Google Pixel 7a Launch : గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఏంటి? ధర ఎంత ఉండొచ్చుంటే?
Google Pixel 7a Launch : గూగుల్ ప్రొడక్టుల్లో పిక్సెల్ 7 సిరీస్ నుంచి కొత్త మోడల్ రాబోతోంది. ఈ ఏడాది మే 10న I/O డెవలపర్ కాన్ఫరెన్స్‌లో (Pixel 7a) లాంచ్ కానుంది. భారత మార్కెట్లోనూ ఈ ఫోన్ (Pixel 7a Series) లాంచ్ కావొచ్చు.

Google Pixel 7a likely to launch on May 10 Photo : (Google)
Google Pixel 7a Launch : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) నుంచి సరికొత్త మోడల్ ఫోన్ రాబోతోంది. గత లాంచ్ ఈవెంట్లతో పోలిస్తే.. గూగుల్ నుంచి రాబోయే I/O డెవలపర్ కాన్ఫరెన్స్‌లో (Pixel 7a Launch) ఫోన్ లాంచ్ చేయనుంది. టెక్ దిగ్గజం గూగుల్ ఈవెంట్ వచ్చే నెల మే 10న అమెరికాలో జరుగనుందని ధృవీకరించింది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14OS ని కూడా ప్రవేశపెట్టనుంది. భారత మార్కెట్లో (Pixel 7a Series) ఎప్పుడు లాంచ్ అవుతుంది? ధర ఎంత ఉండొచ్చు? ఏయే స్పెసిఫికేషన్లతో రానుంది అనేది కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. ఈ ఫోన్ వివరాలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
భారత్‌లో గూగుల్ (Pixel 7a) మోడల్ లాంచ్ చేస్తుందా? లేదా అనేది ప్రకటించలేదు. గూగుల్ అందించే సరసమైన Pixel A సిరీస్ ఇప్పటికే భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ మార్కెట్లో గతంలో అనేక ఫ్లాగ్షిప్ ఫోన్లను నిలిపివేసింది. Pixel 5a మినహా Pixel A సిరీస్‌లోని అన్ని లేటెస్ట్ డివైజ్‌లను లాంచ్ చేసింది. చిప్ కొరత ఉన్నందున రెండోది భారత మార్కెట్లోకి రాలేదు. Pixel 6a భారత్‌లో ధర కూడా భారీగా పెరిగింది.
ధర ఎక్కవగా ఉండటంతో చాలా మంది పిక్సెల్ ఫోన్ లవర్స్‌ను నిరాశపరిచింది. అయినప్పటికీ, మిడ్-రేంజ్ ఫోన్ ధర కొంతకాలం తర్వాత భారీగా పడిపోయింది. చాలా మంది యూజర్లలో ఆసక్తిని రేకిత్తించింది. కంపెనీ CFO రూత్ పోరాట్ ప్రకారం.. Pixel 6a గూగుల్ హార్డ్‌వేర్ ఆదాయ వృద్ధిని పెంచింది. దానికి కారణం.. విక్రయాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటమే. మొత్తం మీద, టెక్ దిగ్గజం పిక్సెల్ 7aని ఈ ఏడాదిలో ఎప్పుడైనా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
భారత్‌లో Pixel 7a లాంచ్ ఎప్పుడంటే? :
గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయిన రెండు నెలల తర్వాత పిక్సెల్ 6a భారత మార్కెట్లో ప్రకటించింది. గూగుల్ నెక్స్ట్ జనరేషన్ Pixel A సిరీస్ ఫోన్ కూడా అదే ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది. Pixel 6a గత ఏడాది జూలైలో భారతీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. Pixel 7a 2023లో దాదాపు అదే సమయంలో రావచ్చు. ప్రస్తుతానికి, Pixel 7a ఇండియా లాంచ్ టైమ్‌లైన్‌పై ఎలాంటి నిర్ధారణ లేదు. ఈవెంట్ సమయంలోగూగుల్ ఇండియా (Google India) లాంచ్ వివరాలను ప్రకటించనుంది.

Google Pixel 7a likely to launch on May 10 Photo : (Google)
పిక్సెల్ 7a లీకైన ఫీచర్లివే :
Pixel 7a గూగుల్ Tensor G2 చిప్సెట్ ద్వారా రానుంది. LPDDR5 RAM, UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుందని చెప్పవచ్చు. FHD+ రిజల్యూషన్‌తో 6.1-అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉండనుంది. ఈ ప్యానెల్ 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండవచ్చు. Pixel 6a 60Hz స్క్రీన్‌పై అప్‌గ్రేడ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 18W వైర్డ్ ఛార్జింగ్ టెక్ సపోర్టుతో హుడ్ కింద 4,410mAh బ్యాటరీ ఉండవచ్చు. లీక్‌ల ప్రకారం.. రిటైల్ బాక్స్‌లో ఛార్జర్ ఉండదు. ఛార్జింగ్ స్పీడ్ గూగుల్ సపోర్టుని అందించనుంది.
ఎందుకంటే.. ఇప్పుడు కనీసం 65W లేదా 80W ఛార్జింగ్ టెక్నాలజీతో వచ్చే Android డివైజ్‌లను కలిగి ఉంది. 64-MP సోనీ IMX787 ప్రైమరీ సెన్సార్‌తో సహా వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండవచ్చు. పిక్సెల్ 6aలో కనిపించే 12.2-MP మెయిన్ సెన్సార్ కన్నా అప్‌గ్రేడ్ అవుతుంది. 12-MP అల్ట్రావైడ్ సోనీ IMX712 కెమెరా ద్వారా బ్యాకప్ చేయొచ్చు. 5G ఫోన్ ఆర్కిటిక్ బ్లూ, కార్బన్, కాటన్, జాడే కలర్ వేరియంట్లలో అమ్మకానికి ఉండవచ్చని రూమర్ మిల్ సూచిస్తుంది. ఈ డివైజ్ స్టీరియో స్పీకర్లతో కూడా వచ్చే అవకాశం ఉంది.
Pixel 7a లీకైన ధర వివరాలివే :
అమెరికా మార్కెట్లో పిక్సెల్ 7a ధర 450 డాలర్లు నుంచి 500 డాలర్ల మధ్య ఉంటుంది (సుమారు రూ. 37,100 నుంచి రూ. 41,200)గా ఉండనుంది. గత వెర్షన్లలో Pixel 6a, Pixel 5a ధరకు వచ్చే అవకాశం ఉంది. ఈ డివైజ్ 449 డాలరర్లు (సుమారు రూ. 36,900)కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాదిలో గూగుల్ లీక్ ప్రకారం.. కొత్త Pixel A సిరీస్ ఫోన్‌ను పాత ధరకే అందించే అవకాశం ఉంది. లేదంటే.. ధరను 50 డాలర్లకు పెంచవచ్చు. Pixel 6a భారత మార్కెట్లో రూ. 43,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.
భారతీయ మార్కెట్లో ధర కొంచెం ఎక్కువగానే ఉంది. కంపెనీ Pixel 7a ధరను పెంచకపోవచ్చు. ఈ 5G ఫోన్ ధర రూ. 50వేల లోపు ఉంటుంది. కంపెనీ అమెరికా మార్కెట్లో ధరను పెంచితే.. భారత మార్కెట్లో ఇప్పటికే ధర ఎక్కువగా ఉన్నందున ధరలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. పిక్సెల్6a భారత్, అమెరికాలో ధర మధ్య దాదాపు రూ. 7,000 గ్యాప్ ఉంది. వివిధ మార్కెట్లలో రాబోయే Pixel 7a ధర ఎంత ఉంటుందో లాంచ్ అయ్యే వరకు చూడాలి.