Flipkart Big Saving Days Sale : ఆపిల్ ఐఫోన్ 11 ధర తగ్గిందోచ్.. బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్.. డోంట్ మిస్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ ప్లస్ (+) సభ్యుల కోసం బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రారంభించింది.

Iphone 11 Price Goes Down Under Rs 40,000 In Flipkart Big Saving Days Sale (1)
Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ ప్లస్ (+) సభ్యుల కోసం బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్‌తో పాటు జూలై 23 అర్ధరాత్రి సేల్ ప్రారంభం కానుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా.. ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐఫోన్‌లతో సహా అన్ని బ్రాండ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఐఫోన్ మోడల్‌లపై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న అత్యుత్తమ డీల్‌లలో ఐఫోన్ 11 మోడల్ ఒకటి. ఐఫోన్ 11 యొక్క 64GB బ్లాక్ వేరియంట్ రూ. 2వేల బ్యాంక్ తగ్గింపుతో సహా రూ. 39,999 కన్నా తక్కువ ధరకే లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 11 మోడల్‌ను రూ. 42,999కి లిస్టు చేసింది. అదనంగా, RBL బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్, సిటీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేదా కోటక్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉన్న కస్టమర్‌లు అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. అన్ని ఆఫర్‌లతో iPhone 11 64GB ధరను రూ. 40వేలు లేదా రూ. 39,999కి తగ్గించింది. Flipkart రూ. 17,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. iPhone 11 ధర మరింత తగ్గింది. ఎక్స్ఛేంజ్ విలువ పాత ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్ iPhone 64GB, బ్లాక్ మోడల్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Iphone 11 Price Goes Down Under Rs 40,000 In Flipkart Big Saving Days Sale
iPhone 11 64GB స్టోరేజీ కోసం ఇతర కలర్ ఆప్షన్లలో రూ. 46,999కి లిస్టు అయ్యాయి. iPhone 11 మోడల్ 128GB ధర రూ. 51,999గా లిస్టు అయింది. బ్యాంక్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి, ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ జూలై 23 అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రానుంది.
జూలై 27 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. అదనంగా.. Flipkart iPhone 12పై డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యుల కోసం.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ iPhone 12ని రూ. 51,999 కన్నా తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఐఫోన్ 12 ధర రూ. 52,999 అదనంగా డిస్కౌంట్ ధరను రూ. 51,999కి తగ్గించే బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.