Hong Kong Sixes 2025 : పాక్ పై భారత్ విజయం.. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో..

హాంకాంగ్ సిక్స‌ర్ 2025 టోర్నీలో (Hong Kong Sixes 2025) భాగంగా శుక్ర‌వారం మోంగ్ కోక్ లోని మిషన్ రోడ్ గ్రౌండ్ లో భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి.

Hong Kong Sixes 2025 : పాక్ పై భారత్ విజయం.. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో..

Hong Kong Sixes 2025 India won by 2 runs DLS Method against Pakistan

Updated On : November 7, 2025 / 3:02 PM IST

Hong Kong Sixes 2025 : హాంకాంగ్ సిక్స‌ర్ 2025 టోర్నీలో భాగంగా శుక్ర‌వారం మోంగ్ కోక్ లోని మిషన్ రోడ్ గ్రౌండ్ లో భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో భార‌త్ డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో 2 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది.

ఈ మ్యాచ్‌లో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 6 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 86 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రాబిన్‌ ఉతప్ప (28; 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), భరత్‌ చిప్లి (24; 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), దినేశ్‌ కార్తిక్‌ (17 నాటౌట్‌; 6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌) మెరుపులు మెరిపించారు.

Abhishek Nayar : ప్ర‌పంచ‌క‌ప్ విజేత అయినప్ప‌టికి కూడా దీప్తి శ‌ర్మ‌ను అందుక‌నే వ‌దిలివేశాం.. యూపీ కోచ్ అభిషేక్ నాయ‌ర్ కామెంట్స్‌..

స్టువర్ట్‌ బిన్ని (4), అభిమ‌న్యు మిథున్ (6) లు విఫ‌లం అయ్యారు. పాక్‌ బౌలర్లలో ముహమ్మద్‌ షెహజాద్ రెండు వికెట్లు తీశాడు. అబ్దుల్‌ సమద్‌ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఆ త‌రువాత 87 ప‌రుగుల ల‌క్ష్యంతో పాక్ బ‌రిలోకి దిగింది. మూడు ఓవ‌ర్లు పూర్తి అయ్యే స‌రికి పాక్ వికెట్ న‌ష్ట‌పోయి 41 ప‌రుగులు చేసింది. ఖ్వాజా నఫే (18 నాటౌట్‌), అబ్దుల్‌ సమద్‌ (16 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. ఈ ద‌శ‌లో మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డం, మ్యాచ్‌ను కొన‌సాగించే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ పద్ద‌తి ప్ర‌కారం 2 ప‌రుగుల తేడాతో భార‌త్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు.