ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు.. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన
ఉప ఎన్నిక వేళ పెద్ద ఎత్తున నగదును నిల్వ చేశారని ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ హైదరాబాద్‌లోని పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్లలో కేంద్ర బలగాలతో కలిసి ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికు చెందిన మోతీనగర్‌లోని ఇంట్లో, ఎమ్మెల్సీ రవీందర్‌రావుకు చెందిన రెహమత్ నగర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు జరిగాయి. ఉప ఎన్నిక వేళ పెద్ద ఎత్తున నగదును నిల్వ చేశారని ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
Also Read: నేటితో “వందేమాతరం” గేయానికి 150 ఏళ్లు పూర్తి.. దేశ వ్యాప్తంగా “వందేమాతరం” ఆలాపన.. ఢిల్లీలో మోదీ..
దీనిపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. 10టీవీతో ఆయన మాట్లాడుతూ.. “బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల పై రైడ్స్ జగుతున్న విషయం నాకు తెలియదు. కక్ష సాధింపు చర్యల ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజాస్వామ్యయుతంగానే ముందుకు వెళుతుంది. రెచ్చగొట్టే విధానం మాది కాదు.
జూబ్లీహిల్స్‌లో గతంలో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇప్పుడు వాళ్ల ప్రచారం ఎలా ఉందనే దానిపైనే మేము మాట్లాడుతున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతనైతే జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్లు దక్కేలా చేసుకోవాలి. మా సీఎం, మేము సెక్యులర్ విధానాన్ని పాటిస్తాం. రెచ్చగొట్టి, మతం ఆధారంగా ఓట్లు అడిగే విధానం మాది కాదు” అని అన్నారు.
