Abhishek Nayar : ప్ర‌పంచ‌క‌ప్ విజేత అయినప్ప‌టికి కూడా దీప్తి శ‌ర్మ‌ను అందుక‌నే వ‌దిలివేశాం.. యూపీ కోచ్ అభిషేక్ నాయ‌ర్ కామెంట్స్‌..

ఆల్ రౌండ‌ర్‌ దీప్తి శ‌ర్మ‌ను వ‌దిలివేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై యూపీ వారియర్జ్ జ‌ట్టు హెడ్ కోచ్ అభిషేక్ నాయ‌ర్ (Abhishek Nayar) స్పందించారు.

Abhishek Nayar : ప్ర‌పంచ‌క‌ప్ విజేత అయినప్ప‌టికి కూడా దీప్తి శ‌ర్మ‌ను అందుక‌నే వ‌దిలివేశాం.. యూపీ కోచ్ అభిషేక్ నాయ‌ర్ కామెంట్స్‌..

Why Deepti Sharma wasnt retained by UP Warriorz for WPL 2026

Updated On : November 7, 2025 / 2:25 PM IST

Abhishek Nayar : మహిళల ప్రీమియర్‌ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్ ) వేలం న‌వంబ‌ర్ 27న ఢిల్లీ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఈ మెగావేలానికి ముందు అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆట‌గాళ్లు, విడుద‌ల చేసే ప్లేయ‌ర్ల జాబితాను విడుద‌ల చేశాయి. ఆశ్చ‌ర్య‌క‌రంగా యూపీ వారియర్జ్ ఒకే ఒక ప్లేయ‌ర్‌ను రిటెన్ చేసుకుంది. ముఖ్యంగా ఇటీవ‌ల భార‌త జ‌ట్టు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన స్టార్ ఆల్ రౌండ‌ర్‌ దీప్తి శ‌ర్మ‌ను వ‌దిలివేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దీనిపై యూపీ వారియర్జ్ జ‌ట్టు హెడ్ కోచ్ అభిషేక్ నాయ‌ర్ (Abhishek Nayar) స్పందించారు. తాము స‌రికొత్త‌గా సీజ‌న్‌ను ఆరంభించాల‌ని భావిస్తున్న‌ట్లు జియో హాట్‌స్టార్‌తో మాట్లాడుతూ చెప్పాడు. ఎక్కువ డ‌బ్బుల‌తో వేలంలోకి వెళ్లాల‌ని భావించామ‌ని అందుక‌నే ఒక్క‌రినే అట్టిపెట్టుకున్నామ‌న్నాడు. కొత్త జ‌ట్టును నిర్మించాల‌ని భావిస్తున్నామ‌ని చెప్పాడు. టైటిల్ గెల‌వ‌గ‌ల జ‌ట్టును త‌యారు చేసుకునే క్ర‌మంలో వ‌న‌రులు పొందేందుకు వీలుగా ఎక్కువ ప‌ర్సుతో వెలుతున్నాం. అని నాయ‌ర్ అన్నాడు. తాము విడిచిపెట్టిన ప్లేయ‌ర్ల‌లో కొంద‌రిని వేలంలో సొంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని చెప్పాడు.

Sricharani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. రూ. 2.5 కోట్ల న‌గ‌దు, గ్రూప్‌-1 ఉద్యోగం, ఇంకా..

‘ఫ్రాంచైజీ ఆలోచన కొత్తగా ప్రారంభించడం. బ్యాగ్‌లో ఎక్కువ డబ్బు అందుబాటులో ఉంచుకోవడం. అన్ని విధాలుగా ముందుకు సాగగల జట్టును నిర్మించడం. ఛాంపియన్‌షిప్ గెలవగలరని మేము నమ్ముతున్న ఆటగాళ్లను పొందడానికి మాకు తగినంత వనరులు ఉన్నాయని నిర్ధారించుకోవాలనుకున్నాము. వ‌దిలివేసిన వారిలో వేలంలో కొందరిని తిరిగి పొందాలని ఆశిస్తున్నాము.’ అని నాయర్ అన్నారు.

యూపీ వారియర్జ్ ఒకే ఒక ప్లేయ‌ర్‌ను అట్టిపెట్టుకుంది. భార‌త అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్ శ్వేతా సెహ్రావ‌త్ (రూ.50ల‌క్ష‌లు) అట్టిపెట్టుకుంది. ప్ర‌స్తుతం యూపీ వారియర్జ్ రూ.14.50 కోట్ల ప‌ర్స్ వాల్యూను క‌లిగి ఉంది. ఆ జ‌ట్టుకు నాలుగు ఆర్‌టీఎం (రైట్ టు మ్యాచ్‌) లు ఉన్నాయి.

Kane Williamson : కేన్ మామ ఏంది ఇది.. మొన్న టీ20ల‌కు రిటైర్‌మెంట్‌.. ఇప్పుడేమో ఇలా..

డ‌బ్ల్యూపీఎల్ 2026 వేలానికి ముందు యూపీ వారియర్జ్ వేలానికి విడుద‌ల చేసింది వీరినే..

దీప్తి శర్మ (కెప్టెన్‌), అలనా కింగ్, గౌహెర్ సుల్తానా, సైమా ఠాకోర్, చినెల్లే హెన్రీ, గ్రేస్ హారిస్, అంజలి సర్వాణి, కిరణ్ నవ్‌గిరే, సోఫీ ఎక్లెస్‌స్టోన్, అరుషి గోయెల్, క్రాంతి గౌడ్, తహ్లియా మెక్‌గ్రాత్, చమరి అతపత్తు, పూనమ్ ఖేమ్నార్, ఉమా చెత్రీ, రాజేశ్వరి గయాక్వాడ్, బృందా దినేష్.