Here is what the bank say

HDFC Customers Data Leak : Data of 6 lakh HDFC Bank customers leaked on dark web

Read Also : Maruti Suzuki Car Discounts : మార్చిలో మారుతి సుజుకి మోడళ్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ మోడల్ కారు ధర ఎంతంటే?

HDFC బ్యాంక్ స్కామ్ :
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పేరుతో ఫిషింగ్ స్కామ్‌కు సంబంధించి పలువురు యూజర్లు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ ఈ ఫిర్యాదులకు ట్విట్టర్‌లో కూడా ప్రతిస్పందించింది. పాన్ కార్డ్ / KYC అప్‌డేట్ లేదా ఏదైనా ఇతర బ్యాంకింగ్ డేటా కోసం అడిగే గుర్తుతెలియని నంబర్‌లకు ప్రతిస్పందించవద్దని యూజర్లను కోరింది. బ్యాంక్ ఎప్పటికీ పాన్ వివరాలు, OTP, UPI VPA / MPIN, Customer ID & పాస్‌వర్డ్, కార్డ్ నంబర్, ATM PIN & CVV కోసం అడగదని గమనించాలి. దయచేసి మీ సీక్రెట్ వివరాలను ఎవరితోనూ షేర్ చేయొద్దని HDFC బ్యాంక్ సర్వీస్ మేనేజర్ ట్వీట్ ద్వారా తెలిపారు.

ఫిషింగ్ స్కామ్‌ల నుంచి సేఫ్‌గా ఉండండి :
ఫోన్, వర్కింగ్ సిమ్ కార్డ్ ఉన్న ఎవరైనా ఫిషింగ్ కాల్ లేదా SMSని అందుకోవచ్చు. చాలా సందర్భాలలో, స్కామర్‌లు బ్యాంకులుగా చెప్పుకుంటూ ఫేక్ మెసేజ్‌లను పంపుతారు. అకౌంట్ వివరాలు, OTPలు, ఐడెంటిటీ నెంబర్ల వంటి వారి పర్సనల్ డేటా కోసం యూజర్లను అడుగుతారు. మీరూ కూడా అలాంటి కాల్స్, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాటికి ప్రతిస్పందించకూడదు. అలాంటి నంబర్‌లను వెంటనే బ్లాక్ చేయండి. తద్వారా మీకు మళ్లీ మెసేజ్ పంపలేరు. మీ UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ ఫోన్ కోసం కూడా స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను పెట్టుకోండి. మీ అకౌంట్ సెక్యూరిటీ కోసం పాస్‌వర్డ్‌లను తరచూ మార్చవచ్చు. మీ లావాదేవీలకు అడ్వాన్సడ్ సెక్యూరిటీని యాడ్ చేయొచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ కోసం టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ తప్పనిసరిగా ఎనేబల్ చేసుకోండి.

Read Also : Zen Mobility Cargo EV : జెన్ మొబిలిటీ నుంచి ఫస్ట్ కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ వచ్చేస్తోంది.. తక్కువ వ్యవధిలో ఎక్కువ దూరం వెళ్లొచ్చు!