Best Smartphones in India : రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. సరసమైన ధరలో ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?

Best Smartphones in India : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో రూ. 10వేల లోపు ధరలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Best Smartphones in India : రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. సరసమైన ధరలో ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?

Best smartphones under Rs 10K if you are looking for an affordable phone

Best Smartphones in India : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరకే స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. రూ. 10వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం కష్టమే. ఇప్పటికే మార్కెట్లో Realme, Poco, Lava, Moto వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు సరసమైన ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నాయి. మీ బడ్జెట్ కూడా రూ.10వేలు అయితే.. మంచి ఫీచర్లతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. పవర్‌ఫుల్ ప్రాసెసర్‌లతో హై స్టోరేజీ ఆప్షన్లు, హై-రిజల్యూషన్ డిస్‌ప్లేలు, బెస్ట్ కెమెరాలతో బడ్జెట్-ఫ్రెండ్లీ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ల లిస్టును మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ బెస్ట్ ఫోన్ కొనేసుకోండి.

మోటో G13 (Moto G13) :
2023 ఏడాది ప్రారంభంలోనే Moto G13 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లను కోరుకునే యూజర్లకు ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ HD+ డిస్‌ప్లేతో 6.5-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. MediaTek Helio G85 ప్రాసెసర్‌తో పాటు 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

Best smartphones under Rs 10K if you are looking for an affordable phone

Best Smartphones in India under Rs 10K if you are looking for an affordable phone

కెమెరా ముందు భాగంలో ఈ ఫోన్ 50-MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 8-MP సెల్ఫీ షూటర్‌తో వచ్చింది. బ్యాటరీ విషయానికొస్తే.. 5000mAh బ్యాటరీ యూనిట్‌తో వచ్చింది. Moto G13 ఫోన్ భారత మార్కెట్లో రూ 9,999 నుంచి అందుబాటులో ఉంది.

Read Also : Best Smartphones in India : కొత్త ఫోన్ కొంటున్నారా? ఏప్రిల్‌లో రూ.25వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

లవ Yuva 2 : (Lava Yuva 2) :
లావా కంపెనీ నుంచి ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో ప్రారంభ ధర రూ.7999 నుంచి అందుబాటులో ఉంది. స్పెక్స్ విషయానికి వస్తే, (Lava Yuva 2 Pro) ఫోన్ 6.5-అంగుళాల HD+ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek Helio G37 SoC ఆధారితంగా వచ్చింది.

Best smartphones under Rs 10K if you are looking for an affordable phone

Best Smartphones in India : Best smartphones under Rs 10K if you are looking for an affordable phone

13-MP ప్రైమరీ AI సెన్సార్, రెండు VGA ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చింది. స్క్రీన్ ఫ్లాష్‌తో కూడిన 5-MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ డివైజ్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 10W అడాప్టర్‌తో వస్తుంది. భారత మార్కెట్లో రూ. 10వేల లోపు ధరలో వచ్చిన బెస్ట్ ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు.

మోటో E13 (Moto E13) :
మోటో E13 ఫోన్ కూడా రూ. 10వేల లోపు ధరలో వచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్. ప్రస్తుతం రూ. 6999 ధరతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ Unisoc T606 SoC, Mali-G57 MP1 GPU ద్వారా పనిచేస్తుంది. 4GB RAM, 64GB స్టోరేజీతో అందిస్తుంది. మైక్రో SD ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. ఈ డివైజ్ 13-MP మెయిన్ బ్యాక్ కెమెరా, 5-MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 10W వైర్డ్ ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Best smartphones under Rs 10K if you are looking for an affordable phone

Best Smartphones in India under Rs 10K if you are looking for an affordable phone

రియల్‌మి C55 (Realme C55) :
రియల్‌మి C55 ఫోన్ ధర రూ. 10,999లకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌ల తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌ను సుమారు రూ. 10వేలకి కొనుగోలు చేయవచ్చు. రూ. 10వేల లోపు లభించే అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా ఉంది. Realme C55 Full-HD+ రిజల్యూషన్‌తో 6.72-అంగుళాల LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్‌ను కలిగి ఉంది.

Best smartphones under Rs 10K if you are looking for an affordable phone

Best Smartphones in India under Rs 10K if you are looking for an affordable phone

LPDDR4X RAM, EMMC 5.1 స్టోరేజీతో MediaTek Helio G88 SoC ద్వారా ఆధారితమైన ఈ ఫోన్ 64-MP ప్రైమరీ కెమెరా, 8-MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా Realme UI 4.0పై రన్ అవుతుంది. 5,000mAh బ్యాటరీతో పాటు బాక్స్‌లో 33W SuperVOOC వైర్డ్ ఛార్జర్‌కు సపోర్టు అందిస్తుంది.

Read Also : Vodafone-idea 5G Rollout : ఎట్టకేలకు భారత్‌లో వోడాఫోన్ ఐడియా 5G సర్వీసులు.. రావడం కొంచెం లేటైనా.. రావడం మాత్రం పక్కా..!