Best Smartphones in India : కొత్త ఫోన్ కొంటున్నారా? ఏప్రిల్‌లో రూ.25వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Best Smartphones in India : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం.. 2023 ఏప్రిల్‌లో రూ. 25వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు (Smartphones in 2023) కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Best Smartphones in India : కొత్త ఫోన్ కొంటున్నారా? ఏప్రిల్‌లో రూ.25వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Best smartphones to buy in India (Photo : Google)

Best Smartphones in India : భారత మార్కెట్లో అనేక సరికొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్లు (Smartphones in India) ఉన్నాయి. అయితే, ఏ స్మార్ట్‌ఫోన్ కొంటే బెటర్ అనేది చెప్పడం కష్టమే. చాలావరకూ అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు అద్భుతమైన ఫీచర్లతో (Smartphone Features) అందుబాటులో ఉన్నాయి. ప్రతి స్మార్ట్‌ఫోన్ ద్వారా వినియోగదారులు కమ్యూనికేషన్, ఎంటర్‌టైన్మెంట్ ఇలా మరెన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అనేక స్మార్ట్‌ఫోన్లపై అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన ఫీచర్లను అందించే స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవడం కష్టమే మరి.

అందుకే, ప్రస్తుతం భారత మార్కెట్లో (Indian Smartphone Market) కొనుగోలు చేయగల రూ. 25వేల లోపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల (Best Smartphones 2023) జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఈ స్మార్ట్‌ఫోన్‌లు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (5G)ని కలిగి ఉన్నాయి. మీ బడ్జెట్‌కు తగినట్టుగా మీ అవసరాలను కచ్చితంగా తీర్చగలవు. ఇక ఆలస్యం చేయకుండా.. ఇదే ధర పరిధిలోని టాప్ పోటీదారుల 5G స్మార్ట్‌ఫోన్ల జాబితాను అందిస్తున్నాం. ఈ జాబితాలో (OnePlus Nord CE 3 Lite) సహా మొత్తం నాలుగు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన మోడల్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయొచ్చు. అవేంటో ఓసారి లుక్కేయండి..

Read Also : Best Upcoming Smartphones : ఏప్రిల్ 2023లో రాబోయే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే మోడల్ ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

1. వన్‌ప్లస్ నార్డ్ CE 3 Lite 5G ఫోన్ :
వన్‌ప్లస్ (OnePlus Nord CE 3 Lite) 5G ఫోన్ భారత మార్కెట్లో అందుబాటులో లేదు. రూ. 25వేల లోపు స్మార్ట్‌ఫోన్‌ కావాలంటే.. ఇదో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. Nord CE 3 Lite బేస్ (8GB + 128GB స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ హాట్-సెల్లింగ్ (OnePlus Nord CE 2 Lite 5G)కి అప్‌గ్రేడ్ వెర్షన్. మీ బడ్జెట్లో Nord CE 3 Lite కొనుగోలు చేయాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ఈ మోడల్ ఫోన్ కలర్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Best smartphones to buy in India under Rs 25K in April 2023, Check Full List

Best Smartphones in India (Photo : Google)

వన్‌ప్లస్ 5G ఫోన్ ఇతర ముఖ్య ఫీచర్లలో కొత్త 108MP ప్రైమరీ రియర్ కెమెరా, డిస్‌ప్లే కూడా 120Hz IPS LCD ప్యానెల్ కలిగి ఉంది. అదనంగా, ఈ ఫోన్ ఇప్పటికీ పెద్ద 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. గత ఏడాది మోడల్ మాదిరిగానే ఉంది. కానీ, వేగవంతమైన 67W ఛార్జింగ్‌తో వస్తుంది. మీరు క్లీన్ UIతో పాటు మంచి పర్ఫార్మెన్స్ కలిగిన ఫోన్ కావాలనుకుంటే.. ఈ ధర బ్రాకెట్‌లో ఆక్సిజన్OS 13.1ని మరేదీ లేదని గమనించాలి.

2. పోకో X5 Pro 5G ఫోన్ :
రూ. 25వేల లోపు ధరలో (Poco X5 Pro 5G) ఫోన్ ఒకటి. ఈ ఫోన్ కంపెనీకి కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. (OnePlus) మాదిరిగానే 108MP ప్రైమరీ రియర్ కెమెరాతో Poco తొలి ఆఫర్ అందిస్తోంది. పగటి వెలుతురులో అద్భుతమైన, క్లియర్ ఫొటో షాట్‌లను తీయొచ్చు. ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 778G చిప్ ద్వారా పనిచేస్తుంది.

Best smartphones to buy in India under Rs 25K in April 2023, Check Full List

Best Smartphones in India (Photo : Google)

ఇతర పోటీదారు చిప్‌సెట్‌లతో పోలిస్తే.. 120Hz HDR 10+ డిస్‌ప్లే డాల్బీ విజన్ సపోర్ట్‌తో అద్భుతమైన ఫీచర్ కలిగి ఉంది. స్టీరియో స్పీకర్లతో మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఇతర ఫీచర్లలో IP53 రేటింగ్, 5,000mAh బ్యాటరీతో పాటు 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.

3. రియల్‌మి 10 Pro+ 5G ఫోన్ :
ఈ జాబితాలో 108MP ప్రైమరీ రియర్ కెమెరాను కలిగిన మరో స్మార్ట్‌ఫోన్ (Realme 10 Pro+ 5G). ఈ ఫోన్ రియల్‌మి 10Pro+ ఫోన్‌తో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. రూ. 25వేలలోపు బెస్ట్ ఫోన్‌గా కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ (Realme) లాంగ్ షాట్‌తో వచ్చింది.

Best smartphones to buy in India under Rs 25K in April 2023, Check Full List

Best smartphones in India (Photo : Google)

వాస్తవానికి, ఈ ధర పరిధిలో 120Hz వద్ద రిఫ్రెష్ అయ్యే కర్వడ్ AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్ మీకు మంచి పర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది. డైమెన్సిటీ 1080 SoCతో పాటు 8GB వరకు RAM, 256GB స్టోరేజీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో హుడ్ కింద పెద్ద 5,000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్ కూడా కలిగి ఉంది.

4. రెడ్‌మి Note 12 Pro 5G ఫోన్ :
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి (Redmi Note 12 Pro 5G) ఫోన్లలో ఇదొకటి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 25వేల లోపు ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. ఎవరికైనా కళ్లు మూసుకుని ఈ ఫోన్ కొనేసుకోవచ్చు. రెడ్‌మి నోట్ 12ప్రో కొన్ని ప్రీమియం ఫీచర్లతో అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది.

Best smartphones to buy in India under Rs 25K in April 2023, Check Full List

Best smartphones in India (Photo : Google)

అదే సమయంలో గత వెర్షన్ల కన్నా సన్నగా చాలా తేలికగా ఉంటాయి. రెడ్‌మి Note 12 Pro ధరలోనే అత్యుత్తమ 10-బిట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ ధర పరిధికి తగినట్టుగా బాగుంది. హుడ్ కింద డైమెన్సిటీ 1080 చిప్‌ కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP Sony IMX766 ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. ఆకర్షణీయమైన రంగులతో అందమైన షాట్‌లను పొందవచ్చు.

Read Also : Best Smartphones in India : మార్చిలో రూ.60వేల లోపు ధరలో సరసమైన టాప్ 3 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!