OnePlus Nord CE 3 : ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Nord CE 3 Lite Launch : వన్‌ప్లస్ (OnePlus) నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. Nord CE 3 Lite, Nord Buds 2 లాంచ్ ఈవెంట్ ఏప్రిల్ 4న సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. YouTubeలో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

OnePlus Nord CE 3 : ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Nord CE 3 Lite, Nord Buds 2 key features Photo : (Google)

OnePlus Nord CE 3 : ప్రముఖ చైనా తయారీదారు వన్‌ప్లస్ (OnePlus) నుంచి ఏప్రిల్ 4న భారత మార్కెట్లోకి రెండు సరికొత్త డివైజ్‌లు లాంచ్ కానున్నాయి. అందులో ఒకటి (Nord CE 3 Lite 5G) ఫోన్, రెండోది (Nord Buds 2) రియల్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌.. ఈ రెండింటిని వన్‌ప్లస్ అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ లాంచ్ ఈవెంట్ మంగళవారం (ఏప్రిల్ 4)న సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది.

వన్‌ప్లస్ అభిమానులు (YouTube)లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. మీరు లైవ్ ఈవెంట్‌కు ముందే ఈ రెండింటి ముఖ్య స్పెషిఫికేషన్లను (OnePlus Specifications) వెల్లడించింది. నార్డ్ CE 3 లైట్ వెర్షన్ 108-MP ప్రైమరీ కెమెరాతో రానున్న ఫస్ట్ వన్‌ప్లస్ ఫోన్. మరోవైపు, బడ్స్ 2 కూడా బాస్ వైబ్‌లతో డ్యూయల్-డ్రైవర్ సెటప్‌ను కలిగి ఉంది.

Read Also : OnePlus 10R Price : అత్యంత సరసమైన ధరకే వన్‌ప్లస్ 10R ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. కొత్త ధర ఎంతో తెలుసా?

వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ఫీచర్లు :
వన్‌ప్లస్ తమ స్మార్ట్‌ఫోన్‌లలో సరికొత్త ఫీచర్‌లతో సరికొత్త ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. 2022 నాటి నార్డ్ CE 2 లైట్ 5G మాదిరిగానే సరికొత్త Nord CE 3 లైట్ 2023ను అత్యంత సరసమైన ధరకే అందించనుంది. అయినప్పటికీ, ఈ కొత్త ఫోన్ 5G సపోర్ట్‌ను అందించనుంది. వన్‌ప్లస్ అధికారికంగా నార్డ్ CE 3 లైట్.. కొత్త లైమ్ కలర్ ఆప్షన్‌తో రానుంది. అయితే, వినియోగదారులు ట్రెడేషనల్ బ్లాక్(బూడిద) ఆప్షన్ కూడా అందించనుంది.

OnePlus Nord CE 3 Lite, Nord Buds 2 key features confirmed ahead of April 4 India launch

OnePlus Nord CE 3 Launch, Nord Buds 2 key features Photo : (Google)

వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరాలకు టూ రౌండ్ కటౌట్‌లు ఉన్నాయి. వన్‌ప్లస్ డిస్ప్లే సైజును పెంచే అవకాశం ఉంది. నార్డ్ CE 3 Lite ఫోన్ 6.72-అంగుళాల వ్యూతో రానుంది. డిస్ప్లే ప్యానెల్ మృదువైన స్క్రోలింగ్‌కు 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. రాబోయే ఈ ఫోన్ ప్రీమియం AMOLED డిస్‌ప్లేపై మరింత సరసమైన LCD ప్యానెల్‌ను అందించనుంది. ప్లాస్టిక్ బాడీ కూడా ఉండే అవకాశం ఉంది.

ఈ ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 695, 5000mAh బ్యాటరీతో రానుంది. వన్‌ప్లస్ కూడా Nord CE 3 Lite 5Gలో ఛార్జింగ్ టెక్నాలజీని 67Wకి అప్‌గ్రేడ్ చేస్తోంది. ఒక గంటలోపు ఫోన్‌ను ఛార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. వన్‌ప్లస్ Nord CE 3 లైట్  భారత మార్కెట్లో రూ. 21వేల నుంచి ప్రారంభం కానుంది. నార్డ్ CE 2 Lite 5G గత ఏడాదిలో రూ. 19,999 వద్ద లాంచ్ అయింది.

వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్ 2 ధర ఎంత ఉండొచ్చుంటే? :
వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్ 2 ప్రీమియం వన్‌ప్లస్ బడ్స్ Pro 2 కన్నా చాలా చౌకగా ఉండనుంది. ఇయర్‌బడ్‌లు ఒరిజినల్ నార్డ్ బడ్స్ మాదిరిగానే ఫ్లాట్ స్టెమ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. అతిపెద్ద అప్‌గ్రేడ్ డ్యూయల్-డ్రైవర్ సెటప్ రూ. 5వేలు (రూ. 10వేలు కూడా) లోపు ఇయర్‌బడ్‌లలో అందించనుంది. ఆడియో సెటప్ బెనిఫిట్స్ ఏమిటంటే.. ఇయర్‌బడ్‌లు ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తాయి. అయితే, బాక్స్ ఛార్జింగ్ అందించే అవకాశం లేదు. నార్డ్ బడ్స్ 2 కూడా పంచ్ బాస్ లెవల్స్ కొత్త ‘బాస్‌వేవ్’ టెక్నాలజీతో రానుంది.

Read Also : Google Pixel 7a Launch : గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఏంటి? ధర ఎంత ఉండొచ్చుంటే?