iPhone 13 Price Offer : ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

iPhone 13 Price Offer : కొత్త ఫోన్ కొంటున్నారా? ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ఆపిల్ (iPhone 13) మళ్లీ తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అదే శాంసంగ్ (Samsung Galaxy S23) స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ కూడా ఉంది.

iPhone 13 Price Offer : ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

iPhone 13 Price Offer : Photo : (Google)

iPhone 13 Price Offer : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో అత్యంత తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 13 (iPhone 13) అందుబాటులో ఉంది. ఆపిల్ అత్యంత పాపులర్ ఫోన్‌లలో ఐఫోన్ 13 ఒకటి. ఈ డివైజ్ దేశంలో ఐఫోన్ 12 ధరతో ప్రారంభమైంది. లేటెస్టు ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌కు సమానంగా ఉంటుంది. కానీ, 2021 స్మార్ట్‌ఫోన్.. అందుకే చాలా తక్కువ ధరకు సేల్ అందిస్తోంది. ఐఫోన్ లవర్స్‌కు మాత్రం ఆకర్షణీయమైన డీల్ అని చెప్పవచ్చు. ఆపిల్ ఐఫోన్ 13 బ్యాంక్ ఆఫర్‌తో రూ. 60వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ లవర్స్ కోసం శాంసంగ్ గెలాక్సీ (Samsung Galaxy S23) స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపు ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ 5G ఫోన్‌లలో లేటెస్ట్ (Flipkart Deals) డీల్స్ గురించి ఓసారి లుక్కేయండి.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 ఫోన్ రూ. 61,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 2వేల తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. దాంతో ఈ ఐఫోన్ ధర (128GB స్టోరేజ్ మోడల్) రూ.59,999కి తగ్గించింది. ఆపిల్ ఐఫోన్ 13ను రూ. 69,990 ప్రారంభ ధరతో అందిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం రూ. 7,901 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది. మీరు పాత ఫోన్‌ను అమ్మితే.. ఐఫోన్ 13ని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.30వేల వరకు తగ్గింపు ఆఫర్ పొందవచ్చు.

iPhone 13 Price Offer _ iPhone 13 and Samsung Galaxy S23 available at lower prices on Flipkart, here are the details

iPhone 13 Price Offer : Photo : (Google)

Read Also :  Apple iPhone 13 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ iPhone 13పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే కొనాలా? వద్దా?

మీ ప్రస్తుత ఫోన్ కండిషన్, వయస్సు ఆధారంగా ఎక్స్ఛేంజ్ మొత్తాన్ని లెక్కిస్తారు. మీరు (Cashify), ఇతర వెబ్‌సైట్‌లను కూడా చెక్ చేయవచ్చు. ఫ్లాగ్‌షిప్ Android ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లు (Flipkart Sale)లో శాంసంగ్ Galaxy S23ని చెక్ చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 79,999 వద్ద అందుబాటులో ఉంది. అయితే, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు ఈ ఫోన్ రూ. 74,999 ధరతో పొందవచ్చు ఎందుకంటే.. రూ. 5వేల డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. రూ. 27వేల వరకు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు.

రెండూ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు, యూజర్లకు సున్నితమైన గేమింగ్ పర్ఫార్మెన్స్ పొందవచ్చు. శాంసంగ్ ఫోన్‌తో మెరుగైన ఫొటోగ్రఫీని పొందవచ్చు. మీరు ఫోన్‌లలో అత్యుత్తమ డిస్‌ప్లేలను లాంగ్ లైఫ్ సాఫ్ట్‌వేర్ సపోర్టును పొందవచ్చు. 5G ఫోన్‌లు ఛార్జర్‌తో రావు. విడిగా కొనుగోలు చేయాలి. కానీ, ఛార్జింగ్ స్పీడ్ కావాలంటే ఎవరైనా ఐఫోన్ 13 కన్నా శాంసంగ్ ఫోన్‌ను పరిగణించాలి. శాంసంగ్ 25W ఛార్జర్ 30 నిమిషాల్లో బ్యాటరీని 50 శాతం వరకు టాప్ అప్ చేయొచ్చు. మరోవైపు, Apple 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్టును అందిస్తుంది. ఛార్జ్ చేసేందుకు ఎక్కువ సమయం పడుతుందని గమనించాలి.

Read Also : OnePlus Nord CE 3 : ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?