Hong Kong Sixes 2025 : చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. హ్యాట్రిక్‌తో పాటు..
నేపాల్ పేసర్ రషీద్ ఖాన్ హాంకాంగ్ సిక్సర్ టోర్నీలో (Hong Kong Sixes 2025 ) హ్యాట్రిక్‌తో పాటు అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు.
Hong Kong Sixes 2025 Nepal bowler Rashid Khan takes hat trick against Afghanistan
Hong Kong Sixes 2025 : నేపాల్ పేసర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. హాంకాంగ్ సిక్సర్ టోర్నీలో (Hong Kong Sixes 2025 ) హ్యాట్రిక్‌తో పాటు అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు. శుక్రవారం మోంగ్ కోక్ లోని మిషన్ రోడ్ గ్రౌండ్‌లో అఫ్గానిస్తాన్, నేపాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనత సాధించాడు.
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఈ ఘనత చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను రషీద్ వేశాడు. ఈ ఓవర్‌లో వరుస బంతుల్లో అఫ్గాన్ బ్యాటర్లు సెదిఖుల్లా పచ్చా, షారాఫుద్దీన్ అష్రఫ్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్ జాయ్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. రషీద్ తన కోటా 2 ఓవర్లలో మొత్తం 4 వికెట్లు పడగొట్టి కేవలం 27 పరుగులు ఇచ్చాడు. రషీద్‌కు ముందు ఈ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు శ్రీలంక బౌలర్ కంగనిగే తరిండు పేరిట ఉండేవి. తరిండు రెండు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
Hong Kong Sixes 2025 : పాక్ పై భారత్ విజయం.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో..
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో కరీమ్ జనత్ (35; 10 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), గుల్బదిన్ నైబ్ (22; 10 బంతుల్లో 3 సిక్సర్లు), ఫర్మానుల్లా సఫీ (30 నాటౌట్; 9 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు.
🚨Hat-trick Alert🚨
A Rashid Khan you didn’t see coming 👀
The Nepal pacer pulls off a sensational hat-trick vs Afghanistan in the #HongKongSixes 🎯 pic.twitter.com/X9NcP2dcAT
— FanCode (@FanCode) November 7, 2025
ఆ తరువాత 113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ నిర్ణీత 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 95 పరుగులకే పరిమితమైంది. దీంతో 17 పరుగుల తేడాతో నేపాల్ ఓడిపోయింది. నేపాల్ బ్యాటర్లలో కెప్టెన్ సందీప్ జోరా కేవలం 14 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు.
