Aaryan Review : ‘ఆర్యన్’ మూవీ రివ్యూ.. చనిపోయిన వ్యక్తి హత్యలు ఎలా చేస్తాడు? థ్రిల్లర్ సినిమా భలే ఉందే..

ఇందులో చనిపోయిన వ్యక్తి హత్యలు చేస్తుండటం కొత్తగా ఉంటుంది. (Aaryan Review)

Aaryan Review : ‘ఆర్యన్’ మూవీ రివ్యూ.. చనిపోయిన వ్యక్తి హత్యలు ఎలా చేస్తాడు? థ్రిల్లర్ సినిమా భలే ఉందే..

Aaryan Review

Updated On : November 7, 2025 / 2:32 PM IST

Aaryan Review : విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా ‘ఆర్యన్’. విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ నిర్మాణంలో ప్రవీణ్ కె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శ్రద్ద శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్ గా నటించారు. తమిళ్ లో అక్టోబర్ 31న విడుదల అయి మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నేడు నవంబర్ 7న తెలుగులో రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే.. ఆత్రేయ(సెల్వ రాఘవన్) అనే వ్యక్తి ఓ పాపులర్ న్యూస్ ఛానల్ లో జరిగే నయన(శ్రద్ద శ్రీనాథ్) ప్రోగ్రాంకి ఆడియన్ లా వచ్చి అందులో వచ్చిన గెస్ట్ ని కాల్చి నేను ఒక ఫెయిల్యూర్ రైటర్ ని, నన్ను ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఓ థ్రిల్లింగ్ కథ చెప్తాను. అందులో అయిదు హత్యలు ఉంటాయి కానీ చనిపోయిన వ్యక్తే హత్యలు చేస్తాడు. చెప్పేముందు ఎవర్ని చంపుతున్నారో చెప్పి మరీ చేస్తాడు అని అందర్నీ భయపెట్టి తను ఆత్మహత్య చేస్తుకుంటాడు. దీంతో ఈ వార్త వైరల్ అవుతుంది.

ఈ కేసు పోలీసాఫీసర్ నంది(విష్ణు విశాల్)చేతికి వస్తుంది. చెప్పినట్టే ఆత్రేయ చనిపోయినా నెక్స్ట్ చంపే వాళ్ళ పేర్లను ప్రకటించి చంపుతూ ఉంటాడు. దీంతో అసలు వాళ్ళు ఎలా చనిపోతున్నారు? చనిపోయే వాళ్లకు ఉన్న లింక్ ఏంటి? అసలు చనిపోయిన వ్యక్తి ఎలా చంపుతాడు? నంది ఈ కేసుని సాల్వ్ చేశాడా? ఆత్రేయ రాసిన బుక్స్ ఏంటి? ఆర్యన్ అంటే ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : The Girlfriend Review : ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ.. రష్మిక నిజంగానే నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేసిందా?

సినిమా విశ్లేషణ..

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ రెగ్యులర్ గా చాలా వస్తున్నాయి. విలన్ ని పోలీసులు ఎలా ఛేజ్ చేసి పట్టుకుంటారు అనేది రొటీన్ అయిపొయింది. కానీ ఇందులో చనిపోయిన వ్యక్తి హత్యలు చేస్తుండటం కొత్తగా ఉంటుంది. ఇది ఎలా జరుగుతుంది అని పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా ఇంట్రెస్ట్ గా సాగుతుంది. ఆత్రేయ ఆత్మహత్య కాకుండా అయిదు హత్యలు అని చెప్తాడు. పోలీసులు ఒక్కటైనా ఆపుతారా? అసలు వాళ్ళను ఎందుకు చంపుతున్నాడు అనే క్యూరియాసిటీ చివరి వరకు నడిపించారు. చనిపోయిన వ్యక్తి వేరే వాళ్ళను ఎలా చంపాడు అని కూడా కొత్తగా చూపించారు.

అయితే వాళ్ళను ఎందుకు చంపాడు అనే కారణం కొత్తగా ఉన్నా ఈ కారణంతో కూడా చంపుతారా అని చివరకు అనిపిస్తుంది. కథ సీరియస్ గా సాగుతున్న సమయంలో నంది – అతని భార్య అనిత విడాకుల కేసు, వాళ్ళ సీన్స్ మధ్య మధ్యలో వస్తుంటాయి. ఇవి కథకు సంబంధం లేదు, ఈ సీన్స్ లేకపోయినా కథ డిస్టర్బ్ అవ్వదు కానీ ఎందుకు పెట్టాడో దర్శకుడికే తెలియాలి. కొన్ని కొన్ని సీన్స్ స్లో నేరేషన్ తో సాగుతాయి. క్లైమాక్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. AARYAN అంటే ఏంటి? బుక్ కి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా పరంగా ఒక మంచి థ్రిల్లర్ సినిమా చేసినా హత్యల వెనక చూపించిన కారణం మాత్రం కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. ఒక సరికొత్త థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటే ఈ ఆర్యన్ చూడొచ్చు.

aaryan Review

నటీనటుల పర్ఫార్మెన్స్..

విష్ణు విశాల్ సిన్సియర్ పోలీస్ ఆఫీస్ పాత్రలో ఫిట్ గా కనిపిస్తూ తన నటనతో కూడా మెప్పించాడు. శ్రద్ద శ్రీనాథ్ టీవీ యాంకర్ పాత్రలో బాగానే నటించింది. మానస చౌదరి పాత్ర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. తనకు ఇచ్చిన సీన్స్ వరకు పర్వాలేదనిపించింది. సెల్వ రాఘవన్ మాత్రం సింపుల్ గా కనిపిస్తూనే ఎప్పట్లాగే తన నటనతో అదరగొట్టాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : The Great Pre Wedding Show : ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ రివ్యూ.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లర్ సినిమాకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఇచ్చారు. ఉన్న రెండు సాంగ్స్ మాత్రం అంతంత మాత్రమే. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా కట్ చేసారు. కథ పరంగా మర్డర్ థ్రిల్లర్స్ లో కొత్త కథ తీసుకొని రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ కథనంతో బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘ఆర్యన్’ సినిమా రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సరికొత్త మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.