Kane Williamson : కేన్ మామ ఏంది ఇది.. మొన్న టీ20లకు రిటైర్‌మెంట్.. ఇప్పుడేమో ఇలా..
14 మంది సభ్యులతో కూడిన బృందంలో సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (Kane Williamson) పేరు లేదు.
After T20I retirement Kane Williamson opts out of ODI squad
Kane Williamson : నవంబర్ 16 నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 14 మంది సభ్యులతో కూడిన బృందంలో సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ పేరు లేదు. ఇటీవలే అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్న ఈ సినీయర్ ఆటగాడి పేరు వన్డే జట్టులో లేకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ లో భాగంగానే కేన్ విలిమయ్సన్ (Kane Williamson) స్వయంగా ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడని కివీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
వన్డేల్లో న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కేన్ మామ కొనసాగుతున్నాడు. ఇక తాజా నిర్ణయంతో అతడు సుదీర్ఘ ఫార్మాట్ పై ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా అర్థమవుతోంది. విండీస్‌తో డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న మూడు టెస్టుల సిరీస్ సమయానికి పూర్తి ఫిట్‌గా ఉండేందుకే వన్డేలకు దూరంగా ఉండాలని విలియమ్సన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
Jasprit Bumrah : చరిత్ర సృష్టించిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఆసీస్ పై టీ20ల్లో ఒకే ఒక్కడు..
మిచెల్ సాంట్నర్ నేతృత్వంలోనే కివీస్ జట్టు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో తలపడనుంది. గాయం కారణంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఇటీవల జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమైన పేసర్ మాట్ హెన్రి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో రాణించిన పేసర్ బ్లెయిర్ టిక్నర్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ఇదే..
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్
వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* మొదటి వన్డే – నవంబర్ 16 (క్రైస్ట్‌చర్చ్)
* రెండో వన్డే – నవంబర్ 19 (నేపియర్)
* మూడో వన్డే – నవంబర్ 22 (హామిల్టన్)
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..! తెలుగు రాష్ట్రాలకు అన్యాయం..?
Our ODI squad for the Chemist Warehouse ODI Series against Windies Cricket 🫡
Full story | https://t.co/hkM4jB7wnA 📲 #NZvWIN pic.twitter.com/hxVskVih3E
— BLACKCAPS (@BLACKCAPS) November 6, 2025
