iPhone 13 Flipkart Offer : బ్యాంకు ఆఫర్లతో పనిలేదు.. ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 13 సొంతం చేసుకోండి!

iPhone 13 Flipkart Offer : కొత్త ఆపిల్ ఐఫోన్ 13 కొనేందుకు చూస్తున్నారా? అయితే సరైన సమయం.. బ్యాంకు ఆఫర్ల (Bank Offers)తో పనిలేకుండానే ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ (iPhone 13) కొనుగోలు చేయండి.

iPhone 13 Flipkart Offer : బ్యాంకు ఆఫర్లతో పనిలేదు.. ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 13 సొంతం చేసుకోండి!

iPhone 13 Flipkart Offer

iPhone 13 Flipkart Offer : మీరు iPhone 13 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో అదిరిపోయే ఫోన్‌ డీల్స్ అందిస్తోంది. ఏప్రిల్ 13 నుంచి ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ (Flipkart Summer Sale) అందుబాటులో ఉంది. ఆపిల్ (iPhone 13), (iPhone 14), (Pixel 6a) సహా అనేక ఫోన్‌లపై అదిరే ఆఫర్‌లను అందిస్తోంది. అయితే, ఆపిల్ iPhone 13 డీల్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 ధర రూ. 58,999 వద్ద అందుబాటులో ఉంది. ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు లేకుండానే ఐఫోన్ 13 కొనుగోలు చేయొచ్చు. ఈ ధరను మరింత తగ్గించాలంటే.. మీ బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కలిపి కొనుగోలు చేయొచ్చు.

ఐఫోన్ 13 డీల్ ఎలా ఉందంటే? :
ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13 ధర రూ. 65,999 ఉండగా.. ఇప్పుడు రూ.58,999కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 13పై ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ధర ఏ బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో సంబంధం లేదు. ఈ కొత్త ఫోన్ ధరను మరింత తగ్గించాలనుకుంటే.. మీ పాత ఐఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 26,250 వరకు పొందవచ్చు. ఈ పాత ఫోన్ ధర కేవలం ఫోన్ కండిషన్, తయారీ సంవత్సరం, దాని మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ మోడల్ ఎంత కొత్తదైతే.. మీ పాత ఫోన్‌కి అంత ఎక్కువ ధరను పొందవచ్చు.

iPhone 13 Flipkart Offer

iPhone 13 Flipkart Offer

Read Also : Flipkart Summer Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.12,999 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

iPhone 13 స్పెసిఫికేషన్‌లు ఇవే :
ఐఫోన్ 13 ఫోన్ (25321170) పిక్సెల్‌ రిజల్యూషన్, 460ppi పిక్సెల్ డెన్సిటీతో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 13 A15 బయోనిక్ 5nm హెక్సా-కోర్ ప్రాసెసర్‌తో వచ్చింది. 128GB, 256GB, 512GB సహా 3 స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బాక్స్ iOS 15లో రన్ అవుతుంది. ముందు భాగంలో, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 12-MP లెన్స్‌తో వచ్చింది. ఆపిల్ iPhone బ్యాటరీ స్పెక్స్‌ను వెల్లడించలేదు. అయినప్పటికీ.. ఆపిల్ ఐఫోన్ 13 మోడల్ 3240mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 20W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

ఆపిల్ iPhone 14.. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED ప్యానెల్‌, సన్నని బెజెల్స్‌తో వచ్చింది. డిస్ప్లే HDRకి సపోర్టు ఇస్తుంది. 1200-నిట్స్ బ్రైట్‌నెస్, ఫేస్ ID సెన్సార్‌లతో వస్తుంది. 60Hz ప్రామాణిక రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 14 మోడల్ A15 బయోనిక్ చిప్, 16-కోర్ NPU, 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ గరిష్టంగా 4GB RAM, మూడు స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఐఫోన్ 128GB, 256GB, 512GB స్టోరేజీలతో వస్తుంది. ఐఫోన్ 14 లేటేస్ట్ స్టేబుల్ iOS 16 వెర్షన్‌తో రన్ అవుతుంది.

Read Also : Best Smartphones in India : రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. సరసమైన ధరలో ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?