OPPO K13 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? ఒప్పో K13 5Gపై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో చౌకైన ధరకే ఇలా కొనేసుకోండి..

OPPO K13 5G Phone : ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో K13 5G ఫోన్ అదిరిపోయే ఆఫర్.. ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు.. స్పెషల్ ఆఫర్లు కూడా..

OPPO K13 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? ఒప్పో K13 5Gపై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో చౌకైన ధరకే ఇలా కొనేసుకోండి..

OPPO K13 5G Phone

Updated On : November 7, 2025 / 4:12 PM IST

OPPO K13 5G Phone : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 20 వేల బడ్జెట్‌లోపు ధరకే ఒప్పో K13 5జీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్ డిస్కౌంట్ల నుంచి ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ వరకు కొనుగోలుదారులు ఈ ఫోన్‌ గతంలో కన్నా తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు. ఇంతకీ ఒప్పో K13 5జీ ఫోన్ కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్లను ఎలా పొందాలంటే?

ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో K13 5Gపై స్పెషల్ ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌పై (OPPO K13 5G Phone) కూడా బిగ్ డీల్స్ అందిస్తోంది. లాంచ్ అయినప్పటి నుంచి చౌకైన ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 20శాతం తగ్గింపుతో పొందవచ్చు. అసలు ధర రూ. 24,999 ఉండగా 20శాతం తగ్గింపుతో కేవలం రూ. 19,999కి పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్ అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై 5శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

మీకు BOB కార్డ్ ఉంటే.. రూ. 1,250 వరకు 10శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై ట్రేడ్ చేయవచ్చు. దాంతో ఈ ఒప్పో ఫోన్ కొనుగోలుపై రూ. 18,740 వరకు తగ్గింపు పొందవచ్చు.

డిస్‌ప్లే, డిజైన్ :
ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ HD ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఫ్లూయిడ్ స్క్రోలింగ్ గేమింగ్ కోసం 120Hz హై రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. ఈ ఒప్పో ఫోన్ 1200 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశంతో వస్తుంది. సూర్యకాంతిలో స్ర్కీన్ అద్భుతంగా కనిపిస్తుంది. వెట్ టచ్ గ్లో మోడ్‌ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏజీసీ డీటీ స్టార్ 2 గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

Read Also : Samsung Galaxy S23 5G : కిర్రాక్ ఆఫర్ భయ్యా.. ఈ శాంసంగ్ గెలాక్సీ S23 5G ఫోన్‌పై క్రేజీ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. డోంట్ మిస్!

కెమెరా సెటప్ :
మీరు ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్‌ను పరిశీలిస్తే.. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ఏఐ మెయిన్ సెన్సార్ 2MP మోనోక్రోమ్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అయితే, ఫ్రంట్ సైడ్16MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 30fps వద్ద ఫ్రంట్ సైడ్ 1080p వద్ద 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఏఐ రిఫ్లెక్షన్ రిమూవర్, ఏఐ బ్లర్ వంటి ఏఐ ఫీచర్లను కూడా కలిగి ఉంది.

బ్యాటరీ ప్యాక్, ఛార్జింగ్ :

ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ 7000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్రాండ్ 5 ఏళ్ల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. మీరు 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఈ బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేయవచ్చు. సింగిల్ ఛార్జ్‌తో 3 రోజులు ఈజీగా వాడేసుకోవచ్చు.

డిస్‌ప్లే :
ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది. 4nm ప్రాసెస్‌పై రన్ అవుతుంది. 4GB LPDDR4X ర్యామ్ అదనంగా 8GB వర్చువల్ ర్యామ్ కలిగి ఉంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను 128GB లేదా 256GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

ఈ ఒప్పో ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్‌ఓఎస్ 15పై రన్ అవుతుంది. బ్రాండ్ 2 మెయిన్ ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. ఈ ఫోన్ 5700mm² స్టీమ్ రూం ద్వారా భారీ గ్రాఫైట్ షీట్‌ కూడా కలిగి ఉంది. ఎక్కువ గంటలు గేమ్స్ ఆడే వారికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది.